Mohan Babu Son Of India: సన్నాఫ్ ఆఫ్ ఇండియాగా మోహన్ బాబు లుక్ బంభోళ జంబ..

సన్నాఫ్ ఇండియాగా మోహన్ బాబు (Twitter/MohanBabu)

Mohan Babu Son Of India | నట ప్రపూర్ణ మోహన్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సన్నాఫ్ ఇండియా’. చాలా యేళ్ల తర్వాత మోహన్ బాబు సోలో హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను తాజాగా విడుదల చేసారు.

  • Share this:
    Mohan Babu Son Of India First Look | నట ప్రపూర్ణ కలెక్షన్ కింగ్  మోహన్ బాబు గత కొన్నేళ్లుగా తాను చేసే సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ‘గాయత్రి’ మూవీ తర్వాత మోహన్ బాబు మరోసారి హీరోగా నటించలేదు. ఆ తర్వాత ‘మహానటి’ లో ఎస్వీఆర్ పాత్రలో నటించారు. గతేడాది సూర్య హీరోగా నటిస్తోన్న ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాలో కథను కీలక మలుపు తిప్పే పాత్రలో ఎయిర్‌ఫోర్స్ అధికారి పాత్రలో మెప్పించారు. ఆ  సంగతి పక్కనపెడితే.. మోహన్ బాబు  స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ‘సన్ ఆఫ్ ఇండియా’ అనే సినిమాను ప్రకటించారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాటల రచయత  డైమండ్ రత్నబాబు డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది.

    తాజాగా ఈ రోజు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్‌లో మోహన్ బాబు లుక్ రఫ్‌గా బాగుంది. మెడలో రుద్రాక్ష మాలతో దేశం కోసం తపన పడే వ్యక్తిగా మోహన్ బాబు లుక్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సన్నాఫ్ ఇండియా సినిమాను మోహన్ బాబు.. సమకాలీన రాజకీయాల నేపథ్యంలో ఈ రోజు సగటు భారతీయుడు ఎలా నలిగిపోతున్నాడనేది ఈ సినిమాలో చూపించనున్నట్టు ఈ సినిమా టైటిల్‌ను బట్టి అర్ధమవుతోంది.


    ‘సన్నాఫ్ ఇండియాను చిత్రానికి మాస్ట్రో ఇళయారాజా సంగీతం అందిస్తున్నారు. దాదాపు 500 పైగా చిత్రాల్లో వివిధ పాత్రల్లో మెప్పించిన మోహన్ బాబు.. ఇపుడు సన్నాఫ్ ఇండియా అంటూ దేశ భక్తి నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ఈ సినిమా టైటిల్‌ను బట్టి చెప్పొచ్చు.

    సన్నాఫ్ ఇండియాగా మోహన్ బాబు (Twitter/MohanBabu)


    డైమండ్ రత్నబాబు డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రానికి మోహన్ బాబు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. చాలా యేళ్ల తర్వాత మోహన్ బాబు సోలో హీరోగా రూపొందుతోన్న ఈ చిత్రంతో మోహన్ బాబు మరోసారి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ కింగ్ అనిపించుకుంటాడా లేదా అనేది చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: