దయచేసి అలాంటి వార్తలు వద్దంటూ దండం పెడుతున్న మోహన్ బాబు..

సినిమాల్లో నైనా, రాజకీయాల్లో నైనా  మోహన్ బాబు రూటే సెపరేటు. ఒకప్పుడు టీడీపీ తరుపున రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన కలెక్షన్ కింగ్.. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు, విద్యా సంస్థలే లోకంగా బతికారు. కానీ 2019 ఎన్నికల ముందు అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీలో జాయిన్ అయ్యారు.దీంతో తనపై వస్తున్న వదంతలపై స్పందించారు.

news18-telugu
Updated: June 5, 2019, 12:46 PM IST
దయచేసి అలాంటి వార్తలు వద్దంటూ దండం పెడుతున్న మోహన్ బాబు..
మోహన్ బాబు ఫైల్ ఫోటో
  • Share this:
సినిమాల్లో నైనా, రాజకీయాల్లో నైనా  మోహన్ బాబు రూటే సెపరేటు. ఒకప్పుడు టీడీపీ తరుపున రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన కలెక్షన్ కింగ్.. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు, విద్యా సంస్థలే లోకంగా బతికారు. కానీ 2019 ఎన్నికల ముందు అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీలో జాయిన్ అయ్యారు. అంతేకాదు ఆ పార్టీ తరుపున తన గొంతును బలంగానే వినిపించారు. ఇక సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ రికార్డు స్థాయిలో మెజారిటీ సాధించి జగన్మోహన్ రెడ్డి నవ్వాంధ్రకు రెండో ముఖ్యమంత్రి అయ్యారు.  ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి రాజకీయంగా కుటుంబ పరంగా చాలా దగ్గరి వ్యక్తి అయిన మోహన్ బాబుకు ఎన్నికల ఫలితాల తర్వాత తిరుమత తిరుపతి దేవస్థానం బోర్డ్ చైర్మన్ పదవి ఖాయమనే వార్తలు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

తనకు టీటీడీ బోర్డ్ అధ్యక్ష పదని రానున్నట్టు వస్తున్న వార్తలపై తాజాగా మోహన్ బాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ముఖ్యంగా మీడియా వర్గాలు ఇలాంటి వదంతులు రాయోద్దని విజ్ఞప్తి చేసారు. ముఖ్యంగా మోహన్ బాబుకు చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో ఆయనపై ఇలాంటి వార్తలు వస్తున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

తనకు టీటీడీ బోర్డ్ చైర్మన్ పదవి విషయంలో నాకు గత కొన్ని రోజులుగా ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. నా కోరిక ఒక్కటే. జగన్మోహన్ రెడ్డిని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నాను. చూసాను. ఆయనకు పాలనలో తన వంతు ఏదైనా సాయం చేయాలనుకుంటున్నాను. అంతకు మించి మరేమి లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి నమ్మకంతోనే రాజకీయాల్లో మళ్లీ రీ ఎంట్రీ  ఇచ్చాను. ఎలాంటి పదవులు ఆశించి రాలేదంటూ మీడియాకు విజ్ఞప్తి చేసారు.మరోవైపు జగన్ మోహన్ రెడ్డి తనను నమ్మి ఏదైనా పదవి అప్పగిస్తే అపుడు ఆలోచిస్తానన్నారు.

 
First published: June 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading