news18-telugu
Updated: September 12, 2020, 2:37 PM IST
సాజిద్ ఖాన్ పై మోడల్ పౌలా సెక్సువల్ ఆరోపణలు (Twitter/Photo)
Sajid Khan | గత కొంత కాలంగా టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో ‘మీటూ’ అంటూ కౌస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే నడుస్తోంది. దీంతో ఒక్కొక్కరుగా ధైర్యం చేసి తమకు జరిగిన అన్యాయాలపై గళమెత్తుతున్నారు. నానా పాటేకర్‌పై తనూశ్రీదత్తా చేసిన ఆరోపణలతో ఈ మీటూ ఉద్యమం ఊపందుకుంది.ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు సాజిద్ ఖాన్ పై ప్రముఖ నటి సలోని చోప్రాతో పాటు సిమ్రాన్ సూరి మీటూ అంటూ లైంగిక ఆరోపణలు చేసారు. దీంతో సాజిద్ ఖాన్ ‘హౌస్‌ఫుల్ 4’ దర్శకత్వ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ‘హౌస్‌ఫుల్ 4’ దర్శకత్వ బాధ్యతలు వేరే దర్శకుడు టేకప్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఆ వివాదాలు సమసి పోక ముందే దర్శకుడు సాజిద్ ఖాన్ పై ప్రముఖ మోడల్..పౌాలా ఆరోపణలు గుప్పించింది. ‘హౌస్‌ఫుల్ 4’ సినిమాలో క్యారెక్టర్ కోపం వెళినపుడు సాజిద్ తనను లైంగికంగా వేధింపులకు గురిచేసాడని తెలిపింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది.
అంతేకాదు అప్పట్లో సాజిద్ ఖాన్ పై ఆరోపణలు చేయడానికి ఎందుకు ముందుకు రాలేదనే విషయమై ఇపుడు స్పందించింది. కుటుంబ పరువు పోతుందనే ఉద్దేశ్యంతో ముందుకు రాలేదని చెప్పింది. ఇపుడు నా తల్లిదండ్రులు నాతో లేరు. అందుకే ఇపుడు ధైర్యంగా ఈ విషయాన్ని ఇపుడు చెప్పానంది. నాకు 17 యేళ్లు ఉనపుడు సాజిద్ ఖాన్ నన్ను లైంగికంగా వేధించేవాడు. అంతేకాదు ఎపుడు నన్ను తాకడానికి ప్రయత్నించేవాడని చెప్పింది. ఓ సారి తన ముందు బట్టలు విప్పి నగ్నంగా నిలబడాలని కోరాడు. దీంతో నేను ఛాన్సులు వద్దు.. ఏమి వద్దు అంటూ వెళ్లిపోయాను. నాలాగే అతను ఎంతో మంది అమ్మాయిలను ఈ రకంగా వేధించాడో ఏ దేవుడికే తెలుసు అంటూ చెప్పింది. ఇలాంటి నీచులు ఉండాల్సింది సోసైటీలో కాదు.. జైల్లో ఉండాలన్నారు. కేవలం కాస్టింగ్ కౌచ్‌కు మాత్రమే కాదు.. నటీమణులు కావాలనుకున్న ఎంతో మంది అమ్మాయిల కలలను అతడు నాశనం చేసినందుకు సాజిద్ ఖాన్‌ను శిక్షించాలంది. అయితే ఈ విషయాన్ని ఇన్ని రోజులు దాచిపెట్టినందుకు సిగ్గు పడుతున్నానని పౌలా పేర్కొంది.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
September 12, 2020, 2:37 PM IST