Home /News /movies /

Mohan Babu : ప్రపంచ సినీ చరిత్రలో ఆ రికార్డు నాకు మాత్రమే సొంతం అంటున్న మోహన్ బాబు..

Mohan Babu : ప్రపంచ సినీ చరిత్రలో ఆ రికార్డు నాకు మాత్రమే సొంతం అంటున్న మోహన్ బాబు..

మోహన్ బాబు (Youtube/Credit)

మోహన్ బాబు (Youtube/Credit)

Mohan Babu : ప్రపంచ సినీ చరిత్రలో ఆ రికార్డు నాకు మాత్రమే సొంతం అంటున్న నట ప్రపూర్ణ, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.. తాజాగా మోహన్ బాబు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  సినీ, రాజకీయాలతో పాటు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

    Mohan Babu : ప్రపంచ సినీ చరిత్రలో ఆ రికార్డు నాకు మాత్రమే సొంతం అంటున్న నట ప్రపూర్ణ, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.. తాజాగా మోహన్ బాబు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  సినీ, రాజకీయాలతో పాటు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మోహన్ బాబు విషయానికొస్తే..  తెలుగు సినీ పరిశ్రమలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా అడుగుపెట్టి.. హీరోగా మారి.. ఆపై ప్రతినాయకుడిగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. కమెడియన్‌గా ఆపై మళ్లీ హీరోగా సత్తా చూపెట్టిన వన్ అండ్ ఓన్లీ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. అంతేకాదు హీరోగా ఎంట్రీ ఇచ్చి విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా నటించి మళ్లీ హీరోగా మారిన నటుడు మన దేశంలో బహుశా ఒక్క మోహన్ బాబు మాత్రమే అనే చెప్పాలి.

    హీరోగా 150పైగా చిత్రాలు.. విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా..  400 పైగా చిత్రాలు. నిర్మాతగా 60 పైగా చిత్రాలు. విద్యావేత్తగా కీర్తి ప్రతిష్ఠలు.. రాజకీయవేత్తగా లబ్ధ ప్రతిష్ఠులు. మోహన్ బాబు. ఇక భారతీయ చిత్ర  పరిశ్రమలో కాదు.. కాదు ప్రపంచ సినీ చరిత్రలో ఓ నటుడిగా ఉంటూ 60 పైగా చిత్రాలను నిర్మించిన హీర్ కమ్ నిర్మాతగా మోహన్ బాబు తప్ప మరెవరు లేరని తాజాగా తన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. త్వరలో ఈ విషయమై గిన్నీస్ బుక్ ‌లో నమోదు చేయించే పనిలో ఉన్నారు.

    Nayanthara - Anushka: అనుష్క టూ నయనతార.. ఆ తరహా పాత్రలో ఇరగదీసిన భామలు..

    మోహన్ బాబు తర్వాత ఆర్. నారాయణ మూర్తి.. నిర్మాతగా ఎక్కువ చిత్రాలు నిర్మించిన హీరోగా రికార్డులకు ఎక్కారు. దాంతో పాటు దర్శకుడిగా ఎక్కువగా చిత్రాలు తెరకెక్కించిన హీరోగా నిలిచారు. మోహన్ బాబు విషయానికొస్తే.. ‘స్వర్గం నరకం’ కంటే ముందు శోభన్ బాబు హీరోగా నటించిన ‘కన్నవారి కలలు’ సినిమాలో ఓ చిన్న పాత్రలో మెరిసారు. అందులో భక్తవత్సలం నాయుడు పేరు టైటిల్స్ కార్డ్స్‌లో వేసారు. దీంతో పాటు మోహన్ బాబు సినీ, రాజకీయాలకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు. అంతేకాదు ఎన్టీఆర్, దాసరి నారాయణరావు, రజినీకాంత్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

    Bollywood 2022 Release Movies : ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ సహా బాలీవుడ్‌లో విడుదల కాబోతున్న టాలీవుడ్ హీరోల ప్యాన్ ఇండియా మూవీస్ ఇవే..

    ఇక సినీ ఇండస్ట్రీలో ఎవరికి వారే గొప్ప. యథా రాజా.. తథా ప్రజా అంటూ వేదాంతాన్ని వెల్లవించారు. మరోవైపు ‘మా’ ఎన్నికలపై వేదాంతం ప్రకటించారు. ఇక కూతురు మంచు లక్ష్మి ప్రోద్బలంతోనే సూర్య హీరోగా నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాలో నటించినట్టు చెప్పారు. మరోవైపు గుణశేఖర్ దర్శకత్వంలో సమంత టైటిల్ రోల్లో ‘శాకుంతలం’ సినిమాలో తన క్యారెక్టర్‌కు సూటయ్యే దుర్వాస మహాముని పాత్రలో నటించినట్టు చెప్పారు. మొత్తంగా సినీ ఇండస్ట్రీలో ఇపుడు జరుగుతున్నంత చూసి తన మనసు చువుక్కు మనిపించిందన్నారు. మొత్తంగా ఈ ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: MAA Elections, Mohan Babu, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు