Roja: ఆ పదవి కోసం రోజా కార్తీక మాస ప్రత్యేక పూజలు.. ఈ సారైనా దేవుడు కరుణించేనా..

Roja | కార్తీక మాసం హిందువులకు ముఖ్యమైన నెల.  ఈ నెల శివుడికి ఎంతో ప్రీతి పాత్రమైనది. అందుకే ఈ నెలలో ఆమె ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు.

news18-telugu
Updated: November 20, 2020, 6:46 PM IST
Roja: ఆ పదవి కోసం రోజా కార్తీక మాస ప్రత్యేక పూజలు.. ఈ సారైనా దేవుడు కరుణించేనా..
రోజా కార్తీక మాస పూజలు (Twitter/Photo)
  • Share this:
Roja | కార్తీక మాసం హిందువులకు ముఖ్యమైన నెల.  ఈ నెల శివుడికి ఎంతో ప్రీతి పాత్రమైనది. చాలా మంది ఈ నెల రోజుల పాటు ఇంటి ముందు కార్తీక దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఈ మాసంలో చాలా మంది సత్యనారాయణ వ్రతంతో పాటు కేదారేశ్వర నోమును నోచుకుంటూ ఉంటారు. ఈ నెలలో ఎక్కువగా పెళ్లిళ్లు, ఇతరత్రా శుభకార్యాలు జరుగుతుంటాయి. ఈ సందర్భంగా రోజా కార్తీక మాస ప్రత్యేక పూజలు చేస్తున్నారు.అంతేకాదు ఎన్నో నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఓ పోస్ట్‌ను  ఈ నెలలోనే ఎమ్మెల్యే రోజా ఏపీ సీఎం జగన్ అప్పగించనున్నట్టు సమాచారం. రోజా విషయానికొస్తే.. హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తర్వాత రాజకీయాల్లో ప్రవేశించింది. మరోవైపు జబర్ధస్త్ కామెడీ షో వంటి ప్రోగ్రామ్‌లకు జడ్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ కార్తీక మాసంలోనే రోజాకు ఏపీ సీఎం జగన్.. ఏపీఐఐసీ చైర్మన్ బాధ్యతలతో పాటు మరో ముఖ్య బాధ్యత కూడా అప్పగించబోతున్నట్టు సమాచారం.

రోజా కార్తీక మాస ప్రత్యేక పూజలు (Twitter/Photo)


మొన్నటి ఎన్నికల్లో రోజా రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీ వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఒక నటిగా ఉంటూ రాజకీయాల్లో ఓడిపోయినా.. అక్కడ కృంగిపోకుండా.. పట్టుదలతో మూడోసారైనా ఎమ్మెల్యేగా గెలవడంతో పాటూ రాజకీయాల్లో కొనసాగడం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్‌గా రోజాది ఒక రికార్డు అనే చెప్పాలి.

mla roja got another post for ap cm ys jagan mohan reddy here are the details,mla roja,ap cm ys jagan mohan reddy,roja twitter,roja instagram,roja facebook,roja got another post,mla roja got another post,roja unique peace,roja unique peace politics,roja twitter,Jabardasth, jabardasth roja, adirindi, nagababu adirindi, navdeep, జబర్ధస్త్, రోజా, నాగబాబు, అదిరింది, నవదీప్,రాజకీయాల్లో రోజా,రాజకీయాల్లో రోజా ప్రత్యేకం,రోజాకు మరో పోస్ట్,ఏపీ టాలీవుడ్ ఛీప్‌గా రోజా
రోజా (Twitter/Photo)


రోజా మొన్నటి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆమెకు మంత్రి పదవి ఖాయం అనే మాట వినబడింది. కానీ కాస్ట్ ఈక్వేషన్స్ కారణంగా ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఆమెకు మంత్రి పదవితో సమానమైన ఏపీఐఐసీ చైర్మన్ పదవి కట్టబెట్టాడు ఏపీ సీఎం జగన్. తాజాగా కరోనా నేపథ్యంలో రోజా.. ఒకవైపు ఇంటికే పరిమితం కాకుండా తన నియోజకవర్గంలో ప్రజలకు అండగా నిలబడుతూ వాళ్లకు చేయూత అందిస్తోంది. తాజాగా కరోనా నేపథ్యంలో ఏపీలో షూటింగ్స్ కోసం ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక పాలసీ తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో సినీ రంగానికి సంబంధించి టాలీవుడ్‌లో మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్న రోజాను ఈ కమిటీ చీఫ్‌గా నియమించబోతున్నట్టు దాదాపు ఖరారైంది. ఎపుడో ఖరారైనా ఈ పోస్ట్ ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది. తాజాగా ఈ పెండింగ్ ఫైల్ దుమ్ము దులిపే పనిలో ఉన్నాడు జగన్.ఈ నెలలోనే ఫిల్మ్ షూటింగ్స్‌కు సంబంధించిన కమిటీకి రోజాను చైర్మన్‌గా నియమించే అవకాశం ఉంది.

mla roja got another post for ap cm ys jagan mohan reddy here are the details,mla roja,ap cm ys jagan mohan reddy,roja twitter,roja instagram,roja facebook,roja got another post,mla roja got another post,roja unique peace,roja unique peace politics,roja twitter,Jabardasth, jabardasth roja, adirindi, nagababu adirindi, navdeep, జబర్ధస్త్, రోజా, నాగబాబు, అదిరింది, నవదీప్,రాజకీయాల్లో రోజా,రాజకీయాల్లో రోజా ప్రత్యేకం,రోజాకు మరో పోస్ట్,ఏపీ టాలీవుడ్ ఛీప్‌గా రోజా
రోజా, వైఎస్ జగన్


ఆమె కింద ఐఏఎస్ అధికారిని కూడా నియమించనున్నారు. ఈ కార్తీకంలోనే ఆమెకు ఈ బాధ్యతలు అప్పగించబోతున్నట్టు సమాచారం.  ఎవరైనా టాలీవుడ్ దర్శక,నిర్మాతలు హీరోలు ఏపీలో ఏదైనా షూటింగ్స్ నిమిత్తం  పర్మిషన్ కావాలంటే ప్రభుత్వం తరుపున ఆమె నేతృత్వంలో ఉన్న కమిటికి విన్నవిస్తే సరిపోతుంది. ఆమె .. ఐఏఎస్ అధికారి ద్వారా  షూటింగ్స్‌కు అనుమతులు ఇచ్చేలా చేస్తోంది.  మరోవైపు ఏపీ సీఎం జగన్.. రెండున్నరేళ్ల తర్వాత చేపట్టబోయే మంత్రి వర్గ విస్తరణలో రోజాకు క్యాబినేట్‌లో చోటు ఖాయం అనే మాటలు వినబడుతున్నాయి. అంటే వచ్చే యేడాది కార్తీక మాసం వరకు రోజాను మంత్రిగా చూడొచ్చన్న మాట.  ప్రస్తుతానికి ఆమెకు బెర్త్ ఇవ్వాలని ఉన్న..తనకున్న పరిధి నేపథ్యంలో ఆమెకు మంత్రి పదవి కాకుండా.. అందుకు సమానమైన పదవితో జగన్ ఆమెను గౌరవించినట్టు తెలుస్తోంది. మరి మంత్రి కావాలనుకున్న రోజా కల వచ్చే కార్తీక మాసం వరకు నెరవేరుతుందా లేదా అనేది చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 20, 2020, 6:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading