Manchu Lakshmi: కోపం తట్టుకోలేక మంచు లక్ష్మిని చెంపమీద కొట్టిన మోహన్ బాబు...వైరల్ వీడియో...
ఫైల్ చిత్రం
లక్ష్మి మంచు అటు ఆహా ఓటీటీలో సైతం కుకింగ్ ప్రోగ్రాం ద్వారా తన సత్తా చాటింది. ఇక మంచు లక్ష్మి తాజాగా తన యూట్యూబ్ చానెల్ ద్వారా వ్లాగ్స్ చేస్తోంది. ఇప్పటికే తన ఇంటి హోం టూర్ చేయడం ద్వారా మంచు లక్ష్మి మిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదించుకుంది.
Manchu Lakshmi: మంచు ఫ్యామిలీ అంటేనే తెలుగు ఇండస్ట్రీకి ఓ పెద్ద దిక్కు అనే చెప్పాలి. మోహన్ బాబు సెంటర్ గా ఎదిగిన మంచు ఫ్యామిలీ నేడు టాలివుడ్ ఇండస్ట్రీలో పేరొందిన ఫ్యామిలీ, ఆ ఇంటి నుంచే మా అధ్యక్షుడు మంచు విష్ణు సైతం ఎన్నిక కావడం విశేషం. మా ఎన్నికల సందర్భంగా మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేసిన ప్రకాశ్ రాజ్ ను సైతం ఢీ కొని మంచు విష్ణు సత్తా చాటి, మంచు ఫ్యామిలీకి టాలివుడ్ మీద ఉన్న పట్టును రుచి చూపించాడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి వారు సపోర్ట్ చేసినా, మంచు విష్ణును ఆయన తండ్రి మోహన్ బాబు దగ్గరుండి మరీ గెలిపించారు. అంతటితో ఆగిపోలేదు. మెగా ఫ్యామిలీ పెద్ద దిక్కు చిరంజీవిని సైతం విష్ణు తన మాటలతో ఎటాక్ చేయడంతో, ప్రకాశ్ రాజ్ ప్యానెల్ తరపున గెలిచిన వారంతా రాజీనామా చేశారు.అలాగే టాలివుడ్ లో మంచు ఫ్యామిలీ తన సత్తా ఏంటో చూపించంది. అయితే మంచు ఫ్యామిలీ వెనుక ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అండ ఉందని అందుకే వాళ్లు అలా రెచ్చిపోతున్నారని, ఆపోజిట్ క్యాంపు ప్రచారం చేసినా, మోహన్ బాబు మాత్రం డోంట్ కేర్ అంటూ చెలరేగిపోతున్నారు. అటు సినిమాల విషయంలో మంచుఫ్యామిలీ వెనుకంజలోనే ఉన్నా, సినిమా రాజకీయాల్లో మాత్రం సత్తా చాటుతోంది.
ఇదంతా ఒక ఎత్తయితే మంచు ఫ్యామిలీ తరపున బుల్లితెరపై చెలరేగుతున్న మంచు లక్ష్మి తన ప్రోగ్రాంల ద్వారా అభిమానులను మూటగట్టుకుంటోంది. ముఖ్యంగా మంచు లక్ష్మి ఇఫ్పటికే పలు చానెల్స్ లో రియాలిటీ షోస్ చేసింది. అయితే లక్ష్మి మంచు అటు ఆహా ఓటీటీలో సైతం కుకింగ్ ప్రోగ్రాం ద్వారా తన సత్తా చాటింది. ఇక మంచు లక్ష్మి తాజాగా తన యూట్యూబ్ చానెల్ ద్వారా వ్లాగ్స్ చేస్తోంది. ఇప్పటికే తన ఇంటి హోం టూర్ చేయడం ద్వారా మంచు లక్ష్మి మిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదించుకుంది. అయితే తాజాగా ఆమె తన తండ్రి మోహన్ బాబు కొత్తగా శంషాబాద్ వద్ద నిర్మించిన ఇంటి హోం టూర్ సైతం నిర్వహించింది. దీనికి సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యింది. అందులో మోహన్ బాబు తన పర్మిషన్ లేకుండా ఇంటిని ఎందుకు వీడియో తీస్తున్నావని మంచు లక్ష్మిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఆమెపై చేయి చేసుకున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అటు తన తల్లిపై తాత చేయి చేసుకున్నాడని గమనించిన మంచు లక్ష్మి కుమార్తె తన తాతతో ఫైటింగ్ చేస్తున్న వీడియోలు నవ్వు తెప్పిస్తున్నాయి. అయితే ఇదంత సరదాగా జరిగిన విషయంగా గుర్తించవచ్చు.
వీడియో ఇక్కడ చూడండి..
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.