హోమ్ /వార్తలు /సినిమా /

ఆ నలుగురి థియోటర్ల గుత్తాధిపత్యంపై మంచు లక్ష్మీ సంచలన వ్యాఖ్యలు..

ఆ నలుగురి థియోటర్ల గుత్తాధిపత్యంపై మంచు లక్ష్మీ సంచలన వ్యాఖ్యలు..

మంచు లక్ష్మి ఫైల్ ఫోటో(Image:Facebook)

మంచు లక్ష్మి ఫైల్ ఫోటో(Image:Facebook)

Manchu Lakshmi Sensational Commnets | తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్న థియోటర్ల గుత్తాధిపత్యంపై మంచు లక్ష్మీ ఫైర్ అయింది. ఆ నలుగురే థియేటర్స్‌ను గుప్పిట్లో పెట్టుకొని శాసిస్తున్నారంటూ మండిపడింది. అంతేకాదు ఆ నలుగురే చిన్న సినిమాలకు థియేటర్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ తన వెబ్ సిరీస్ ‘మిసెస్ సుబ్బలక్ష్మి’ అనే వెబ్ సిరీస్ లాంఛ్ ఈవెంట్‌లో ఒకింత ఘాటుగానే స్పందించింది.

ఇంకా చదవండి ...

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్న థియోటర్ల గుత్తాధిపత్యంపై మంచు లక్ష్మీ ఫైర్ అయింది. ఆ నలుగురే థియేటర్స్‌ను గుప్పిట్లో పెట్టుకొని శాసిస్తున్నారంటూ మండిపడింది. అంతేకాదు ఆ నలుగురే చిన్న సినిమాలకు థియేటర్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ తన వెబ్ సిరీస్ ‘మిసెస్ సుబ్బలక్ష్మి’ అనే వెబ్ సిరీస్ లాంఛ్ ఈవెంట్‌లో ఒకింత ఘాటుగానే స్పందించింది. ఇపుడీ వ్యాఖ్యలు ఫిల్మ్ వర్గాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఇపుడున్న క్లిష్ట పరిస్థితుల్లో నిర్మాతగా సినిమాలు తీయాలంటే భయం వేస్తుంది. సినిమా తీసినంత సేపు హాయిగానే ఉంటుంది.  కానీ రిలీజ్ టైమ్‌లో జనాల్లోకి తీసుకెళ్లే సమయంలో చాలా ఇబ్బందులను ఫేస్ చేయాల్సి వస్తోంది అంటూ వాపోయింది.థియేటర్ల కంట్రోల్ మన చేతుల్లో ఉండదు. ఎన్ని రోజులు సినిమాల థియేటర్స్‌లో ఉంటుందో తెలియని అయోమయ పరిస్థితి ఉందన్నారు.

ఒక సినిమా తీయడానికి ఒక యేడాదికిపైగా కష్టపడతాం. ఇందులో కొన్ని వందల మంది కష్టం ఉందున్నారు. నా  సినిమా రిలీజైన తర్వాత ఏదో సినిమా వస్తుందని మా సినిమాలు పీకేయడాలు జరిగినపుడు చాలా బాధ పడ్డాను. ఐదారు మంది చేతుల్లోనే థియేటర్స్ ఉన్నాయి. పెద్ద చిన్నా అని చూడరు. వారిని వెళ్లి అడిగే పరిస్థితి ఉండదు. ఒకవైపు ఈ వ్యాఖ్యలు చేస్తూనే వెబ్ సిరీస్ రావడానికి ప్రత్యేక కారణాలు ఏమి లేదు. టెలివిజన్, సినిమా, వెబ్ సిరీస్ ఏదైనా నాకు కంటెంట్ ముఖ్యం. వెబ్ సిరీస్ అని తక్కువ క్వాలిటీతో ఏమి చేయలేదు. కథలతో ప్రయోగాలు చేయడానికి మంచి ఫ్రీడమ్ ఉంటుందన్నారు. ఇపుడు థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఇంట్లో కూర్చొని అదే క్వాలిటీతో ఇచ్చే పరిస్థితులొచ్చాయి. అందుకే చాలా మంది కొత్త సినిమాలు నెట్ ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్‌లో ఎఫుడు వస్తున్నాయా అని ఎదురు చూస్తున్నారు.

First published:

Tags: Manchu Family, Manchu Lakshmi, Mohan Babu, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు