MLA రోజా భర్త సెల్వమణి విజయం.. తమిళ సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా ఎంపిక..
రోజా ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. వైసీపీ విజయం సాధించడంతో ఈమె కూడా బిజీ అయిపోయారు. ఇక ఆమె భర్త సెల్వమణి కూడా తమిళనాట చక్రం తిప్పుతున్నారు.

రోజా సెల్వమణి
- News18 Telugu
- Last Updated: July 22, 2019, 9:13 PM IST
రోజా ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. వైసీపీ విజయం సాధించడంతో ఈమె కూడా బిజీ అయిపోయారు. ఇక ఆమె భర్త సెల్వమణి కూడా తమిళనాట చక్రం తిప్పుతున్నారు. అయితే ఆయన బిజీగా ఉన్నది రాజకీయాల్లో కాదు.. తమిళ సినీ దర్శకుల సంఘం ఎన్నికల్లో. అక్కడ ఆయన అధ్యక్ష పదవికి పోటీ చేసాడు. మొన్నటికి మొన్న 99వ సంఘ సర్వసభ్య సమావేశంలో దర్శకుడు భారతీరాజాను అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎంచుకున్నారు. కానీ ఈయన ఎన్నికను సంఘంలోని ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది.

దాంతో దర్శకుడు జననాథన్ సంఘ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని డిమాండ్ చేయడంతో అవమానంగా ఫీల్ అయిన దర్శకుడు భారతీరాజా తన పదవికి రాజీనామా చేసారు. దాంతో మరోసారి ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగాయి. జులై 14న జరగాల్సిన ఎన్నికలు అనుకోని కారణాలతో జులై 21వ తేదీకి వాయిదా పడ్డాయి. ఇక ఈ ఎన్నికల్లో దర్శకుడు ఎస్పీ జననాథన్, అమీర్ల నామినేషన్లను తిరష్కరించడంతో వారి వర్గం పోటీ నుంచి పూర్తిగా తప్పుకుంది. ఆ తర్వాత అధ్యక్ష పదవికి దర్శకుడు రోజా భర్త ఆర్కే సెల్వమణితో పాటు విద్యాసాగర్ పోటీలో నిలబడ్డారు.
ఉపాధ్యక్ష పదవికి దర్శకుడు కేఎస్ రవికుమార్, రవి పోటీ పడ్డారు. అన్ని పదవులకు చెన్నైలో జులై 21 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. హీరో విజయ్ తండ్రి, సీనియర్ దర్శక నిర్మాత ఎస్ఏ చంద్రశేఖర్, నటుడు కే.బాగ్యరాజ్ వంటి వాళ్లు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం ఈ సంఘంలో 1,900 మంది సభ్యులు ఉండగా.. 1503 ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఇందులో ఆర్కే సెల్వమణి 1,386 ఓట్ల అత్యధిక మెజారిటీతో గెలుపొందాడు. ఈయనకు పోటీగా ఉన్న విద్యాసాగర్ కేవలం 100 ఓట్లనే దక్కించుకున్నాడు. ఉపాధ్యక్షుడి పదవికి పోటీ చేసిన దర్శకుడు కే ఎస్ రవికుమార్ 1,489 ఓట్లతో గెలుపొందారు. మిగిలిన వాళ్ల వివరాలు ఇంకా బయటికి రాలేదు. మొత్తానికి సెల్వమణి తమిళ సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా గెలుపొందడాన్ని పలువురు ప్రముఖులు హర్షిస్తున్నారు.

సెల్వమణి ఫైల్ ఫోటో
దాంతో దర్శకుడు జననాథన్ సంఘ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని డిమాండ్ చేయడంతో అవమానంగా ఫీల్ అయిన దర్శకుడు భారతీరాజా తన పదవికి రాజీనామా చేసారు. దాంతో మరోసారి ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగాయి. జులై 14న జరగాల్సిన ఎన్నికలు అనుకోని కారణాలతో జులై 21వ తేదీకి వాయిదా పడ్డాయి. ఇక ఈ ఎన్నికల్లో దర్శకుడు ఎస్పీ జననాథన్, అమీర్ల నామినేషన్లను తిరష్కరించడంతో వారి వర్గం పోటీ నుంచి పూర్తిగా తప్పుకుంది. ఆ తర్వాత అధ్యక్ష పదవికి దర్శకుడు రోజా భర్త ఆర్కే సెల్వమణితో పాటు విద్యాసాగర్ పోటీలో నిలబడ్డారు.

సెల్వమణి ఫైల్ ఫోటో
ఉపాధ్యక్ష పదవికి దర్శకుడు కేఎస్ రవికుమార్, రవి పోటీ పడ్డారు. అన్ని పదవులకు చెన్నైలో జులై 21 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. హీరో విజయ్ తండ్రి, సీనియర్ దర్శక నిర్మాత ఎస్ఏ చంద్రశేఖర్, నటుడు కే.బాగ్యరాజ్ వంటి వాళ్లు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం ఈ సంఘంలో 1,900 మంది సభ్యులు ఉండగా.. 1503 ఓటు హక్కు వినియోగించుకున్నారు.

రోజా సెల్వమణి
వాటికి బానిసైన టాప్ హీరోయిన్ రాశిఖన్నా..
జయలలిత బయోపిక్ షూటింగ్ పూర్తి.. విడుదల తేది ఖరారు..
ఫేస్బుక్లో ప్రత్యక్షమైన అర్ధనగ్న ఫొటోలు.. హీరోయన్ గగ్గోలు...
నగ్నంగా ఉన్న హీరోయిన్ ఫోటో పోస్ట్.. ఫైర్ అయిన ముద్దుగుమ్మ..
విమర్శలే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి.. కాజల్ అగర్వాల్..
తమిళ హీరో విజయ్‌కు ఎన్టీఆర్ ఫోన్.. కన్ఫామ్ చేసిన మహేష్..
Loading...