ఆ విషయంలో రోజాకు సరిలేరు ఎవ్వరు.. ఇదిగో సాక్ష్యం..

MLA Roja | తెలుగు ఇండస్ట్రీలో రోజాకు ఆ విషయంలో ఎవరు సరిలేరు. ముఖ్యంగా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సినిమాలకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది.

news18-telugu
Updated: April 14, 2020, 4:43 PM IST
ఆ విషయంలో రోజాకు సరిలేరు ఎవ్వరు.. ఇదిగో సాక్ష్యం..
ఎమ్మెల్యే రోజా (File/Photo)
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో రోజాకు ఆ విషయంలో ఎవరు సరిలేరు. ముఖ్యంగా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సినిమాలకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. ఎంతో సినీ నటులు రాజకీయాల్లో ప్రవేశించి తమ లక్‌ను పరీక్షించుకున్నారు. అదే కోవలో రోజా కూడా తెలుగు దేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసారు. అంతేకాదు చాలా మంది నటీనటులు పొలిటిక్స్‌లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత అందులో కొనసాగే వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. ఓ సారి ఓడిపోయిన తర్వాత రాజకీయాల్లో కొనసాగడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపరు. కానీ రోజా మాత్రం రెండు సార్లు ఓడిపోయినా.. ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. అపుడు మాత్రం ప్రతిపక్షంలో ఉన్నారు. తాజాగా మొన్నటి ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీ వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఒక నటిగా ఉంటూ రాజకీయాల్లో ఓడిపోయినా.. అక్కడ కృంగిపోకుండా.. పట్టుదలతో మూడోసారైనా ఎమ్మెల్యేగా గెలవడంతో పాటూ రాజకీయాల్లో కొనసాగడం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్‌గా రోజాది ఒక రికార్డు అనే చెప్పాలి.

mla roja his unique peace in politics and cinema here are the details,mla roja,roja unique peace,roja unique peace politics,roja twitter,Jabardasth, jabardasth roja, adirindi, nagababu adirindi, navdeep, జబర్ధస్త్, రోజా, నాగబాబు, అదిరింది, నవదీప్,రాజకీయాల్లో రోజా,రాజకీయాల్లో రోజా ప్రత్యేకం
వైసీపీ ఎమ్మెల్యే రోజా (MLA Roja)


ఇక చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీ పెట్టి 18 సీట్లు గెలిచిన తర్వాత తన పార్టీని నడపలేక కాంగ్రెస్‌లో విలీనం చేసి ఇపుడు మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు బాలకృష్ణ కూడా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజకీయాలను సీరియస్‌గా తీసుకోకుండా సినిమాలే చేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లో కొనసాగుతాడనుకుంటే.. ఆయన కూడా సినిమాలవైపు అడుగులు వేసారు. ఈ రకంగా రోజా మాత్రం రెండు సార్లు ఓడిపోయినా.. మొక్కవోని ధైర్యంతో రాజకీయాల్లో తాను అనుకున్న స్థాయికి చేరుకున్నారు. తమిళనాడులో జయలలిత తప్పించిన మరే నటి కూడా ఈ స్థాయిలో రాణించలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఒకస్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రోజా.. రాజకీయంగా ఎన్నో దెబ్బలు తగిలినా.. ఎక్కడా వెరవకుండా రాజకీయంగా రాణించడం మాములు విషయం కాదనే చెప్పాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: April 14, 2020, 4:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading