Home /News /movies /

MOHAN BABU FIRST LOOK RELEASED FROM MANCHU LAKSHMI AGNI NAKSHATRAM SLB

Mohan Babu:అగ్ని నక్షత్రం నుంచి మోహన్ బాబు లుక్ రివీల్.. ఆయన క్యారెక్టర్ ఇదే!

Mohan Babu Photo/Twitter

Mohan Babu Photo/Twitter

Manchu Lakshmi Agni Nakshatram: శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ మరియు మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై కలెక్షన్ కింగ్ డా.మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి నిర్మిస్తున్న చిత్రం 'అగ్ని నక్షత్రం'. ఇటీవలే ఈ సినిమా టైటిల్ ని రివీల్ చేయడం జరిగింది. తాజాగా ఈ రోజు (జూలై 31) డా.మంచు మోహన్ బాబు ఫస్ట్ లుక్‌ని విడుదల చేసారు.

ఇంకా చదవండి ...
మంచు మోహ‌న్ బాబు న‌ట‌ వార‌సురాలిగా సినీ గడప తొక్కిన మంచు లక్ష్మి.. విరామం లేని సినీ ప్రయాణం చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా పలు డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తోంది. రీసెంట్ గానే తన కొత్త సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేసిన మంచు లక్ష్మి.. ఆ సినిమా ప్రమోషన్స్‌పై ప్రత్యేక శ్రద్ద పెట్టింది. అగ్ని నక్షత్రం అనే పేరుతో రాబోతున్న ఈ మూవీకి సంబంధించి గత కొన్ని రోజులుగా వరుస అప్డేట్లు వదులుతోంది. తాజాగా చిత్రంలోని మరో పాత్రను అందరికీ పరిచయం చేసింది.

శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ మరియు మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై కలెక్షన్ కింగ్ డా.మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి నిర్మిస్తున్న చిత్రం 'అగ్ని నక్షత్రం'. ఇటీవలే ఈ సినిమా టైటిల్ ని రివీల్ చేయడం జరిగింది. తాజాగా ఈ రోజు (జూలై 31) డా.మంచు మోహన్ బాబు ఫస్ట్ లుక్‌ని విడుదల చేసారు. ఈ చిత్రంలో ప్రొఫెసర్ విశ్వామిత్రగా మోహన్ బాబు కనిపించబోతున్నారు. 

తన ఆలోచనలతో, ఆదర్శాలతో కొండలను సైతం కదిలించగల డాషింగ్, డైనమిక్ సైకియాట్రిస్ట్ మరియు ప్రొఫెసర్ ఈ విశ్వామిత్ర. గంభీరమైన లుక్ తో మోహన్ బాబు గారు ఓ డిఫరెంట్ క్యారెక్టర్ తో ఈ సినిమాలో అలరించబోతున్నారని లుక్‌ని చూస్తే అర్ధమవుతోంది. ఫస్ట్ టైమ్ డా. మోహన్ బాబు, ఎవర్ ఛార్మింగ్ మంచు లక్ష్మీప్రసన్న కలిసి తెర పంచుకుంటున్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు సముద్రఖని కీలక పాత్ర చేస్తున్నారు. మలయాళంలో ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన మలయాళ నటుడు సిద్దిక్ విలన్ గా నటిస్తున్నారు. చైత్ర శుక్ల ద్వితీయ ముఖ్య పాత్రలో, విశ్వంత్ కథా నాయకుడిగా, జబర్దస్త్ మహేష్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వం వహిస్తుండగా, మధురెడ్డి ఎడిటర్ గా లిజో కె జోస్ సంగీతం, గోకుల్ భారతి కెమెరామెన్ గా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమాలో డిఫరెంట్ పాయింట్ టచ్ చేశారని, ఇది మంచు ఫ్యామిలీకి మెమరబుల్ సినిమా అవుతుందని అంటున్నారు. ఏదేమైనా ఈ సినిమాతో తన మార్క్ చూపించాలని గట్టి ప్రయత్నం చేస్తోంది మంచు లక్ష్మి.
Published by:Sunil Boddula
First published:

Tags: Mohan Babu, Tollywood, Tollywood actor

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు