
మోహన్ బాబు, పవన్ కళ్యాణ్ (File/Photos)
Mohan Babu Pawan Kalyan | పవన్ కళ్యాణ్ రూట్లో మోహన్ బాబు ఆ పని చేయడానికీ రెడీ అవుతున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయకుడిగా, ప్రతి నాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దాదాపు 500కి పైగా సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మోహన్ బాబు. తాజాగా ఈయన పవన్ రూట్లో ఆ పనికి శ్రీకారం చుట్టబోతున్నారు.

పవన్ కళ్యాణ్ రూట్లో మోహన్ బాబు ఆ పని చేయడానికీ రెడీ అవుతున్నారు. (Twitter/Photo)

తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయకుడిగా, ప్రతి నాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దాదాపు 500కి పైగా సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మోహన్ బాబు. (File/Photo)

మోహన్ బాబు హీరోగానే కాకుండా.. నిర్మాత శ్రీ లక్ష్మీప్రసన్ప పిక్చర్స్ బ్యానర్ పై 50పైగా చిత్రాలను ప్రొడ్యూస్ చేసి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. (Twitter/Photo)

ప్రస్తుతం ఆచితూచి సినిమాలను చేస్తోన్న మోహన్ బాబు తమిళంలో సూర్య హీరోగా ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాలో ముఖ్యపాత్రలో నటించారు. త్వరలో ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుంది. (Twitter/Photo)

అంతకు ముందు ’మహానటి’ లో మోహన్ బాబు చేసిన ఎస్వీఆర్ పాత్రకు మంచి పేరు వచ్చింది. (Twitter/Photo)

తాజాగా మోహన్ బాబు ‘సన్నాఫ్ ఇండియా’ మూవీని స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా అనౌన్స్ చేసారు. (Twitter/Photo)

ఈ సినిమా తర్వాత మోహన్ బాబు మెగా ఫోన్ పట్టుకోబోతున్నట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. త్వరలో తాను డైరెక్ట్ చేయబోయే సినిమాకు సంబంధించిన కథ కూడా రెడీ అయినట్టు చెప్పారు. (Twitter/mohan babu)

ఈ సినిమాలో మోహన్ బాబు హీరోగా నటిస్తారా ? వాళ్ల కుటుంబానికి చెందిన హీరోలు నటిస్తారా లేకపోతే వేరేవాళ్లతో ఈ చిత్రం తెరకెక్కిస్తారనేది మాత్రం వెల్లడించలేదు. మోహన్ బాబు నటుడు కాకముందు దర్శకత్వ శాఖలో పనిచేసిన అనుభవం ఉంది.(Twitter/mohan babu)

ఇన్నేళ్ల కెరీర్లో ఎపుడు మెగాఫోన్ పట్టుకోని మోహన్ బాబు.. ఇపుడు దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నారు. మోహన్ బాబు కంటే చిత్ర పరిశ్రమలో దర్శకులు అయిన హీరోలెరున్నారో చూద్దాం.

మోహన్ బాబు కంటే ముందు దర్శకులుగా సత్తా చాటిన ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ సహా పలువురు హీరోలు (File/Photo)

చాలా మంది హీరోలు...ఓనర్ గా సినిమా అనే ఓడను లీడ్ చేసినా...కెప్టెన్ గా...ఒకమూవీని లీడ్ చేసినవాళ్లు చాలా తక్కువ మందే ఉన్నారు. కానీ కొంత మంది మాత్రమే అటు హీరోగా వుంటునే దర్శకుడిగా సత్తా చూపెట్టారు. అలా హీరో నుంచిదర్శకులుగా మారిన కథానాయకుల్లో ఎన్టీఆర్ ఒకరు. (Twitter/Photo)

సీతారామకళ్యాణం మూవీతో దర్శకడిగా మారినతారకరాముడు...ఆ తర్వాత ‘గులేభకావళి కథ’, ‘దాన వీర శూర కర్ణ’, ‘చాణక్య చంద్రగుప్తా’, ‘తల్లాపెళ్లామా’ వంటి ఎన్నో పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికం వంటి ఒకదానితో ఒకటి సంబంధం లేనటువంటి డిఫరెంట్ జానర్ చిత్రాలను తెరకెక్కించి అటు హీరోగానే కాకుండా ఇటు దర్శకడిగా అనితర సాధ్యుడు అనిపించుకున్నారు. (Sr NTR)

ఈ మద్యనే మన దగ్గరున్న చాలా మంది కథానాయకులు...అటుహీరోలుగా నటిస్తునే నిర్మాతలుగా సక్సెస్ సాధించారు. కానీ కొంత మంది మాత్రం ఒక అడుగుముందుకేసి డైరెక్టర్‌గా సత్తా చాటారు. అటు హీరోగా వుంటూనే దర్శకులుగా మారిన హీరోల విషయానికొస్తే.. ఈ జనరేషన్లో తెలుగులో పవన్ కళ్యాణ్ ముందుంటాడు. ఈయన ‘జానీ’ మూవీతో దర్శకుడిగా మారాడు. ఇక ‘జానీ’ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించలేకపోయినా పవన్...దర్శకుడిగా ఆయన కున్న విజన్ ఏందో అందరికీ తెలిసింది. (Twitter/Photo)

అటు అడివి శేష్ కూడా నటుడిగా కాకుండా.. ’కిస్’ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ సినిమా సక్సెస్ సాధించకపోయినా.. రచయతగా, హీరోగా సత్తా చాటుతూనే ఉన్నాడు. (Twitter/Photo)

సూపర్ స్టార్ కృష్ణ ‘సింహాసనం’ సినిమాతో దర్శకుడుగా మెగాఫోన్ పట్టుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలకు దర్శకత్వం వహించిన ట్రాక్ రికార్డ్ ఈ నట శేఖరుడి సొంతం. (Twitter/Photo)

తొలి తెలుగు సూపర్ స్టార్ చిత్తూరు నాగయ్య కూడా దర్శకుడిగా ‘నా ఇల్లు’, భక్తరామదాసు వంటి కొన్ని చిత్రాలను డైరెక్టర్ చేసారు. (Youtube/Credit)

అటు ఎస్వీఆర్ కూడా నటుడిగా ఉంటూనే.. ‘బాంధవ్యాలు’, ‘చదరంగం’ వంటి సినిమాలతో దర్శకుడిగా ఆయన సత్తా ఏందో చూపెట్టారు. (Facebook/Photo)

సీనియర్ హీరో బాలయ్య..అమృతా ఫిలింస్ బ్యానర్లో ‘నిజము చెబితే నేరమా’,‘పసుపుతాడు’, ‘పోలీసు అల్లుడు’ వంటి చిత్రాలతో దర్శకుడిగా ఆయన సత్తా చూపెట్టారు. (Youtube/Credit)

భాను చందర్ కూడా ‘దేశ ద్రోహులు’ వంటి పలు చిత్రాలను డైరెక్ట్ చేసాడు. (Twitter/Photo)

గిరిబాబు కూడా దర్శకుడిగా ‘రణరంగం’, ‘ఇంద్రజిత్’ వంటి పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. (File/Photo)

హాస్య నటుడు పద్మనాభం నటుడానే కాకుండా దర్శకుడిగా ‘జాతకరత్న మిడతంబొట్లు’, శ్రీ రామకథ’, ‘కథానాయిక మొల్ల’ వంటి పలు చిత్రాలను డైరెక్ట్ చేసారు. (Twitter/Photo)

అటు లోకనాయకుడు కమల్ హాసన్ కూడా ‘చాచి 420’తో దర్శకుడి అవతారం ఎత్తాడు. ఆతర్వాత హేరామ్, పోతురాజు, విశ్వరూపం వంటి సినిమాలతో దర్శకుడిగా విశ్వరూపం చూపించాడు కమల్ హాసన్. (Twitter/Photo)

ఇగ కమల్ తోటి హీరో అయిన యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ‘‘జై హింద్’’వంటి డజను పైగా సినిమాలతో దర్శకుడిగా ఆయన ప్రతాపం చూపెట్టాడు. (Youtube/Credit)

విశాల్ కూడా త్వరలో దర్శకుడిగా సత్తా చూపెట్టబోతున్నాడు. (Twitter/Photo)

ధనుష్ కూడా ‘పవర్ పాండి’ సినిమాతో దర్శకుడిగా సత్తా చాటారు. (File Photo)

శింబు కూడా ‘వల్లభన్’ సినిమాతో డైరెక్టర్‌గా సత్తా చూపెట్టాడు. (Twitter/Photo)

శింబు తండ్రి టి.రాజేంద్రన్ కూడా ‘ప్రేమ సాగరం’ వంటి పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. (Twitter/Photo)

రాఘవ లారెన్స్ కూడా నృత్య దర్శకుడిగా, నటుడిగా ఇపుడు డైరెక్టర్‌గా సత్తా చాటుతూనే ఉన్నాడు. (Twitter/Lawrence)

ప్రభుదేవా కూడా నృత్య దర్శకుడిగా, నటుడిగా ఇపుడు డైరెక్టర్‌గా సత్తా చూపెడుతున్నాడు. (Twitter/Photo)

సత్యరాజ్ కూడా ‘విల్లాది విలన్’ మూవీతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నాడు. (File/Photo)

‘రాకేట్రి’ మూవీలో మాధవన్ మెగా ఫోన్ పట్టుకున్నాడు. (Twitter/Photo)

సుదీప్ కూడా పలు కన్నడ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. (Twitter/Photo)

ఉపేంద్ర కూడా దర్శకుడిగా మారిన తర్వాత హీరో అయ్యాడు. (Twitter/Photo)

కన్నడ సీనియర్ హీరో వి.రవిచంద్రన్ హీరోగా ఉంటూనే పలు సినిమాలను డైరెక్ట్ చేసారు. (Twitter/Photo)

తమిళ నటుడు ప్రతాప్ పోతన్ కూడా నాగార్జున హీరోగా నటించిన ‘చైతన్య’ సినిమాను డైరెక్ట్ చేయడంతో పాటు పలు చిత్రాలకు దర్శకత్వం వహించాడు. (Twitter/Photo)

మలయాళ వర్ధమాన హీరో పృథ్వీరాజ్ తొలిసారి ‘లూసీఫర్’ సినిమాను మోహన్ లాల్‌తో తెరకెక్కించాడు. ఈ చిత్రంలో పృథ్వీ రాజ్ మరో హీరోగా నటించాడు. (Twitter/Photo)

అజయ్ దేవ్ గన్ కూడా ‘యూ మి ఔర్ హమ్’’ సినిమాతో పాటు ‘శివాయ్’ మూవీతో దర్శకుడిగా ఆయన గట్స్ ఏందో చూపెట్టాడు. (Twitter/Photo)

ఆమీర్ ఖాన్ ‘తారే జమీన్ పర్’ సినిమాతో దర్శకుడిగా సత్తా చాటారు. (Intsagram/Aamir Khan)

సన్నిడియోల్ కూడా ‘దిల్లగి’, ‘ఘాయల్ వన్స్ ఎగైన్’ సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నాడు. (file/Photo)

ఫర్హాన్ అక్తర్ కూడా ఒకవైపు నటుడిగా మరోవైపు దర్శకుడిగా సత్తా చూపెడుతూనే ఉన్నాడు. (File/Photo)

హృతిక్ రోషన్ తండ్రి ఒకప్పటి హీరో రాకేష్ రోషన్ కూడా ఆయన కథానాయకుడిగా నటించిన సినిమాలనే కాదు...కరణ్ అర్జున్, కహోనా ప్యార్ హై, క్రిష్ సిరీస్ తో బాలీవుడ్ల ఇప్పటికీ సత్తా చూపెడుతూనే వున్నాడు. (Twitter/Photo)

గురుదత్ ...కాగజ్ కే పూల్, బాజ్, బాజీ, ప్యాసా సిన్మాలతో బాలీవుడ్లో దర్శక నటుడిగా ఆయనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. (File/Photo)

రాజ్ కపూర్ కూడా హీరోగా, దర్శకుడిగా రెండు పడవలపై మంచి ప్రయాణమే చేసాడు. బాలీవుడ్లో ఈయన డైరెక్షన్లో వచ్చిన ‘ఆగ్’, ‘బర్సాత్’, ‘బాబీ’, ’రామ్ తేరి గంగా మేలి’ వరకు ఎన్నో క్లాసిక్స్ వున్నాయి. (Twitter/Photo)

దేవానంద్ కూడా ‘ప్రేమ్ పూజారి’, ‘హరే రామ హరే కృష్ణ’ వంటి ఎన్నో సినిమాలతో దర్శకుడిగా బాలీవుడ్లో తనదైన ముద్ర వేసారు. (Twitter/Photo)

రాజ్ కపూర్ తమ్ముడైన ప్రముఖ హీరో శశి కపూర్ కూడా అమితాబ్ హీరోగా వచ్చిన ‘అజూబా’మూవీతో డైరెక్టర్‌గా సత్తా చూపెట్టారు. (Twitter/Photo)

రాజ్ కపూర్ పెద్ద కుమారుడు.. కరీనా, కరిష్మి కపూర్ల తండ్రి రణధీర్ కపూర్ కూడా ‘కల్ ఆజ్ ఔర్ కల్’ సినిమాతో దర్శకుడిగా బాలీవుడ్లో సత్తా చాటారు. (Twitter/Photo)

శశి కపూర్ అన్న రాజ్ కపూర్ రెండో కుమారుడైన రిషీకపూర్ కూడా అక్షయ్ ఖన్నా, ఐశ్వర్యారాయ్ హీరో, హీరోయిన్లుగా నటించిన ‘ఆ అబ్ లౌట్ చలే’ మూవీతో మెగాఫోన్ ఫట్టుకున్నారు. (File/Photo)

అటు హిందీల హీరోగా దర్శకుడిగా రాణించిన అతికొద్ది మందిలో ఫిరోజ్ ఖాన్ ముందుంటాడు. ఈయన ‘అపరాద్’, ‘ధర్మాత్మ’, ‘జాబాజ్’ వంటి సినిమాలతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసాడు. (File/Photo)

సునీత్ దత్ తాను హీరోగానే కాకుండా.. కొడుకు సంజయ్ దత్ తొలి చిత్రం ‘రాఖీ’ సినిమాతో పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. (Twitter/Photo)

మనోజ్ కుమార్ కూడా దేశ భక్తికి సంబంధించిన ‘క్రాంతి’, తో పాటు ‘రోటీ కప్డా ఔర్ మకాన్’ వంటి పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. (Twitter/Photo)

‘నర్తనశాల’ సినిమాతో దర్శకుడుగా మెగాఫోన్ పట్టుకోవాలనుకున్నాడు బాలకృష్ణ. కానీ సౌందర్య మరణంతో దర్శకుడు అవ్వాలనుకున్న బాలయ్య కోరిక అలాగే మిగిలిపోయింది. (Twitter/Photo)
Published by:Kiran Kumar Thanjavur
First published:September 11, 2020, 11:56 IST