సుడిగాలి సుధీర్‌పై సెటైర్ల వర్షం కురుస్తోంది. ఇంత కాలం జడ్జి స్థానంలో ఉండి కేవలం సజెషన్స్కే పరిమితమైన రోజా, ఇప్పుడు పంచుల వర్షం కురిపించేందుకు సిద్ధం అయిపోయారు. అయితే ఆ పంచుల జల్లుకు మొదట బలైంది మాత్రం సుడిగాలి సుధీర్ అని చెప్పవచ్చు. మల్లెమాల ప్రొడక్షన్స్ యూట్యూబ్ లో విడుదల చేసిన జబర్దస్త్ ప్రోమోలో రోజా విశ్వరూపం చూపించారు. అందులో సుడిగాలి సుధీర్ సినిమా కెరీర్ తొలినాళ్లలో అల్లుఅర్జున్ హీరోగా నటించిన రేసు గుర్రం సినిమాలో ఓ చిన్న కేరక్టర్ చేశారు. ఆ కేరక్టర్ నిడివి కొద్ద సెకన్లు మాత్రమే ఉంటుంది. దాన్ని గుర్తు చేస్తూ రోజా పంచులు వేశారు. దీంతో సుడిగాలి సుధీర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అంతేకాదు హోస్ట్ గా ఉన్న రష్మీ సైతం సుధీర్ రేసుగుర్రం సినిమాలో ఎక్కడ ఉన్నాడు అంటూ ప్రశ్నించింది. అందుకు ఆటో రాంప్రసాద్ అందుకొని కొద్ది సెకన్లు మాత్రమే సుధీర్ కార్ డ్రైవర్ పాత్రలో రేసుగుర్రంలో కనిపిస్తాడని చెప్పుకొచ్చాడు. అంతేకాదు సుధీర్ కూడా తాను ఎక్కడ ఉన్నానో తెలుసుకునేందుకు రేసు గుర్రం సినిమాను రెండు మూడు సార్లు చూశానని తనపై తానే సెటైర్ వేసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jabardasth, Jabardasth comedy show, MLA Roja, Rk roja, Roja, Sudigali sudheer, Sudigali Sudhir