తన సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు రాజమౌళి. ఒక్క చిన్న విషయం కూడా బయటికి వెళ్లకుండా కేర్ తీసుకుంటాడు. కానీ తనతో ఉన్నవాళ్లే అప్పుడప్పుడూ నోరు జారి లేనిపోని తలనొప్పులు తీసుకొస్తుంటారు ఈ దర్శకధీరుడికి. ఇప్పుడు కీరవాణి కూడా ఇదే చేసాడు. ఈయన తన తొందరపాటుతో ట్రిపుల్ ఆర్ సినిమా గురించి కీలకమైన విషయాలు బయటికి చెప్పేసాడు. కావాలని చేసాడో లేదంటే అలా జరిగిపోయిందో తెలియదు కానీ ఇప్పుడు కీరవాణి చేసిన కామెంట్స్ మాత్రం సినిమా స్టోరీ ఏంటో చెప్పకనే చెప్పేసాయి. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయాయి.
తాజాగా ఓ ఈవెంట్‌కు వచ్చిన కీరవాణి.. ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. ముఖ్యంగా ఈ చిత్ర సంగీతం గురించి మాట్లాడుతూ.. చాలా అద్భుతంగా వస్తుందని చెప్పాడు ఈ స్వరవాణి. ఇక ఇందులో భాగంగానే ఇప్పుడు ఈయన చేసిన కామెంట్స్ సినిమాపై ఆసక్తి పెంచేస్తున్నాయి. ఈ చిత్రం కోసం తాను పీరియాడికల్ ట్యూన్స్‌తో పాటు ట్రెండీ సాంగ్స్ ఇస్తున్నానని చెప్పాడు కీరవాణి. ఈయన చెప్పిన ఒక్క మాటతో సినిమా కథ ఎలా ఉండబోతుందో క్లారిటీ వచ్చేసింది. కొన్ని రోజులుగా ఈ చిత్రం పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో రానుందని.. 1920ల నేపథ్యంలో సాగే కథ ఇది అని వార్తలు వస్తున్నాయి.
దీనిపై ఇప్పటి వరకు కన్ఫ్యూజనే కానీ క్లారిటీ అయితే రాలేదు. కానీ ఇప్పుడు కీరవాణి చేసిన కామెంట్స్‌తో అభిమానులకు ఓ క్లారిటీ వచ్చేసింది. పీరియాడికల్ ట్యూన్స్ అంటున్నాడు కాబట్టి కచ్చితంగా అదే నేపథ్యం ఉన్న సినిమా అని.. అప్పటికీ ఇప్పటికీ లింక్ పెడుతూ రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడని క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో రెండో షెడ్యూల్ మొదలు కానుంది. అక్టోబర్‌లోపు ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసి.. ఆర్నెళ్ల పాటు కేవలం పోస్ట్ ప్రొడక్షన్‌తోనే బిజీగా ఉండాలని చూస్తున్నాడు దర్శకధీరుడు. ఏదేమైనా కీరవాణి చేసిన కామెంట్స్ ఆర్ఆర్ఆర్ కథపై క్లారిటీ ఇచ్చాయన్నమాట.
అమీషా పటేల్ హాట్ ఫోటోస్..
ఇవి కూడా చదవండి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jr ntr, Ram Charan, RRR, Telugu Cinema