Alithor Saraga Mohan Babu: కులం, ప్రాంతం కారణంగా దారుణ అవమానాలు.. డ్రిల్ మాస్టర్‌గా పని చేశా: మోహన్ బాబు

Alithor Saraga Mohan Babu

Alithor Saraga Mohan Babu: తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా, విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న మంచు మోహన్ బాబు గురించి అందరికి తెలిసిందే. మొదటగా విలన్ గా పరిచయమైనా మోహన్ బాబు ఆ తర్వాత హీరోగా కూడా నటించి స్టార్ హీరో గా నిలిచాడు.

  • Share this:
    Alithor Saraga Mohan Babu: తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా, విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న మంచు మోహన్ బాబు గురించి అందరికి తెలిసిందే. మొదటగా విలన్ గా పరిచయమైనా మోహన్ బాబు ఆ తర్వాత హీరోగా కూడా నటించి స్టార్ హీరో గా నిలిచాడు. హాస్య పరమైన సినిమాలలో, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే గతంలో తను ఎదుర్కున్న కొన్ని అవమానాలు గురించి తాజాగా కొన్ని విషయాలు పంచుకున్నాడు.

    అసెంబ్లీ రౌడీ సినిమాలో తొలిసారిగా హీరోగా నటించాడు మోహన్ బాబు. ఈ సినిమా తనకు మంచి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో.. ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకున్నాడు. మొత్తం 150కి పైగా సినిమాలలో హీరోగా, 400 సినిమాలకు పైగా విలన్ గా నటించాడు. ఇక నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టాడు. అంతే కాకుండా తన సొంతంగా ఓ విద్యా సంస్థను కూడా నడిపిస్తున్నాడు.

    ఇది కూడా చదవండి:పంజాబీ హీరోయిన్‌కు గర్భం, అబార్షన్ అంటూ పోసాని వ్యాఖ్యలు.. పవన్ కళ్యాణ్ భారీ కౌంటర్

    ఇదిలా ఉంటే ఈయన తాజాగా ఈటీవీలో ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా షోకు వచ్చారు. ఇందులో తన గురించి చాలా విషయాలు పంచుకున్నాడు. తను ఇండస్ట్రీకి పరిచయం కాకముందు డ్రిల్ మాస్టర్ గా ఓ స్కూల్ లో జాయిన్ అయ్యాడట. అక్కడ తన సంపాదన 140 రూపాయలు అని.. అక్కడ ఓ ఏడాది పాటు పని చేశానని తెలిపాడు. ఇక స్కూల్ నిర్వహణలో ప్రధానంగా వ్యవహరించిన ఓ గ్రూపుకు చెందిన కులం వాడిని కాకపోవడంతో తనను ఉద్యోగం నుంచి తీసేసారని తెలిపాడు.

    ఇది కూడా చదవండి:రామ్ చరణ్ జీవితంలోకి మరో వ్యక్తి.. ముద్దులు, హగ్గులు ఇస్తూ ఉపాసనకు షాక్
     ఆ సమయంలో తనకు ఎంతో బాధ అనిపించింది అని.. దాంతో కులం అనేది అడ్డంకి కాకూడదని భావించి తను స్థాపించిన విద్యానికేతన్ స్కూల్ మొదట్లోనే.. తన స్కూల్ అడ్మిషన్ ఫామ్ లో కులం అనే కాలమ్ తీసేశాడట. అలా విద్యారంగంలో కులం అనే కాలమ్ తీసేసిన మొదటి వ్యక్తిగా ఇండియాలో నిలిచానని తెలిపాడు. ఇక తను ఓసారి సినిమాలలో వేషాలు అడుక్కోవడానికి నిర్మాతలు, దర్శకుల దగ్గరికి వెళ్ళినప్పుడు తనను.. నువ్వు రాయలసీమ వాడివి కదా.. నీకు భాష ఏం తెలుసు అని అన్నారట. దాంతో తానే స్వయంగా కష్టపడి పట్టుబట్టి నేర్చుకున్నానని తెలిపాడు. ఇక సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూసి, కొన్ని పుస్తకాలు చదివి ఆ తర్వాత భాష తెలుసు అని చెప్పాడట. అలా భాషను ఎంతో కసి, పట్టుదల, దీక్షతో నేర్చుకున్నానని తెలిపాడు మోహన్ బాబు.
    Published by:Navya Reddy
    First published: