హోమ్ /వార్తలు /సినిమా /

ఎమ్మెల్యే రోజా అభిమానులకు శుభవార్త.. ఇకపై కాలర్ ఎగరేసేలా..

ఎమ్మెల్యే రోజా అభిమానులకు శుభవార్త.. ఇకపై కాలర్ ఎగరేసేలా..

జబర్దస్త్ జడ్జి రోజా (MLA Roja/Instagram)

జబర్దస్త్ జడ్జి రోజా (MLA Roja/Instagram)

MLA Roja | ఎమ్మెల్యే రోజా త్వరలోనే తన అభిమానులకు ఓ శుభవార్త చెప్పనుంది. రోజా విషయానికొస్తే..

  ఎమ్మెల్యే రోజా త్వరలోనే తన అభిమానులకు ఓ శుభవార్త చెప్పనుంది. రోజా విషయానికొస్తే.. తెలుగు ‘ప్రేమ తపస్సు’ సినిమా ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టి.. సర్పయాగం సినిమాతో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బాలయ్యతో నటించిన ‘భైరవ ద్వీపం’తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు విజయశాంతి తర్వాత లేడీ ఓరియంటెడ్ పాత్రలతో అలరించింది రోజా. ఇక హీరోయిన్‌గా ఫేడౌట్ అయ్యాకా.. రోజా.. తెలుగు దేశం పార్టీ ద్వారా రాజకీయాల్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత రెండు సార్లు టీడీపీ టికెట్ పై పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. ముచ్చటగా మూడోసారి మాత్రం వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికైంది. అప్పట్లో ఆమె ప్రాతినిథ్యం వహించిన వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో ఆమెను అందరు ఐరెన్ లెగ్ అని సంభోదిస్తున్నారు. తాజాగా మొన్నటి ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీ వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఒక నటిగా ఉంటూ రాజకీయాల్లో ఓడిపోయినా.. అక్కడ కృంగిపోకుండా.. పట్టుదలతో మూడోసారైనా ఎమ్మెల్యేగా గెలవడంతో పాటూ రాజకీయాల్లో కొనసాగడం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్‌గా రోజాది ఒక రికార్డు అనే చెప్పాలి. తాజాగా ఆమె కొడుకు పుట్టినరోజు వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి.

  mla roja daughter likely to entry into films as heroine,roja,mla roja,mla roja daughter,mla roja son,jabardasth comedy show,jabardasth judge roja,jabardasth judge roja son birthday,mla roja son birthday,mla roja,mla roja son kowshik birthday celebrations,mla roja son birthday celebration,mla roja selvamani son kowshik birthday celebrations,roja son birthday celebrations,actress roja son birthday celebrations,actress roja son kowshik birthday party,roja son birthday celebration,mla roja son birthday celebrations,roja son birthday,roja son kaushik birthday celebrations,actress roja son birthday party,roja son kowshik birthday party,actress roja son kowshik birthday,telugu cinema,రోజా,రోజా కొడుకు బర్త్ డే సెలబ్రేషన్స్,రోజా కొడుకు కౌశిక్ బర్త్ డే,హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న రోజా కూతురు
  భర్త, కూతురు, కొడుకుతో రోజా (File/Photo)

  ఈ వేడుకలకు కుటుంబ సభ్యలతో ఆమె అన్నగారి కుటుంబానికి చెందిన వాళ్లు హాజరయ్యారు. ఈ వేడుకల్లో ముఖ్యంగా రోజా కుమారుడుతో పాటు కుమార్తె హైలెట్‌గా నిలిచింది. ఈమె అచ్చు తల్లి రోజా పోలికలు ఉన్నాయని అభిమానులు చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఆమె నవ్వు కూడా రోజాలాగే ఉందని రోజా కూతురు ఫోటోలను షేర్ చేస్తున్నారు. అంతేకాదు ఫ్యూచర్‌లో హీరోయిన్‌ అయ్యే లక్షణాలు ఆమెలో పుష్కలంగా ఉన్నట్టు అభిమానులు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం రోజా కూతురు చిన్నది. ఇప్పుడు కాకున్న మరో ఐదారేళ్ల తర్వాతైనా హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందా అనేది చూడాలి.  మరి ఫ్యాన్స్ కోరిక మన్నించి రోజా.. తన కూతురును కథాానాయికగా పరిచయం చేస్తుందా లేదా అనేది చూడాలి.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Jabardasth comedy show, MLA Roja, Tollywood

  ఉత్తమ కథలు