హోమ్ /వార్తలు /సినిమా /

Mohan Babu - Nagababu : మోహన్‌బాబుకు నాగబాబు కౌంటర్.. నన్ను ఆ విషయాల్లో లాగొద్దు అంటూ వార్నింగ్..

Mohan Babu - Nagababu : మోహన్‌బాబుకు నాగబాబు కౌంటర్.. నన్ను ఆ విషయాల్లో లాగొద్దు అంటూ వార్నింగ్..

మోహన్ బాబు, నాగబాబు (Twitter/Photo)

మోహన్ బాబు, నాగబాబు (Twitter/Photo)

Mohan Babu - Nagababu :  కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు(Mohan Babu) కు మెగా బ్రదర్ నాగబాబు (Naga Babu) కౌంటర్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..

  Mohan Babu - Nagababu :  కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు(Mohan Babu) కు మెగా బ్రదర్ నాగబాబు (Naga Babu) కౌంటర్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. గత కొన్నేళ్లుగా ‘మా’ లో అధ్యక్ష ఎన్నికల వేదికగా నటీనటులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. పట్టుమని 1000 సభ్యులు కూడా లేని ‘మా’ అసోసియేషన్స్ (Movie Artist Association) లో రాజకీయాలు ఎంతో దారుణంగా ఉన్నాయి. కరెక్ట్‌గా వచ్చే నెల 10న మా ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఎలక్షన్ డేట్ అనౌన్స్ కావడంతో మా అధ్యక్ష బరిలో ఉన్న వాళ్లతో పాటు ప్యానల్ సభ్యులు కూడా ఎన్నికలు రెడీ అవుతున్నారు.  ఈ సారి అధ్యక్ష బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, హేమ, జీవిత, సివిఎల్ నరసింహారావు, కాందబరి కిరణ్ ఉన్నారు. ప్రచారం చేసుకోడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నారు.

  ఏదైనా అద్భుతం జరిగితే కానీ ఏకగ్రీవం కావడానికి పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవు. అంతేకాదు పోటీలో ఉన్న వాళ్లు ఎవరికే వారే తాము గెలుస్తామన్న ధీమాతో ఉన్నారు. పోటీలో ఇంత మంది ఉన్న ముఖ్యమైన పోటీ ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. త్వరలో ఎన్నికలు నిర్వహించాలని కార్యనిర్వాహక సభ్యులు క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు కృష్ణంరాజుకు లేఖలు రాసిన సంగతి తెలిసిందే కదా. మరోవైపు చిరంజీవి కూడా ‘మా’కు త్వరలో ఎన్నికలు నిర్వహించాలని కోరిన సంగతి తెలిసిందే కదా. పైకి ఎవరికి వారు అంతా ఒక్కటే అని చెబుతున్నా.. ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారికున్నాయి.

  Tollywood Brothers : సినీ ఇండస్ట్రీలో హీరోలుగా సత్తా చాటిన అన్నదమ్ములు.. నందమూరి టూ మెగా బ్రదర్స్..

  తాజాగా ‘మా’కు అధ్యక్షులుగా పనిచేసిన మోహన్ బాబు.. గతంలో ‘మా’ ప్రెసిడెంట్‌గా పనిచేసినవారు..ఎక్కువ ధరకు అసోసియేషన్ బిల్డింగ్ కొని తక్కువ రేటుకు అమ్ముకున్నారంటూ మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలకు మెగా బ్రదర్ నాగబాబు అంతే ఘాటుగా స్పందించారు. వీళ్లిద్దరు గతంలో ‘మా’ అధ్యక్షులుగా పనిచేసిన సంగతి తెలిసిందే కదా. దీనిపై నాగబాబు మాట్లాడుతూ.. బిల్డింగ్ వ్యవహారం అంతా శివాజీరాజా, నరేశ్‌లకు మాత్రమే తెలుసన్నారు. ఈ విషయమై ఏంజరిగిందనే దానిపై   ప్రస్తుత అధ్యక్షుడు నరేష్‌నే అడగాలన్నారు.

  Ram Charan - Shankar : పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన రామ్ చరణ్, శంకర్ మూవీ..

  గత నెలలో మూవీ అర్టిస్ట్ అసోసియేషన్ క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు కృష్ణంరాజు నేతృత్వంలో జూమ్ ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. పలువురు ‘మా’ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. ‘మా’ బిల్డింగ్ ఎక్కువ ధరకు కొని.. తక్కువ రేటుకు ఎందుకు అమ్మేశారనే విషయాన్ని ప్రశ్నించారు. ఆ సందర్భంగా సినీ పెద్దలు ఎందుకు మాట్లాడలేదనే విషయాన్ని ప్రస్తావించారు.

  Tollywood Thatha Manavallu : ఎన్టీఆర్ టూ నాగ చైతన్య వయా అల్లు అర్జున్, రానా వరకు టాలీవుడ్‌లో సత్తా చూపెడుతోన్న మనవళ్లు..

  దీనిపై నాగబాబు మాట్లాడుతూ.. ‘మా’ భవనం కొనుగోలు చేసినపుడు తాను అధ్యక్షుడిగా ఉన్నట్టు పేర్కొన్నారు. సినీ పెద్దల సూచనలు, సలహాలతో అప్పటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని రూ. 71.73 లక్షలతో బిల్డింగ్ కొనుగోలు చేసినట్టు చెప్పారు. లోపల ఇంటీరల్ డిజైన్ కోసం మరో రూ. 3 లక్షల వరకు ఖర్చు చేసినట్టు పేర్కొన్నారు. 2006 నుంచి 2008 వరకు తాను అధ్యక్షుడిగా ఉన్నాను. 2008లో మా అధ్యక్ష పీఠం నుంచి తప్పుకున్నప్పటి నుంచి ‘మా’ రోజు వారి వ్యవహారాల్లో నేను పాల్గొనలేదు. ‘మా’ ను ఎలా అభివృద్ధి పథంలో నడిపించాలనే విషయమై మాత్రమే నేను కొన్ని సలహాలు సూచనలు ఇచ్చినట్టు చెప్పారు.

  Balakrishna Industry Hits: మంగమ్మ గారి మనవడు టూ నరసింహనాయుడు వరకు ఇండస్ట్రీ హిట్ సాధించిన బాలకృష్ణ సినిమాలు ఇవే..

  ఇక బిల్డింగ్ అమ్మకం వ్యవహారం అంతా శివాజీ రాజా, నరేష్‌లకు మాత్రమే తెలుసన్నారు. శివాజీ రాజా అధ్యక్షుడిగా.. నరేష్ కార్యదర్శిగా ఉన్నపుడే భవనాన్ని అమ్మకానికి పెట్టి రూ. 30 లక్షలకే దాన్ని విక్రయించారన్నారు. అతి తక్కువ రేటుకే ‘మా’ బిల్డింగ్‌ను ఎందుకు అమ్మాల్సి వచ్చిందో నరేశ్‌ను అడిగితే బాగుంటుందన్నారు. మీరు నరేశ్‌ను ప్రశ్నించండి. నేను కూడా ఇదే విషయమై నరేశ్‌ను నిలిదీస్తానన్నారు. మళ్లీ బిల్డింగ్ అమ్మకం వ్యవహారాల్లో నన్ను లాగితే బాగుండదూ అంటూ నాగబాబు మోహన్ బాబు మాటలకు కౌంటర్ ఇచ్చారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: MAA Elections, Mohan Babu, Nagababu, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు