Mohan Babu: ఆ వ్యక్తి నన్ను దారుణంగా మోసం చేసారు.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..

మోహన్ బాబు (Mohan Babu/Photo)

Mohan Babu: ఆ వ్యక్తి నన్ను దారుణంగా మోసం చేసారు అంటూ  మోహన్ బాబు మరోసారి  సంచలన కామెంట్స్ చేసారు.

  • Share this:
    Mohan Babu: ఆ వ్యక్తి నన్ను దారుణంగా మోసం చేసారు అంటూ  మోహన్ బాబు మరోసారి  సంచలన కామెంట్స్ చేసారు. ఇంతకీ మోహన్‌బాబును అంతలా మోసం చేసిన ఆ వ్యక్తి ఎవరో కాదు.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి మాజీ సీఎం చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు.ఇక చంద్రబాబు 19 ఏళ్ల క్రితం ప్రారంభించిన  హెరిటెజ్‌లో తాను పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి భాగస్వామిగా చేరానన్నారు. ఆ తర్వాత చంద్రబాబు తనను దారుణంగా మోసం చేశారని కామెంట్స్ చేశారు. హెరిటేజ్‌లో ఓ పార్ట్‌నర్‌గా ఉండాల్సిన నన్ను అవమానకర రీతిలో బయటకు పంపించి వేసారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు తనను మోసం చేసిన విషయాన్ని అప్పట్లో రాజశేఖర్ రెడ్డి దగ్గర ప్రస్తావించానన్నారు. తాజాగా మోహన్ బాబు హెరిటేజ్ గురించి చేసిన కామెంట్స్ నెటింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

    అప్పట్లో అన్న ఎన్టీఆర్ గారు నన్ను రాజ్యసభకు నామినేట్ చేస్తే.. చంద్రబాబు తనను ఎందుకు పనికి రానని పక్కనపెట్టేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.ఇక వైయస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మోహన్ బాబు ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీకి దగ్గరైంది. ఆ తర్వాత మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు ..రాజశేఖర్ రెడ్డి సోదరుడి కుమార్తెను ప్రేమ వివాహం చేసుకోవడంతో వైయస్ ఫ్యామిలీకి మంచు ఫ్యామిలీకి దగ్గరైంది. కానీ కాలం ఎపుడు ఒకేలా ఉండదు కదా. ఒకప్పుడు స్నేహితులుగా ఉన్న మోహన్ బాబు, చంద్రబాబు.. ఇపుడు నిత్య శతృవులు అయ్యారు.

    Manchu Lakshmi shares throwback pic of ap ex cm nara chandra babu naidu With mohan babu,Mohan babu,chandra babu naidu,mohan babu chandra babu naidu,manchu lakshmi twitter,manchu lakshmi instagram,manchu family,manchu mohan babu,mohan babu twitter,mohan babu instagram,tirupati news,mohan babu house arrest,mohan babu dharna,andhra pradesh news,Andhra pradesh politics,Mohan Babu chandra babu naidu ys jagan mohan reddy politics,Mohan babu Chandra babu naidu ntr YS jagan,మోహన్ బాబు హౌస్ అరెస్ట్,మోహన్ బాబు ధర్నా, శ్రీ విద్యానికేతన్, తిరుపతిలో ఉద్రిక్తత,చంద్రబాబు నాయుడు,టీడీపీ చంద్రబాబు నాయుడు మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్,వై.యస్. జగన్మోహన్ రెడ్డి వైయస్ఆర్‌సీపీ పాలిటిక్స్,తెలుగు సినిమా,టాలీవుడ్ న్యూస్,పాలిటిక్స్,చంద్రబాబు నాయుడు,మోహన్ బాబు,మోహన్ బాబు చంద్రబాబు నాయుడు,
    చంద్రబాబు నాయుడు,మోహన్ బాబు


    అంతేకాదు 2019 సార్వత్రిక ఎన్నికల ముందు చంద్రబాబు తన విద్యాసంస్థలకు ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ సకాలంలో చెల్లించికపోవడాన్ని నిరసిస్తూ ధర్నా చేసిన సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత మోహన్ బాబు ..వై.యస్.జగన్మోహన్ రెడ్డికి చెందిన వైసీపీలో జాయిన్ అయ్యారు. అంతేకాదు చంద్రబాబు ఎన్నికల ఓడిపోవడంలో తన వంతు పాత్ర పోషించిన సంగతి తెలిసిందే కదా.

    Gap between mohan babu and cm ys jagan, actor mohan babu, cm ys jagan mohan reddy, ysrcp, ap politics, ap latest news, మోహన్ బాబు జగన్‌ మధ్య పెరిగిన గ్యాప్, నటుడు మోహన్ బాబు, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ, ఏపీ తాజా వార్తలు
    వైసీపీలో చేరిన మోహన్ బాబు(File/Photo)


    మరోవైపు తాను యాక్ట్ చేస్తోన్న ’సన్నాఫ్ ఇండియా’ సినిమాలో సమకాలీన సామాజిక అంశాలను ప్రస్తావించబోతున్నట్టు చెప్పుకొచ్చారు. ఇక  ఈసినిమాకు తాను స్క్రీన్ ప్లే అందించడానికి పెన్ను పట్టిన విషయాన్ని చెప్పారు. ఇక సినిమాల్లో తన కెరీర్ అసిస్టెంట్‌గా డైరెక్టర్‌గా మొదలైన విషయాన్ని ప్రస్తావించారు. అలా అని డైరెక్టర్‌ను మాత్రం కాలేనన్నారు. నేను దర్శకుడిని అయితే.. షూటింగ్ విషయంలో సమయపాలన పాటించని వాళ్లపై చేయి చేసుకుంటానన్నారు. అందుకే మెగాఫోన్‌కు దూరంగా ఉన్నానన్నారు.  ఇక మోహన్ బాబ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘సన్నాఫ్ ఇండియా’ సినిమా విడుదల తేదిని త్వరలో ప్రకటించనున్నారు.

    ఇవి కూడా చదవండి.. 

    నందమూరి నట సింహా బాలకృష్ణ తన ఫిల్మీ కెరీర్‌లో రీమేక్ చేసిన సినిమాలు ఇవే..

    Sarkaru Vaari Paata - Pushpa : సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన మహేష్, బన్ని నిర్మాతలు..


    నాగ చైతన్య టూ సత్యదేవ్.. బాలీవుడ్‌లో బాట పడుతున్న టాలీవుడ్ హీరోలు..

    ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్‌కు రాజమౌళి మరో బిగ్ షాక్ ఇవ్వనున్నారా.. ?
    Published by:Kiran Kumar Thanjavur
    First published: