Mohan Babu : మోహన్ బాబు తెలుగు సినీ పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా అడుగుపెట్టి.. హీరోగా మారి.. ఆపై ప్రతినాయకుడిగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. కమెడియన్‌గా ఆపై మళ్లీ హీరోగా సత్తా చూపెట్టిన వన్ అండ్ ఓన్లీ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. తాజాగా ఈయన ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసారు. ఈ ప్రోగ్రామ్ వచ్చే సోమావారం సెప్టెంబర్ 27న ప్రసారం కానుంది. ఆలీతో సరదగా 250 ఎపిసోడ్ సందర్భంగా మోహన్ బాబు ఈ ప్రోగ్రామ్‌కు ముఖ్యఅతిథిగా రానున్నారు. దానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసారు. ఈ సందర్భంగా మోహన్ బాబు తన సినీ జీవితానికి సంబంధించిన విశేషాలతో పాటు తన పర్సనల్ విషయాలతో పాటు చిరంజీవితో తన అనుబంధం త్వరలో జరగనున్న ‘మా’ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా మోహన్ బాబు ఈ ప్రోమోలో కంఠం కంచు.. ఇంటిపేరు మంచు. విలన్‌గా 400 పైగా చిత్రాలు. హీరోగా 150 చిత్రాలు. నిర్మాతగా 60 పైగా చిత్రాలు. విద్యావేత్తగా కీర్తి ప్రతిష్ఠలు.. రాజకీయవేత్తగా లబ్ధ ప్రతిష్ఠులు. డాక్టర్ కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు గురించి చెప్పారు. ఈ సందర్భంగా ఆలీ మాట్లాడుతూ.. మీ వయసు ఎంత అని మోహన్ బాబును అడిగారు.
బాలయ్య సినిమా టైటిల్‌తో బాక్సాఫీస్ పై గర్జించడానికి రెడీ అవుతున్న షారుఖ్ ఖాన్..
దీనికి మోహన్ బాబు 19 మార్చ్ 1965 అని సమాధానం చెప్పారు. దీనికి ఆలీ అది 35 ఇది 42 అన్న.. మిమ్మల్ని 42 యేళ్ల క్రితం కలిసాను. దానికి మోహన్ బాబు మాట్లాడుతూ.. అపుడు నా వయసు 14 యేళ్లు అని ఛమాత్కరంగా సమాధానం ఇచ్చారు. దానికి ఆలీ నేను అపుడే పుట్టానా అని కౌంటర్ ఇవ్వడం నవ్వులు పూయించింది.
ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. గతాన్ని నెమరు వేసుకుంటే దుఖం వస్తోంది. నేను ఎంతో రఫ్‌గా కనిపిస్తానో అంటూ అంత సెన్సిటివ్ అంటూ మోహన్ బాబు చెబుతూ ఉంటుంటే.. వెనకాల ‘సోగ్గాడిపెళ్లాం’ సినిమాకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఈ సందర్భంగా తాను సినీ ఇండస్ట్రీకి వచ్చింది నటుడు అవుదామని.
వచ్చిందే మంచి విలన్ అవుదామని. ఇండస్ట్రీలో ఇన్ని యేళ్లు ఉంటానని అనుకోలేదు. ఇక తన ఫస్ట్ పిక్చర్ ’స్వర్గం నరకం’ 22 నవంబర్ 1975లో విడుదలైంది. ఈ సినిమా భక్తవత్సలం నాయుడు కాస్తా మోహన్ బాబుగా మారారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తనకు పేరు పెట్టిన గురువు గారు దాసరిని గుర్తు చేసుకున్నారు. ఇక తన తల్లిదండ్రులకు ఐదుగురు సంతానంలో తాను పెద్దవాడని చెప్పారు.
Mohan Babu: మోహన్ బాబును నట ప్రపూర్ణ నుంచి కలెక్షన్ కింగ్ చేసిన దర్శకుడు ఎవరో తెలుసా..
ఈ సందర్భంగా తన తల్లిగారికి చెవులు వినపడని సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అంతేకాదు తమ ఐదుగురిని పెంచడానికి ఆమె ఎంతలా కష్టపడిందో ఒకింతో భావోద్వేగానికి గురయ్యారు మోహన్ బాబు. సినిమాల్లో తాను రావడానికి అన్నగారైన ఎన్టీఆర్ ఇన్స్పిరేషన్ అన్నారు. ఈ సందర్భంగా ఓ షూటింగ్ చూడడానికి హైదరాబాద్ లైఫ్‌లో చూడగలవా అన్నారు. అంతేకాదు 1974లో శోభన్ బాబు ‘కన్నవారి కలలు’ సినిమాలో ఓ పాత్ర చేసిన విషయాన్ని చెప్పారు.
Vijay Devarakonda AVD Multiplex : అట్టహాసంగా ప్రారంభమైన విజయ్ దేవరకొండ మల్టీప్లెక్స్ థియేటర్..
అంతేకాదు తన విద్యా సంస్థల్లో కులం అనే పదాన్ని తీసేసిన మొదటి వ్యక్తి తానేనన్నారు. అప్పట్లో కులం ఆధారంగా తనను తీసేసిన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక సినీ ఇండస్ట్రీలో తనకు ఆత్యంత ఆప్తులు చిరంజీవి అన్నారు. ఇక సన్నాఫ్ ఇండియాలో ఓ డైలాగ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఓ అమ్మాయిని దారిద్ర రేఖకు దిగువనున్న వాడిని రేప్ చేస్తే వాడిని అన్యాయంగా ఎన్కౌంటర్ చేస్తారు. శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. అదే పెద్దవాళ్లు.. వాళ్ల బుడ్డ బాబులు రేప్ చేస్తే 24 ఏళ్లైన న్యాయం జరగదనే డైలాగ్ తన రాబోయే ‘సన్నాఫ్ ఇండియా’ సినిమాలో ఉన్నట్టు చెప్పారు.
Venkatesh Multistarers : అబ్బాయి రానా సహా వెంకటేష్ ఇతర హీరోలతో చేసిన మల్టీస్టారర్ మూవీస్ ఇవే..
ఇక రామ్ గోపాల్ వర్మ అంటే ఓ టెక్నిషియన్‌గా తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. ఇక రాయలసీమ వాడివి నీకు భాష తెలియదున్నారు. భాష తెలుసు... అన్న సినిమాలు చూసి చదువుకొని భాష తెలుసు అని అందరితో శభాష్ అనిపించుకున్నారు. ఇలా తన సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు మోహన్ బాబు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ali, MAA Elections, Mohan Babu, Tollywood