Manchu Vishnu : మంచు విష్ణు గతంలో చేసిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించకపోవడంతో కొంత గ్యాప్ తీసుకుని ప్రస్తుతం తెలుగు ఇంగ్లీష్ భాషాల్లో 'మోసగాళ్లు' అనే సినిమా చేస్తున్నాడు. మంచు విష్ణు పుట్టిన రోజు సందర్భంగా ఆ మధ్య ఈ సినిమాకు సంబందించి పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. కాగా మంచు విష్ణు కెరీర్ చూస్తే.. స్టార్ హీరో కుమారుడిగా పరిచయమై విష్ణు చేసిన సినిమాలు పెద్దగా ప్రేక్షకుల్నీ అలరించలేకపోయాయి. అయితే ఆయన చేసిన కొన్ని కామెడీ సినిమాలలో ఒకటిరెండు సినిమాలు పేలాయి. ఇంతవరకు కెరీర్‌ను టర్న్ చేసే స్థాయి సూపర్ హిట్ మాత్రం ఒక్కటి కూడా రాలేదు. దీంతో సినిమాల నుంచి లాంగ్ గ్యాప్ తీసుకున్న విష్ణు.. కొంత కాలంగా బిజినెస్ మీదే దృష్టి పెట్టి ప్రస్తుతం ఓ క్రాస్ ఓవర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్ జానర్లో వస్తోన్న ఈ సినిమాను 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తోంది. దీనికి సంబందించిన లుక్ కూడా తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. అయితే ఇక్కడ విశేషమేమంటే కాజల్ ఈ సినిమాలో మంచు విష్ణుకు చెల్లెలిగా నటిస్తుందని టాక్. కాజల్‌తో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో హిందీ నటుడు సునీల్ శెట్టి, రుహానీ సింగ్‌లు నటిస్తున్నారు. ఈ సినిమాను 2020 సమ్మర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
అది అలా ఉంటే.. నిన్న మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని విష్ణు ప్రధాన పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఓ భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. దాదాపు 60 కోట్ల బడ్జెట్‌తో భారీగా తెరకెక్కనున్న ఈ పౌరాణిక చిత్రంలో విష్ణు 'భక్త కన్నప్ప'గా కనిపించనున్నాడు. కాగా ఈ సినిమాలోని నటీనటులు సాంకేతిక నిపుణులు వివరాలు త్వరలో ప్రకటించనుంది చిత్రబృందం. మరోవైపు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ 'అహం బ్రహ్మస్మి' అనే భారీ పాన్ ఇండియా మూవీని తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఇలా వరుసగా సినిమాలను ప్రకటిస్తూ మంచు ఫ్యామిలీ అందరికి షాక్ ఇస్తోంది.
60 Crores budget tho Vishnu Vardham Babu, Bhaktha Kannappa chithraanni nirmisthaaru - Sri Kalahasthi Temple lo prakatinchina Collection King Dr. Mohanbabu pic.twitter.com/VNmFMz3zFg
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.