Home /News /movies /

MLA ROJA PLAINING BADMINTON GAME WITH HER HUSBAND SELVAMANI AT NAGARI PICS GOES VIRAL TA

MLA Roja : భర్త సెల్వమణితో కలిసి బాడ్మింటన్ ఆడిన ఎమ్మెల్యే రోజా.. పిక్స్ వైరల్..

భర్తతో కలిసి బాడ్మింటన్ ఆడిన ఎమ్మెల్యే రోజా (Facebook/Photo)

భర్తతో కలిసి బాడ్మింటన్ ఆడిన ఎమ్మెల్యే రోజా (Facebook/Photo)

MLA Roja : భర్తతో సెల్వమణితో కలిసి బాడ్మింటన్ ఆడిన ఎమ్మెల్యే రోజా.. పిక్స్ వైరల్.. రోజా ఓ వైపు ప్రజా ప్రతినిధిగా ఉంటూనే జబర్థస్త్ కామెడీ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తూనే... మరోవైపు కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ ఫుల్లు బిజీగా ఉంది. తాజాగా గ్రామీణ యువతీ యువకుల్లో ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసే ఉద్దేశ్యంతో తన నియోజకవర్గంలో గ్రామీణ క్రీడా సంబరాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన భర్తతో కలిసి బాడ్మింటన్ ఆట ఆడారు.

ఇంకా చదవండి ...
    MLA Roja : భర్తతో సెల్వమణితో కలిసి బాడ్మింటన్ ఆడిన ఎమ్మెల్యే రోజా.. పిక్స్ వైరల్.. రోజా ఓ వైపు ప్రజా ప్రతినిధిగా ఉంటూనే జబర్థస్త్ కామెడీ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తూనే... మరోవైపు కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ ఫుల్లు బిజీగా ఉంది. తాజాగా గ్రామీణ యువతీ యువకుల్లో ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసే ఉద్దేశ్యంతో తన నియోజకవర్గంలో గ్రామీణ క్రీడా సంబరాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన భర్తతో కలిసి బాడ్మింటన్ ఆట ఆడారు.  (Facebook/Photo)


    రోజా విషయానికొస్తే..  సినిమాల్లో హీరోయిన్‌గా పీక్  స్టేజ్‌లో ఉండగానే రోజా సినిమాల నుంచి రాజకీయాల వైపు తన అడుగులు వేసింది. అందులో భాగంగా రోజా తెలుగు దేశం పార్టీలో జాయిన్ అయింది. అంతేకాదు టీడీపీ మహిళ అధ్యక్షురాలిగా తనేంటో ప్రూవ్ చేసుకుంది. రోజా తెలుగు దేశంలో జాయిన్ తర్వాత చంద్రబాబుపై అలిపిరిలో బాంబ్ దాడి జరిగింది. ఆ తర్వాత ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఓడిపోయింది. ఆ తర్వాత వైసీపీలో జాయిన్ అయింది. వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.   (Facebook/Photo)


    తాజాగా రోజా.. తన పేరిట ఉన్న రోజా ఛారిటబుల్ ట్రస్ట్ నేపథ్యంలో గ్రామీణ క్రీడా సంబరాల్లో భాగంగా సోమవారం బాల్ బాడ్మింటన్ పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా నగరి, పుత్తూరు మండలాలకు సబంధించిన పోటీల్లో ఎమ్మెల్యే రోజా తన భర్త సెల్వమణితో పాటు సోదరుడు కుమారస్వామి రెడ్డితో కలిసి బ్యాట్మింటన్ ఆడారు. (Facebook/Photo)


    ఈ క్రీడా సంబరాల్లో భాగంగా ప్రతిభ ఉండి వెలుగులోకి రాలేకపోయిన వారు ఈ క్రీడలతో వెలుగులోకి తీసుకొస్తామన్నారు. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభను ఈ రకంగా సానబెట్టనున్నట్టు చెప్పారు. (Facebook/Photo)


    ఈ సందర్భంగా అండర్ 17 విభాగంలో 17 జట్లు పోటీ పడుతున్నాయి. ఇక 17 ఏళ్లు పై బడిన విభాగంలో 48 జట్లు పోటీపడుతున్నాయి. ఈ పోటీలు నగరి డిగ్రీ కళాశాల మైదానంలోని ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. (Facebook/Photo)


    మరోవైపు గ్రామీణ క్రీడా సంబరాలు నిర్వహిస్తూనే.. ఈ సోమవారం నాగుల చవితి సందర్భంగా నాగ దేవతకు ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహించారు. (Twitter/Photo)


    నిన్న మొన్నటి వరకు ఏపీఐఐసీ చైర్మన్‌గా ఉన్న రోజా.. కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే కొనసాగుతున్నారు. త్వరలో ఏపీలో జరిగే మంత్రివర్గ విస్తరణలో రోజాకు మంత్రి పదని ఖాయం అనే మాటలు వినిపిస్తున్నాయి. (Facebook/Photo)


    మొత్తంగా రోజా ఓ వైపు రోజా ఛారిటబుల్ ట్రస్ట్ నేపథ్యంలో గ్రామీణ క్రీడా సంబరాలను నిర్వహిస్తూనే.. మరోవైపు నాగుల చవితి సందర్భంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వార్తల్లో నిలిచారు. (Facebook/Photo)
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: MLA Roja, R K Selvamani, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు