MLA Roja: హీరోయిన్‌గా రోజా తన కెరీర్‌లో ఎన్ని సినిమాలు చేసినా.. ఆ చిత్రానికి మాత్రం ప్రత్యేక స్థానం ఉందని పలు సందర్భాల్లో ప్రస్తావించింది. రోజా ఒకవైపు రాజకీయాలు మరోవైపు సినిమాలు, టీవీలకు సంబంధించిన ప్రోగ్రామ్‌లతో ఫుల్ బిజీగా ఉంది. ఈ మధ్య రెండు మేజర్ ఆపరేషన్స్ తర్వాత జబర్ధస్త్ వంటి ప్రోగ్రామ్‌లకు త స్వస్తి చెప్పింది. ప్రస్తుతం రోజా.. ఇంటి నుంచే ఎమ్మెల్యేగా .. ఏపీఐఐసీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తోంది. మరోవైపు వచ్చే మంత్రి వర్గంలో జగన్ క్యాబినేట్‌లో రోజాకు మంత్రి పదవి ఖాయం అనే మాట వినిపిస్తోంది. ఒకవైపు ఎమ్మెల్యేగా.. ఏపీఐఐసీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే.. ఇంకోవైపు కుటుంబ బాధ్యతలను సమానంగా నిర్వహిస్తూ వస్తోంది. రోజా.. రాజకీయంగా ఇంత పలుకుబడికి కారణం ఆమె చేసిన సినిమాలనే చెప్పాలి. ఈ చిత్రాల మూలంగానే ఆమెకు ఇంత పాపులారిటీ వచ్చిందన్న సంగతి అందరికీ తెలిసిందే కదా. ఆ తర్వాత ఈటీవీలో ప్రసారమయ్యే జబర్ధస్త్ కామెడీ షో కూడా రోజా పాపులారిటీ మాస్‌లోకి మరింత పోయేలా దోహదం చేసింది. ఇక రోజా తన కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసింది. అందులో ఒక చిత్రానికి మాత్రం ప్రత్యేక స్థానం ఉందట.
ఇక హీరోయిన్‌గా రోజా మొదటి చిత్రం ‘ప్రేమ తపస్సు’. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ఈ సినిమాలో రోజా కథానాయికగా నటించింది. ఆ తర్వాత పరుచూరి బ్రదర్స్ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో శోభన్ బాబు హీరోగా ‘సర్పయాగం’ సినిమాలో శోభన్ బాబు కూతరు పాత్రలో మంచి మార్కులే కొట్టేసింది. ఆ తర్వాత సీతారత్నం గారి అబ్బాయి, ముఠామేస్త్రీ సినిమాల్లో రోజా నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక బాలకృష్ణ హీరోగా నటించిన ‘భైరవ ద్వీపం’ సినిమా రోజాను స్టార్ హీరోయిన్‌ను చేసింది.
ఈ సినిమాలో ఆమె రాకుమారిగా తనదైన నటన ప్రదర్శించింది.ఈ సినిమా తర్వాత రోజా వెనుదిరిగి చూసుకోలేదు. ఐతే.. రోజా ఎన్నో సినిమాల్లో కథానాయికగా నటించిన ఆమెకు వ్యక్తిగతంగా సంతృప్తి ఇచ్చిన చిత్రం ‘అన్నమయ్య’. ఈ విషయాన్ని ఆమె ఎన్నో సందర్భాల్లో ప్రస్తావించింది కూడా.
అవును ఈ సినిమాలో రోజా ప్రధాన కథానాయికగా నటించకపోయినా.. శ్రీ వేంకటేశ్వర స్వామిపై తెరకెక్కిన ‘అన్నమయ్య’ చిత్రంలో నటించడం తన భాగ్యమంటూ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించింది. ఆ ఏడు కొండలస్వామి దయ వల్లే ఆయన నీడన ఉన్న నగరి నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన విషయాన్ని రోజా పలు ఇంటర్య్యూలో చెప్పింది. ఆ సినిమాలో ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు. కానీ శ్రీ వేంకటేశ్వరస్వామిపై ఉన్న నమ్మకంతో పాటు కే.రాఘవేంద్రరావు దర్శకత్వం అనగానే ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నానని రోజా పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు. అప్పటికే తనకు రాకుమారిగా ఇమేజ్ ఉంది. అది ఈ సినిమాకు బాగానే ఉపయోగపడినట్టు చెప్పుకొచ్చింది. ఈ చిత్రంలో రోజా.. మోహన్ బాబు సరసన నటించింది. మొత్తంగా రోజా సినీ జీవితంలో కాదు.. ఆ చిత్రంలో నటించిన నటీనటులకు, టెక్నీషియన్స్ అందిరికీ అన్నమయ్య ప్రత్యేక చిత్రంగా నిలిచిపోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: K. Raghavendra Rao, MLA Roja, Mohan Babu, Nagarjuna Akkineni, Suman, Telugu Cinema, Tollywood