Home /News /movies /

MLA ROJA SHOCKING COMMENTS ABOUT HER PERSONAL PROBLEMS AND MARRIAGE LIFE IN OORILO VINAYAKUDU EVENT NR

MLA Roja: అప్పులతో నరకం.. పెళ్ళికి ముందే పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పారంటూ ఎమ్మెల్యే రోజా ఎమోషనల్!

MLA Roja

MLA Roja

MLA Roja: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శ్రీలత రెడ్డి అలియాస్ రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించుకున్నారు.

ఇంకా చదవండి ...
    MLA Roja: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శ్రీలత రెడ్డి అలియాస్ రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించుకున్నారు. రోజా 1991లో "సర్పయాగం" అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న రోజా నంది అవార్డును కూడా అందుకున్నారు. ఇలా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి వరుస అవకాశాలను అందిపుచ్చుకుని స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించారు.

    ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ బుల్లితెరపై ప్రారంభించారు. ముఖ్యంగా జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తూ ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నారు. ఒకవైపు ఇండస్ట్రీలో ఉంటూనే మరోవైపు రాజకీయాలలోకి అడుగుపెట్టారు. రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించిన రోజా ప్రస్తుతం వైయస్సార్ సిపి పార్టీ తరఫున నగరి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

    ఇది కూడా చదవండి: చెప్పినట్టుగానే కార్తీక్ కుటుంబంపై కుట్ర చేసిన మోనిత.. ఆదిత్యకు ఘోర రోడ్డు ప్రమాదం?

    జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించిన రోజా ఈ కార్యక్రమం ద్వారా కమెడియన్స్ వేసే పంచులకు సెటైర్లు వేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే వినాయక చవితి పండుగ సందర్భంగా ఈటీవీ నిర్వహిస్తున్నటువంటి స్పెషల్ ఈవెంట్ "ఊరిలో వినాయకుడు" ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రోజాతో పాటు, ఇంద్రజ, పూర్ణ కూడా హాజరయ్యి ఎంతో సందడి చేసి ప్రేక్షకులను అలరించారు.

    ఇది కూడా చూడండి: హ్యాండ్ కర్చీఫ్ కట్టుకొని ఎద అందాల విందు.. ఇస్మార్ట్ బ్యూటీ స్టైలే వేరు

    ఈ కార్యక్రమంలో భాగంగా నటిరోజా తన జీవితంలో పడిన కష్టాల గురించి తెలుపుతూ ఎమోషనల్ అయ్యారు. 1991లో సినిమాలలోకి వచ్చిన రోజా 2002 వరకు సంపాదించిన డబ్బులు మొత్తం అప్పులు కట్టి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని, ఆ సమయంలో నరకం అనుభవించాననే విషయాన్ని తెలియజేశారు. అలాగే రోజా దర్శకుడు సెల్వమణిను వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. వివాహం తర్వాత ఈమెకి పిల్లలు పుట్టారని ఎంతో కంగారుపడ్డానని, ఆ భయం తనను ఎంతగానో కృంగదీసింది కాకపోతే తన అదృష్టం పెళ్లయిన ఏడాదికే తనకు ప్రెగ్నెన్సీ వచ్చిందని అందుకే తనకు అన్షు అంటే ఎంతో ప్రేమ అంటూ ఈ సందర్భంగా తన జీవితంలో పడిన కష్టాలను గురించి తెలియజేస్తూ రోజా ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Jabardasth, MLA Roja, Nagari MLA Roja, Oorilo vinayakudu evet, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు