ఎమ్మెల్యే రోజా ఆ నిర్ణయాన్ని అభిమానులు ఒప్పకుంటారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. రీసెంట్గా రోజా ఓ ఇంటర్వ్యూలో తన రాజకీయ, సినీ, వ్యక్తిగత జీవితంపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. రోజా గత కొన్నేళ్లుగా ఇటు రాజకీయాలు.. అటు జబర్ధస్త్ వంటి కామెడీ షోలతో పాటు కొన్ని రియాల్టీ షోలకు జడ్జ్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆమె సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయకపోయినా.. స్మాల్ స్క్రీన్ పై మాత్రం రఫ్పాడించేస్తోంది. మరోవైపు కొందరు సినీ దర్శక,నిర్మాతలు ఆమెను మరోసారి వెండితెరపై చూపించాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే కొంత మంది దర్శకులు రోజాను తమ సినిమాల్లో నటింప చేయాలని చూసినా.. ఆమె ఆయా పాత్రలను సున్నితంగా తిరస్కరించింది. తాజాగా ఓ టీవీ ప్రోగ్రామ్‌లో ఓ యాంకర్ రోజాను ఓ ప్రశ్న వేసారు.

ఎమ్యెల్యే రోజా (File/Photo)
ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న మీరు చిరంజీవి సినిమాలో అవకాశం చేస్తారా అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చింది. వస్తే అందులో తన పాత్ర బాగుంటే తప్పకుండా చేస్తానని చెప్పింది. మరోవైపు నాగార్జున సినిమాలో అవకాశం వస్తే కూడా నటిస్తానని స్టేట్మెంట్ ఇచ్చింది రోజా. మరోవైపు బాలయ్య, పవన్ కళ్యాణ్ సినిమాల్లో అవకాశాలు వచ్చినా.. అందులో తన పాత్ర బాగున్నా చేయనని చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది.

చిరంజీవి,రోజా,నాగార్జున (File/Photos)
రోజా అలా చెప్పడం వెనక పెద్ద కారణాలే ఉన్నాయట. ప్రస్తుతం బాలకృష్ణ, పవన్ కళ్యాణ్‌లతో యాక్ట్ చేయాలని ఉన్నా..వీళ్లిద్దరు ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న కారణంగా వాళ్లతో నటించకూడదనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. పైగా తను కూడా పాలిటిక్స్‌లో ఎమ్మెల్యేగా ఏపీఐఐసీ చైర్మన్‌గా బిజీగా ఉన్నారు. పైగా వీళ్లిద్దరు వైయస్ఆర్సీసీ పార్టీ విధానాలకు వీళ్లు ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీలకు బద్ద వ్యతిరేకం అన్న సంగతి తెలిసిందే కదా. అందుకే తమ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఉన్న నేతలతో స్క్రీన్ షేర్ చేసుకోకడదనే నిర్ణయానికి రోజా వచ్చినట్టు సమాచారం. గతంలో రోజా ఇలాంటి వాటిని అంతగా పట్టించుకునేది కాదు. కానీ మారిన రాజకీయ ముఖ చిత్రం కారణంగా రోజా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం చిరంజీవి పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు కాబట్టి.. ఆయన సినిమాల్లో యాక్ట్ చేయనీకి ఎలాంటి ప్రాబ్లెమ్ లేదని రోజా చెప్పడం కొసమెరుపు . మొత్తంగా రోజా తాను పొలిటికల్‌గానే కాకుండా.. సినిమాల పరంగా పుల్ క్లారిటీతో ఉందన్న విషయం ఈ మేటర్‌తో స్పష్టమైంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:September 09, 2020, 21:55 IST