బాలీవుడ్ నిర్మాత,దర్శకుడు కరణ్ జోహార్ ఇటీవల ఇచ్చిన పార్టీకి హాజరైనవారంతా డ్రగ్స్ సేవింంచారని శిరోమణి అకాళీదళ్ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సా ట్విట్టర్లో ఆరోపించిన సంగతి తెలిసిందే. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ తాజాగా ఆయన ముంబై పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయన వెల్లడించారు. నార్కోటిక్ డ్రగ్స్ యాక్ట్ 1985 ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, గత వారం కరణ్ జోహార్ తన ఇంట్లో పలువురు బాలీవుడ్ నటీనటులకు పార్టీ ఇచ్చారు. దీపికా పదుకొణే,రణబీర్ కపూర్,విక్కీ కౌశల్,అర్జున్ కపూర్,మలైకా అరోరా,షాహిద్ కపూర్ సహా తదితరులు పార్టీకి హాజరయ్యారు. పార్టీ సమయంలో తీసిన ఓ వీడియోను కరణ్ జోహార్ ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో పలువురు దానిపై అనుమానం వ్యక్తం చేశారు. అందులో ఉన్న నటీనటులు డ్రగ్స్ మత్తులో ఉన్నారని కొంతమంది ఆరోపించారు. ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా కూడా ఆ పార్టీలో పాల్గొన్నవారంతా డ్రగ్స్తీసుకున్నారని ఆరోపించారు. అయితే ఆయన ఆరోపణలను కాంగ్రెస్ నేత మిలింద్ దేవర ఖండించారు. ఆ పార్టీలో తన భార్య కూడా పాల్గొన్నారని.. తప్పుడు ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి : బాలీవుడ్ నటుల నిజస్వరూపం ఇదే.. డ్రగ్స్ మత్తులో ఎలా తూలుతున్నారో చూడండి : ఎమ్మెల్యే ఆరోపణలుPublished by:Srinivas Mittapalli
First published:August 02, 2019, 14:05 IST