Mohan Babu Son Of India: పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన మోహన్ బాబు ‘సన్నాఫ్ ఆఫ్ ఇండియా’ మూవీ..

Mohan Babu Son Of India | నట ప్రపూర్ణ  మోహన్ బాబు గత కొన్నేళ్లుగా తాను చేసే సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇక మోహన్ బాబు హీరోగా ‘సన్నాఫ్ ఇండియా’ అనే చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఎంతో సింపుల్‌గా జరిగింది.

news18-telugu
Updated: October 23, 2020, 4:22 PM IST
Mohan Babu Son Of India: పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన మోహన్ బాబు ‘సన్నాఫ్ ఆఫ్ ఇండియా’ మూవీ..
లాంఛనంగా ప్రారంభమైన మోహన్ బాబు ‘సన్నాఫ్ ఇండియా’ మూవీ (Twitter/Photo)
  • Share this:
Mohan Babu Son Of India | నట ప్రపూర్ణ  మోహన్ బాబు గత కొన్నేళ్లుగా తాను చేసే సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ‘గాయత్రి’ మూవీ తర్వాత మోహన్ బాబు మరోసారి హీరోగా నటించలేదు. ఆ తర్వాత ‘మహానటి’ లో ఎస్వీఆర్ పాత్రలో నటించారు. ఇపుడు సూర్య హీరోగా నటిస్తోన్న ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాలో కథను కీలక మలుపు తిప్పే పాత్రలో ఎయిర్‌ఫోర్స్ అధికారి పాత్రలో నటించారు. ఈ సినిమా ఈ నెల 30న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కావాల్సిన ఉన్నా.. ఎయిర్‌ఫోర్స్ అథారిటీతో పాటు డిఫెన్స్ వాళ్ల నుంచి ఎన్‌ఓసీ రాకపోవడంతో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాకుండా పోయింది. ఆ  సంగతి పక్కనపెడితే.. మోహన్ బాబు 74వ స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ‘సన్ ఆఫ్ ఇండియా’ అనే సినిమాను ప్రకటించారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంయుక్తం తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాటల రచయత  డైమండ్ రత్నబాబు డైరెక్ట్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేసాడు. అంతేకాదు ఆ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ రోజు ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఎంతో సింపుల్‌గా నిర్వహించారు మంచు మోహన్ బాబు. ఈ విషయాన్ని మోహన్ బాబు ట్విట్టర్ వేదికగా తెలిపారు.


‘సన్నాఫ్ ఇండియా’ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై సంయుక్తంగా తెరకెక్కుతోంది. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి మంచు లక్ష్మీ ఆమె కూతురు విద్యా నిర్వాణ క్లాప్ కొట్టారు. విరానిక, ఐరా, అవ్‌రాజ్  కెమెరా స్విచ్ఛాన్ చేసారు. తొలి సన్నివేశానికి మంచు విష్ణు గౌరవ దర్శకత్వం వహించారు. దాదాపు 500 పైగా చిత్రాల్లో వివిధ పాత్రల్లో మెప్పించిన మోహన్ బాబు.. ఇపుడు సన్నాఫ్ ఇండియా అంటూ దేశ భక్తి నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ఈ సినిమా టైటిల్‌ను బట్టి చెప్పొచ్చు. డైమండ్ రత్నబాబు డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రానికి మోహన్ బాబు స్క్రీన్ ప్లే అందించారు. ఈ చిత్రానికి మేస్ట్రో ఇళయారాజా సంగీతం అందిస్తున్నారు. చాలా యేళ్ల తర్వాత తానే హీరోగా రూపొందుతోన్న ఈ చిత్రంతో మోహన్ బాబు మరోసారి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ కింగ్ అనిపించుకుంటాడా లేదా అనేది చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 23, 2020, 4:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading