Son Of India | Mohan Babu : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “సన్ ఆఫ్ ఇండియా”(Son Of India) . ఈ సినిమా టీజర్ ఆ మధ్య విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. తమిళ సూపర్ స్టార్ సూర్య ఈ టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ లో మెగాస్టార్ చిరంజీవి తన వాయిస్ ఓవర్ తో అదరగొట్టారు. మోహన్ బాబు (Mohan Babu) రోల్‌ను వివరిస్తూ చిరంజీవి చెప్పిన విషయాలు ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమా నుంచి మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలకానుందని ప్రకటించింది టీమ్. డైమండ్ రత్న బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ని మేకర్స్ ఈ రోజు అంటే ఫిబ్రవరి 10న సాయంత్రం 4 గంటలకు విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. సమకాలీన అంశాలను చర్చించనున్నారట. మోహన్ బాబు (Mohan Babu) చాలా కాలం తర్వాత ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించనున్నారు. ఒక క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా వస్తున్నట్లు తెలుస్తోంది. సన్ ఆఫ్ ఇండియాకు డైమండ్ బాబు దర్శకుడు. మేస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు మోహన్ బాబు పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోందని తెలుస్తోంది.
ఇంకా ఈ టీజర్ (Son Of India) లో 'నేను చీకటిలో ఉండే వెలుతురుని.. వెలుతురులో ఉండే చీకటిని' అంటూ విలక్షణ నటుడు తనదైన శైలిలో చెప్పే డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. ఇక్కడ మరో విశేషం ఏమంటే.. ఆ మధ్య సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన 'ఓన్లీ వన్స్ ఫసక్' మాదిరిగా చివర్లో 'నేను కసక్ అంటే మీరందరూ ఫసక్' అని మోహన్ బాబు చెప్పడం ఆకట్టుకుంది. ఆసక్తికర కథతో తెరకెక్కిన ఈ చిత్రానికి మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఫిబ్రవరి 18న విడుదలకానుంది.
"Dialogue King" @themohanbabu ‘In & As’ #SonofIndia??
All set for the #SonofIndiaTrailer Release Today 10th Feb, 4:00 PM
?Maestro #Ilaiyaraaja Musical?on @adityamusic
Directed by @ratnababuwriter & Produced by @iVishnuManchu@24framesfactory #SLPP #SonofIndiaFromFeb18th? pic.twitter.com/3HAeFkCnxB
— 24 Frames Factory (@24FramesFactory) February 10, 2022
ఈ సినిమాలో మోహన్ బాబుతో (Mohan Babu)పాటు శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో తనికెళ్ళ భరణి, ఆలీ, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, రాజా రవీంద్ర, రఘుబాబు కనిపించనున్నారు. ఇళయరాజా సంగీత అందిస్తుండగా.. సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ilaiyaraaja, Mohan Babu, Pragya jaiswal, Son Of India