Home /News /movies /

MLA ROJA DO YOU KNOW ACTRESS CUM POLITICIAN CUM JABARDASTH COMEDY SHOW JUDGE ROJA ACT ONE ONLY BOLLYWOOD MOVIE HERE ARE THE DETAILS TA

MLA Roja: ఎమ్మెల్యే రోజా బాలీవుడ్‌లో నటించిన ఏకైక సినిమా ఇదే..

రోజా సెల్వమణి (Twitter/Photo)

రోజా సెల్వమణి (Twitter/Photo)

MLA Roja | వైసీపీ ఎమ్మెల్యే కమ్ జబర్ధస్త్ జడ్జ్‌గా రోజా తనదైన శైలిలో దూసుకుపోతుంది. నటిగా రోజా విషయానికొస్తే.. తెలుగు,తమిళంలో ఎక్కువ సినిమాల్లో నటించిన రోజా.. కన్నడ, మలయాళంలో ఓ మోస్తరు చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ రోజా.. తన కెరీర్‌లో ఒకే ఒక్క బాలీవుడ్ చిత్రంలో నటించింది. ఆ వివరాల్లోకి వెళితే.. 

ఇంకా చదవండి ...
    MLA Roja | వైసీపీ ఎమ్మెల్యే కమ్ జబర్ధస్త్ జడ్జ్‌గా రోజా  (MLA Roja ) తనదైన శైలిలో దూసుకుపోతుంది. నటిగా రోజా విషయానికొస్తే.. తెలుగు,తమిళంలో ఎక్కువ సినిమాల్లో నటించిన రోజా.. కన్నడ, మలయాళంలో ఓ మోస్తరు చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ రోజా.. తన కెరీర్‌లో ఒకే ఒక్క బాలీవుడ్ ( హిందీ ) చిత్రంలో నటించింది. ఆ వివరాల్లోకి వెళితే..రోజా విషయానికొస్తే.. తెలుగు ‘ప్రేమ తపస్సు’ సినిమా ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టి.. సర్పయాగం సినిమాతో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బాలయ్యతో నటించిన ‘భైరవ ద్వీపం’తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు విజయశాంతి  (Vijayashanti) తర్వాత లేడీ ఓరియంటెడ్ పాత్రలతో అలరించింది రోజా. ఇక హీరోయిన్‌గా ఫేడౌట్ అయ్యాకా.. రోజా.. తెలుగు దేశం పార్టీ ద్వారా రాజకీయాల్లో అడుగుపెట్టింది.

    ఆ తర్వాత ఓ సారి టీడీపీ టికెట్ పై పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. ఆ తర్వాత  రెండో సారి మాత్రం వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికైంది. అప్పట్లో ఆమె ప్రాతినిథ్యం వహించిన వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో ఆమెను అందరు ఐరెన్ లెగ్ అని కామెంట్స్ కూడా చేసారు. ఇక 2019 సార్వత్రిక ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీ వైసీపీ అధికారంలోకి రావడంతో రోజాపై ఉన్న ఐరెన్ లెగ్ ముద్ర చెరిగిపోయింది.

    MLA Roja will act in only this two Tollywood heroes movies conditions apply,roja,mla roja,balakrishna,chiranjeevi,roja chiranjeevi balakrishna,roja balakrishna,roja chiranjeevi,jabardasth comedy show judge roja,roja twitter,ysrcp,ys jagan roja,roja instagram,roja facebook,balakrishna facebook,chiranjeevi facebook,nagababu facebook,jabardasth comedy show,mega family,nandamuri family,balakrishna,chiranjeevi,nagababu,pawan kalyan,roja balakrishna balayya tdp,roja janasena nagababu chiranjeevi pawan kalyan,roja balakrishna nbk,tollywood,telugu cinema,రోజా,మెగా ఫ్యామిలీ,నందమూరి ఫ్యామిలీ,రోజా చిరంజీవి,రోజా బాలయ్య బాలకృష్ణ,బాలకృష్ణ రోజా,జబర్దస్త్ కామెడీ షో,
    ఎమ్యెల్యే రోజా (File/Photo)


    ఒక నటిగా ఉంటూ రాజకీయాల్లో ఓడిపోయినా.. అక్కడ కృంగిపోకుండా.. పట్టుదలతో మూడోసారైనా ఎమ్మెల్యేగా గెలవడంతో పాటూ రాజకీయాల్లో కొనసాగడం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్‌గా రోజాది ఒక రికార్డు అనే చెప్పాలి. అంతేకాదు ఈమె ప్రస్తుతం ఏపీఐఐసీ చైర్మన్‌గా క్యాబినేట్ ర్యాంకు హోదా కూడా అనుభవిస్తుంది. ఇక రోజా హిందీ చిత్ర విషయానికొస్తే.. ఈమె హిందీలో మహేష్ భట్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాణంలో చిరంజీవి హీరోగా నటించిన ‘ది జెంటిల్మెన్’ సినిమాలో ఐటెం సాంగ్‌లో మెరిసింది రోజా. ఈ సినిమా తమిళం, తెలుగులో శంకర్ దర్శకత్వంలో అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘జెంటిల్మెన్’ సినిమాకు రీమేక్. తెలుగులో ప్రభుదేవా చేసిన ‘చికుబుకు రైలే’ పాటను హిందీలో చిరంజీవే చేసారు. సౌత్‌లో  గౌతమి ఐటెం సాంగ్‌లో మెరిస్తే.. హిందీలో రోజా ఐటెం సాంగ్‌లో చిందేసింది.

    అంతకు ముందు రోజా.. నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘రక్షణ’ సినిమాలో ఓ ఐటెం పాటలో మెరిసిన సంగతి తెలిసిందే కదా. మొత్తంగా హిందీలో రోజా నటించిన ఏకైక చిత్రంగా ‘ది జెంటిల్మెన్’ సినిమా నిలిచిపోయింది. ఇందులో పూర్తి స్థాయి పాత్రలో కాకుండా..ఐటెం పాటలో రోజా మెరవడం విశేషం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Chiranjeevi, Jabardasth comedy show, MLA Roja, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు