Home /News /movies /

MLA ROJA WILL OUT OF JABARDASTH COMEDY SHOW THESE ARE THE REASONS TA

రోజా జబర్ధస్త్‌ను వీడనుందా.. ఆమె తప్పుకోవడానికి వాళ్లిద్దరే కారణమా..

నటి రోజా (Jabardasth Comedy Show)

నటి రోజా (Jabardasth Comedy Show)

సినిమాల్లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన రోజా ప్రస్తుతం రాజకీయాల్లో  ప్రముఖ పాత్ర  పోషిస్తున్నారు. తాజాగా రోజా ఈ షో ను వీడనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

    సినిమాల్లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన రోజా ప్రస్తుతం రాజకీయాల్లో  ప్రముఖ పాత్ర  పోషిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగతున్న ఆమె స్మాల్ స్క్రీన్ పై కనిపిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. జబర్దస్త్ జడ్జ్‌గా ఒక వైపు చేస్తూనే.. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేగా.. ఏపీఐఐసీ చైర్మన్‌గా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తోంది. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో ఐరన్ లేడీ అనే ఐకాన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తంపు తెచ్చుకంది. తాజాగా రోజా జబర్ధస్త్ కామెడీ షోను వీడనున్నట్టు ఒక వార్త చక్కర్లు కొడుతోంది. దానికి కారణం వాళ్లిద్దరే అంటూ అందరు చెవులు కొరుక్కుంటున్నారు. గత ఏడేళ్లుగా ఈటీవీలో ప్రసారమవుతున్న ఈ  ప్రోగ్రామ్‌‌కు జడ్జ్‌గా వ్యవహరిస్తూ వస్తోంది. ఈమెతో పాటు జడ్జ్‌గా వ్యవహరించిన  నాగబాబు.. వేరే ఛానెల్‌లో ‘అదిరింది’ అనే షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన ఈ షో వీడినా రోజా.. తన జడ్జ్‌మెంట్‌తో ఈ షోను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తూ వస్తోంది. నాగబాబు వీడిన తర్వాత జడ్జ్‌గా రోజా పారితోషకాన్ని మల్లెమాల వాళ్లు భారీగానే పెంచారు. దీంతో రోజా ఫుల్‌ హ్యాపీగా ఉంది. తాజాగా ఈ షో నుంచి రోజా తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. దానికి కారణం రీసెంట్‌గా ప్రసారమైన ఓ ప్రోమో‌లో టీమ్ లీడర్లైన బుల్లెట్ భాస్కర్, అప్పారావు కొట్టుకున్నారు. తాజాగా ప్రసారమైన ఈ ప్రోమోలో రోజా కనపడకపోవడంతో ఆ వార్తలకు బలం చేకూర్చినట్టైంది.

    జబర్దస్త్ కామెడీ షోలో గొడవ (bullet bhaskar apparao)
    జబర్దస్త్ కామెడీ షోలో గొడవ (bullet bhaskar apparao)


    వీరిద్దరు షో కోసమే కొట్టుకున్నారా ? లేకపోతే నిజంగానే కొట్టుకున్నారా ? సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతున్న ఈ షోలో ఇలాంటి ప్రయోగాలు చేయడం నచ్చని రోజా.. జబర్ధస్త్ షో నిర్వాహకులపై అలిగినట్టు ప్రచారం జరుగుతోంది. ఐతే.. రోజా ఈ షో నుంచి శాశ్వతంగా తప్పుకున్నారా ? లేకపోతే కరోనా ఎఫెక్ట్ కారణంగా బ్రేక్ ఇచ్చిందా అనేది తెలియాలి. మొత్తానికి బుల్లెట్ భాస్కర్, అప్పారావు ఎపిసోడ్ జబర్ధస్త్ షోపై భారీ ఇంపాక్ట్ పడేలా కనిపిస్తోంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Jabardasth apparao, Jabardasth comedy show, MLA Roja, Telugu Cinema, Tollywood

    తదుపరి వార్తలు