మళ్లీ సినిమాల్లోకి రోజా.. మెగా హీరో సినిమాలో పవర్‌ఫుల్ విలన్‌గా.. ?

ప్రస్తుతం రోజా సినిమాలను పక్కన పెట్టి కేవలం రాజకీయాలపై దృష్టి సారిస్తూ.. జబర్ధస్త్ వంటి ప్రోగ్రామ్స్ మాత్రమే చేస్తోంది. తాజాగా ఈమె ఓ మెగా హీరో సినిమాలో విలన్‌గా నటించేందకు అంగీకారం తెలిపినట్టు వార్తులు వస్తున్నాయి.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: June 3, 2020, 6:44 AM IST
మళ్లీ సినిమాల్లోకి రోజా.. మెగా హీరో సినిమాలో పవర్‌ఫుల్ విలన్‌గా.. ?
ఎమ్మెల్యే రోజా (Twitter/Photo)
  • Share this:
సినిమాల్లో నుండి రాజకీయాల్లో వెళ్లి అక్కడ తనకంటూ ఫైర్ అంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రోజా. ప్రస్తుతం పాలిటిక్స్‌తో పాటు జబర్ధస్త్ షో వంటి రియాలిటీ షోస్‌కు జడ్జ్‌గా వ్యవహరిస్తోంది రోజా. ప్రస్తుతం సినిమాలను పక్కన పెట్టి కేవలం రాజకీయాలపై దృష్టి సారిస్తూ.. జబర్ధస్త్ వంటి ప్రోగ్రామ్స్ మాత్రమే చేస్తోంది రోజా. ఇక తెలుగులో ‘శంభో శివ శంభో’, గోలీమార్’ సినిమాల తర్వాత సినిమాలపై అంతగా దృష్టి సారించలేదు. అంతేకాదు రోజా తనకు తగ్గ పవర్‌ఫుల్ రోల్ వస్తే కానీ చేయనని ఫిక్స్ అయింది. తాజాగా రోజాకు అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాలో విలన్ పాత్ర కోసం సంప్రదించినట్టు సమాచారం. ఈ సినిమా కథ మొత్తం నల్లమల, శేషాచలం ఫారెస్ట్ నేపథ్యంలో కొనసాగుతోంది. మరోవైపు రోజా కూడా చిత్తూరు జిల్లాకు చెందిన ఆమె కావడంతో ఈ  పాత్రకు రోజా అయితే న్యాయం జరుగుతుందని దర్శకుడు సుకుమార్.. రోజాను కలిసి ఈ సినిమాలో ఆమె పాత్రకు సంబంధించి వివరాలు చెప్పినట్టు సమాచారం. ఇక రోజా కూడా ఈ కథ నచ్చి సుకుమార్‌కు ఓకే చెప్పినట్టు సమాచారం. అంతేకాదు ప్రస్తుతం రోజా.. రాజకీయాలతో పాటు రియాల్టీ షోలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం కేవలం పదిహేను రోజులు మాత్రమే డేట్స్ కేటాయిస్తాను. ఆ లోపే తన పాత్రకు సంబంధించిన షూట్ కంప్లీట్ చేయాలని కండిషన్స్ పెట్టినట్టు సమాచారం.

mla roja will accept villain role in allu arjun sukumar movie,MLA Roja,Roja,Roja Twitter,roja instagram,Roja facebook,roja jabardasth comedy show,jabardasth comedy show,mla roja allu arjun sukumar,allu arjun roja,sukumar roja,roja accept villain role in allu arjun pushpa movie,allu arjun twitter,రోజా,పుష్ప,ఎమ్మెల్యే రోజా,పుష్ప సినిమాలో విలన్‌గా రోజా,మరోసారి వెండితెరపై రోజా,రోజా అల్లు అర్జున్ సుకుమార్,రోజా సుకుమార్,రోజా పుష్ఫ సుకుమార్ అల్లు అర్జున్
పుష్ప సినిమాలో విలన్‌గా రోజా (File/Photos)


ఇక సుకుమార్ విషయానికొస్తే.. ఆయన పర్ఫెక్షెన్ కోసం ఎన్ని టేకులు తీసుకోవడానికైనా వెనకాడడు. అలాంటిది పుష్ప సినిమాలో రోజా పాత్రను 15 రోజుల్లో కంప్లీట్ ఎలా చేయాలో తెలియక కాస్త అయోమయంలో పడ్డట్టు సమాచారం. మొత్తానికి సుకుమార్ కూడా రోజా చెప్పిన కండిషన్స్‌కు ఒప్పుకొని ఆమె పాత్రను సాధ్యమైనంత మేర తక్కువ టైమ్‌లో చిత్రీకరంచేలా ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం రోజాకు ఏపీలో సినిమా షూటింగ్స్‌కు సంబంధించిన ఓ కమిటీకి చైర్మన్‌గా ఏపీ సీఎం జగన్ నియమించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
First published: June 3, 2020, 6:44 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading