MLA Roja: ప్రముఖ నటి ఎమ్మెల్యే రోజా విషయానికొస్తే.. హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తర్వాత రాజకీయాల్లో ప్రవేశించింది. తాజాగా ఎమ్మెల్యే రోజాకు బెదిరింపులు వచ్చాయి. ఇంతకీ ఏం జరిగిందంటే.. రోజా జబర్ధస్త్ షో జడ్జ్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే కదా.
MLA Roja: ప్రముఖ నటి ఎమ్మెల్యే రోజా విషయానికొస్తే.. హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తర్వాత రాజకీయాల్లో ప్రవేశించింది. మరోవైపు జబర్ధస్త్ కామెడీ షో వంటి ప్రోగ్రామ్‌లకు జడ్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే కదా. అంతేకాదు.. ఓ వైపు రాజకీయాలు, మరోవైపు జబర్ధస్త్ వంటి షోలను హ్యాండిల్ చేస్తూనే..తన నియోజకవర్గానికి సంబంధించిన పనులను చక్కబెడుతూనే.. కుటుంబానికి అంతే ప్రాధాన్యత ఇవ్వడం రోజా స్పెషాలిటీ. ఈ రకంగా రోజా.. రాజకీయ పరంగా, సినిమాలు టీవీ సీరియల్స్ పరంగా.. నియోజక వర్గ పరంగా..ప్యామిలీ పరంగా అన్నింటినిక చక్కబెట్టడం మాములు విషయం కాదు. తాజాగా ఎమ్మెల్యే రోజాకు బెదిరింపులు వచ్చాయి. ఇంతకీ ఏం జరిగిందంటే.. రోజా జబర్ధస్త్ షో జడ్జ్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే కదా.
ఈమె జడ్జ్‌గా వ్యహరిస్తోన్న జబర్థస్త్ టీమ్‌ను ప్రముఖ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ బెదిరించారు. ఈయన డిసెంబర్ 31న జబర్దస్త్ టీమ్ మెంబర్స్‌కు భయమంటే ఏమిటో చూపిస్తానన్నారు. అంతేకాదు జబర్ధస్త్ టీమ్ మెంబర్స్‌ను ‘మీరంతా వేస్ట్‌రా’ అంటూ కామెంట్లు చేశారు. ఈ కామెంట్స్ పై రోజా తనదైన శైలిలో స్పందించారు. డిసెంబర్ 31న 2021 స్వాగత వేడుకల్లో ఈ టీవీలో ‘డీజే 2021’ పేరుతో ఓ స్పెషల్ ప్రోగ్రామ్ టెలికాస్ట్ కానుంది.
ఎమ్మెల్యే రోజా (File/Photo)
న్యూ ఇయర్‌కు వెల్కమ్ చెప్పడానికి జరగనున్న ఈ వేడుకలను ‘ఢీ’ స్టేజ్ పై చేయాలని భావించిన జబర్ధస్త్ టీమ్.. ఆ సెట్లో అడుగుపెట్టింది. దీనికి శేఖర్ మాస్టర్ నో చెప్పడంతో .. ‘ఢీ’ లో పాల్గొనే కంటెస్టెంట్స్ అందరినీ కిడ్నాప్ చేసి ఓ చోట బంధించామని చెప్పారు. స్టేజ్ ఇవ్వకపోతే.. విడిచిపెట్టమని జబర్ధస్త్ కమెడియన్లు బెదిరించారు.
ఈ సందర్భంగా ‘ఢీ’ టీమ్‌కు సపోర్ట్‌గా బాబా భాస్కర్ ఓ స్పెషల్ వీడియోను జబర్థస్త్ టీమ్‌కు పంపించారు. శేఖర్ మాస్టర్ అమాయకుడని చెప్పాడు. ‘ఢీ’ స్టేజ్ పైకి వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళుతున్నారా. మీరు వేస్ట్ రా. మా వాళ్లను ఒదలిపెట్టాలని చెప్పారు. లేకపోతే.. డిసెంబర్ 31న రాత్రి అసలు భయంటే ఏమిటో చూపిస్తాం అంటూ బాబా భాస్కర్.. రోజా ముందరే జబర్ధస్త్ టీమ్‌కు వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.