HOME »NEWS »MOVIE »mohan babu charecter in koratala siva chiranjeevi movie here are the details ta

చిరంజీవి, కొరటాల శివ సినిమాలో మోహన్ బాబు పాత్ర పై చిత్ర యూనిట్ క్లారిటీ..

చిరంజీవి, కొరటాల శివ సినిమాలో మోహన్ బాబు పాత్ర పై చిత్ర యూనిట్ క్లారిటీ..
చిరంజీవి,మోహన్ బాబు (Twitter./Photo)

‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత చిరంజీవి  కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నాడు. రీసెంట్‌గా ఈ సినిమా ఒక పాటతో షూటింగ్ ప్రారంభమైంది. చిరంజీవి, త్రిషలపై ఈ పాటను పిక్చరైజ్ చేసారు. ఈ చిత్రంలో మోహన్ బాబు పాత్రపై క్లారిటీ ఇచ్చారు.

  • Share this:
‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత చిరంజీవి  కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నాడు. రీసెంట్‌గా ఈ సినిమా ఒక పాటతో షూటింగ్ ప్రారంభమైంది. చిరంజీవి, త్రిషలపై ఈ పాటను పిక్చరైజ్ చేసారు. ఈ చిత్రాన్ని కొరటాల శివ దేవాదాయ శాఖ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. దేవాలయాలను నిర్లక్ష్యం చేయడం వలన  సమాజంపై ఎంత చెడు ప్రభావం చూపుతాయనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఇందులో చిరంజీవి.. దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఈ చిత్రం కోసం చిరంజీవి దాదాపు ఐదారు కిలోల వరకు బరువు తగ్గాడు. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో సీనియర్ హీరో మోహన్ బాబు ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో వార్తలు వెలుబడ్డాయి. తాజాగా ఈ చిత్రంలో మోహన్ బాబు పాత్రపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాలో మోహన్ బాబు నటిస్తున్నాడనే వార్తలు అవాస్తవం అని చెప్పారు. ఆయనకు తగ్గ క్యారెక్టర్ మా సినిమాలో లేదని చెబుతున్నారు. ఒకవేళ ఆయనకు తగ్గ పాత్ర ఉంటే తప్పక సంప్రదించే వాళ్లం అంటూ క్లారిటీ ఇచ్చారు. చిరంజీవి, మోహన్ బాబు విషయానికొస్తే.. ఎన్నో సినిమాల్లో హీరోగా, విలన్‌గా కలిసి నటించారు.

koratala siva copy mohan babu flop movies of chiranjeevi movie,chiranjeevi,koratala siva,chiranjeevi mohan babu koratala siva,koratala siva copy mohan babu flop movie,ram charan young chiraanjeevi,chiranjeevi movies,regina cassandra,chiranjeevi regina,regina item song in chiranjeevi movie,chiranjeevi koratala siva,chiranjeevi koratala siva different concept,vijayashanti,vijayashanti mahesh babu sarileru neekevvaru,vijayashanti movies,chiranjeevi vijayashanti,chiranjeevi vijayashanti hit pair,chiranjeevi vijayashanti again pair in koratala siva movie,chiranjeevi twitter,chiranjeevi instagram,chiranjeevi facebook,chiranjeevi,vijayashanti,vijayashanti movies,vijayashanti facebook,vijayashanti twitter,vijayashanti instagram,chiranjeevi hit movies,manchi donga songs,chiranjeevi movies parts,telugu movies,chiranjeevi birthday special,chiranjeevi full movies,chiranjeevi hit songs,chiranjeevi comedy scenes,vijayashanti movies parts,chiranjeevi and vijayashanti,chiranjeevi vijayashanthi movies,chiranjeevi vijayashanthi hit songs,chiranjeevi & vijayashanti love parts,telugu full movies,tollywood,telugu cinema,చిరంజీవి,విజయశాంతి,చిరంజీవి విజయశాంతి,మరోసారి జోడి కట్టబోతున్న చిరంజీవి,విజయశాంతి,కొరటాల శివ సినిమాలో విజయశాంతి చిరంజీవి,చిరంజీవికి జోడిగా విజయశాంతి,విజయశాంతి,విజయశాంతి సరిలేరు నీకెవ్వరు,డిఫరెంట్ కాన్పెప్ట్‌తో చిరంజీవి కొరటాల శివ,మోహన్ బాబు ఫ్లాప్ మూవీ,యంగ్ చిరంజీవిగా రామ్ చరణ్,
చిరంజీవి,మోహన్ బాబు, కొరటాల శివ (Twitter/Photo)




తొలిసారి వీళ్లు ‘కిరాయి రౌడీలు’ సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత ‘పట్నం వచ్చిన పతివ్రతలు, బిల్లా రంగా, చక్రవర్తి,మంచి దొంగ,యుద్ధభూమి, లంకేశ్వరుడు, కొండవీటి దొంగ, చివరగా ‘కొదమ సింహం’ సినిమాల్లో కలిసి నటించారు. ఇపుడు మరోసారి వీళ్లిద్దరు కలిసి నటిస్తారనే వార్త ఫిల్మ్ నగర్‌లో షికారు చేసింది. మొత్తానికి చిరంజీవి సినిమాల్లో మోహన్ బాబు నటించడం లేదనే విషయం తేలిపోయింది. ఇక కొరటాల శివ, చిరంజీవి చిత్రానికి ‘ఆచార్య’ అనే పేరు పరిశీలిస్తున్నారు. మణిశర్మ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఆగష్టు 14న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ చిత్రం కూడా కొరటాల శివ శైౌలిలో సామాజిక అంశాలకు కమర్షియల్ టచ్ ఇచ్చి తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో యంగ్ చిరంజీవి పాత్రలో రామ్ చరణ్ కనిపించనున్నాడు. ఈచిత్రం తర్వాత చిరంజీవి మలయాళంలో మోహన్ లాల్ హీరోగా హిట్టైన ‘లూసిఫర్’ సినిమాను సుకుమార్ దర్శకత్వంలో చేయనున్నట్టు సమాచారం.
Published by:Kiran Kumar Thanjavur
First published:February 13, 2020, 07:36 IST