Mohan Babu - Manchu Vishnu : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ సీనియర్ హీరో కమ్ నటుడు, నిర్మాత మోహన్ బాబు, ఆయన తనయుడు తాజాగా జరిగిన మా ఎలక్షన్స్‌లో అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు భేటి కానున్నారా అంటూ ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు. పట్టుమని 900 మంది కూడా ‘మా’ ఎలక్షన్స్ సాధారణ ఎలక్షన్స్‌ను తలపించాయి. అంతేకాదు ఈ ఎన్నికల్లో చిరంజీవి మెగా కాంపౌండ్ మద్దతుతో పోటీ చేసిన ప్రకాష్ రాజ్.. అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా ప్రకాష్ రాజ్ పై గెలిచారు. త్వరలో ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సారి మా అసోసియేషన్ ఎన్నికల్లో కంటికి కనిపించని యుద్ధం జరిగింది.
అందులో మరీ ముఖ్యంగా మోహన్ బాబు వర్సెస్ చిరంజీవి యుద్ధం మరోసారి తెరపైకి వచ్చింది. దాన్ని కొందరు ధైర్యంగా తెర ముందు కూడా చెప్పారు. అక్కడ పోటీలో మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఉన్నాడు.. మరొకవైపు ప్రకాష్ రాజ్ నిలబడ్డాడు. కానీ చివరకు మంచు విష్ణు ఎన్నికల్లో గెలవడంతో చిరంజీవిపై మోహన్ బాబు పై చేయి సాధించినట్టైయింది.
మొత్తంగా తనయుడు మంచు విష్ణు గెలుపు కోసం తెర వెనక మోహన్ బాబు అంతా తానై నడిపించారు. పోల్ మేనేజ్మెంట్ సహా అన్ని చక్కగా మేనేజ్ చేసి అనుకున్నది సాధించారు. అంతేకాదు ‘మా’ ఎన్నికల ముందు పలు మీడియాలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బల్లగుద్ది మరి చెప్పారు. అనుకున్నంటే మంచు విష్ణును మా అధ్యక్షుడిగా గెలిపించుకోగలిగారు.
ఈ సారి ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో లోకల్, నాన్ లోకల్ ఇష్యూ బాగా పని చేసింది. దాంతో పాటు ఎక్కడో పక్క రాష్ట్రం నుంచి వచ్చినవాడు తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉండడానికి పనికిరాడు అనే విషయాన్ని పదేపదే మీడియా ముందు గుర్తుచేశారు మంచు విష్ణుకు చెందిన ప్యానల్ సభ్యులు. అంతేకాదు వీళ్లు ప్రకాష్ రాజ్‌పై మాటల దాడి బాగానే చేశారు. అటువైపు ఎంతో మంది మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నా.. ప్రకాష్ రాజ్ వైపు బలంగా నిలబడడానికి ఎవరూ లేరు. చివర్లో నాగబాబు మాట్లాడిన .. అది ప్రకాష్ రాజ్‌కు మైనస్‌గా మారింది.
NBK : బాలకృష్ణ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘సమరసింహారెడ్డి’ మూవీలో ముందుగా అనుకున్న హీరో ఎవరంటే..
తాజాగా ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణును గెలవడంతో మోహన్ బాబు మీడియాతో మాట్లాడారు. అంతేకాదు తెలంగాణ, ఏపీకి చెందిన ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి బాగానే పరిపాలిస్తున్నారని కితాబు ఇచ్చారు. ఈ రకంగా పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా మోహన్ బాబు.. మా అధ్యక్షుడిగా ఎన్నికైన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో త్వరలో భేటి కానున్నారు. దసరా రోజు మంచు విష్ణు.. ‘మా’ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏపీ సీఎంను కలిసే అవకాశాలున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలుబడాల్సి ఉంది. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలవనున్నారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చిత్ర సీమకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. దాంతో పాటు థియేటర్స్ సమస్యను చర్చించే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm ys jagan mohan reddy, Manchu Vishnu, Mohan Babu, Tollywood