ఎవరికీ భయపడని మోహన్ బాబుకు.. ఆ ఒక్కరంటే హడల్..

తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా ఎంట్రీ ఇచ్చి..ఆ తర్వాత విలన్‌గా టర్న్ తీసుకొని..ఆపై కమెడియన్‌గా..క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు తెరపై చెరగని ముద్ర వేసిన నటుల్లో మోహన్ బాబు ఒకరు. అందరకీ మోహన్ బాబు భయమైతే.ఆయనకు మాత్రం..

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: November 6, 2019, 1:30 PM IST
ఎవరికీ భయపడని మోహన్ బాబుకు.. ఆ ఒక్కరంటే హడల్..
మోహన్ బాబు ఫైల్ ఫోటో
  • Share this:
తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా ఎంట్రీ ఇచ్చి..ఆ తర్వాత విలన్‌గా టర్న్ తీసుకొని..ఆపై కమెడియన్‌గా..క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు తెరపై చెరగని ముద్ర వేసిన నటుల్లో మోహన్ బాబు ఒకరు. అంతేకాదు మోహన్ బాబు అంటే అందరికీ టెర్రర్. ఆయన ముక్కుసూటి తనం, క్రమశిక్షణ, సమయపాలన అంటే అందరికీ హడలే. ఈ విషయంలో తెలుగు ఇండస్ట్రీలో ఉన్నవాళ్లకు అందరికీ తెలిసిన విషయమే.ఇపుడున్న అగ్ర దర్శకుల్లో రాజమౌళి, పూరీ జగన్నాథ్‌లతో మాత్రమే పనిచేసారు మోహన్ బాబు. అందుకే మోహన్ బాబుతో సినిమాలంటే అందరకీ ఒకలాంటి భయం.అలాంటి మోహన్ బాబును భయపెట్టే మనిషి కూడా ఉన్నాడని ఒక యూట్యూబ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు.మీ టాలెంట్‌ను ఇపుడున్న యువ దర్శకులు సరిగా వినియోగించకోవడం లేదన్న విషయమై మోహన్ బాబు మాట్లాడుతూ.. వారందరికీ మందు పార్టీలు ఇవ్వాలా ? లేకపోతే.. ముంబాయి, ఢిల్లీ వంటి ప్రాంతాలకు తీసుకెళ్లి పార్టీ గట్రా ఇవ్వాలా అని ప్రశ్నించాడు.

mohan babu afraid one only his daughter manchu lakshmi,mohan babu,mohan babu twitter,mohan babu instagram,mohan babu facebook,mohan babu ys jagan mohan reddy,manchu lakshmi,mohan babu about manchu lakshmi,lakshmi manchu,mohan babu speech,mohan babu movies,manchu lakshmi about mohan babu,manchu lakshmi speech,manchu lakshmi comedy,manchu vishnu,mohan babu latest news,mohan babu interview,mohan babu about gayatri,manchu lakshmi spoof,manchu lakshmi husband,manchu lakshmi daughter,mohan babu about people's troll on manchu lakshmi,tollywood,telugu cinema,మోహన్ బాబు,మోహన్ బాబు మంచు లక్ష్మి,మంచు లక్ష్మీ,మోహన్ బాబు ఇంటర్వ్యూ,మోహన్ బాబు
కూతురు మంచు లక్ష్మీతో మోహన్ బాబు (Twitter/Photo)


మరోవైపు మీ గురువు గారైన దాసరి నారాయణరావు కూడా మీరంటే భయమని ఇండస్ట్రీలో టాక్ అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఆయన ఎవరికీ భయపడరు. ఐతే.. ఆయన చూపించే ప్రేమకు మాత్రం నేను భయపడతాను అని చెప్పుకొచ్చారు. మరోవైపు మోహన్ బాబు మాట్లాడుతూ.. నేను భయపడితే.. గిడితే.. మా కూతురు మంచు లక్ష్మీ మాత్రమే బయపడతాను. ఇంకెవరికీ భయపడనని సమాధానమిచ్చారు. అన్ని విషయాల్లోను ఆమె నాకు భయం. రాక్షసిలా ప్రవర్తిస్తుంటుంది. ప్రతి చిన్న విషయానికి నన్ను బాగా కసురు కొంటుంది. అంతేకాదు ఆమె అంటే ఎంత భయపడతానే.. అంత ఇష్టపడతానని చెప్పుకొచ్చాడు. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ ను నేను వాడు వీడు అని సంభోదించడంపై స్పందిస్తూ.. నేను ఆయన మంచి స్నేహితులం.మా మద్య ఉండే చనువు కొద్ది మేము మాట్లాడుకుంటాం. మాకు లేని బాధ మీకెందుకు అని ప్రశ్నించాడు. ప్రస్తుతం మోహన్ బాబు..తమిళంలో సూర్య హీరోగా సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు.
First published: November 6, 2019, 1:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading