రోజా సినీ జీవితంలో ఆ సినిమాకు ప్రత్యేక స్థానం ఉందట..

రోజా సినీ జీవితంలో ఆ సినిమాకు ప్రత్యేక స్థానం ఉందట. రోజా తన సినీ జీవితంలో ఎన్నో సినిమాల్లో కథనాయికగా నటించింది. కానీ ఆ చిత్రానికి మాత్రం ప్రత్యేక స్థానం ఉంది.

news18-telugu
Updated: August 7, 2020, 10:28 AM IST
రోజా సినీ జీవితంలో ఆ సినిమాకు ప్రత్యేక స్థానం ఉందట..
రోజా (File/Photo)
  • Share this:
రోజా సినీ జీవితంలో ఆ సినిమాకు ప్రత్యేక స్థానం ఉందట. రోజా తన సినీ జీవితంలో ఎన్నో సినిమాల్లో కథనాయికగా నటించింది. ఏ చిత్రంలో నటించినా.. తనదైన శైలిలో మెప్పించడం రోజా ప్రత్యేకత. ఇక హీరోయిన్‌గా రోజా మొదటి చిత్రం  ‘ప్రేమ తపస్సు’.  రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ఈ సినిమాలో రోజా కథానాయికగా నటించింది. ఆ తర్వాత పరుచూరి బ్రదర్స్ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో శోభన్ బాబు హీరోగా ‘సర్పయాగం’ సినిమాలో  శోభన్ బాబు కూతరు పాత్రలో మంచి మార్కులే కొట్టేసింది. ఆ తర్వాత సీతారత్నం గారి అబ్బాయి, ముఠామేస్త్రీ సినిమాల్లో రోజా నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక బాలకృష్ణ హీరోగా నటించిన ‘భైరవ ద్వీపం’ సినిమా రోజాను స్టార్ హీరోయిన్ చేసింది. ఈ సినిమాలో ఆమె రాకుమారిగా తనదైన నటన ప్రదర్శించింది.ఈ సినిమా తర్వాత రోజా వెనుదిరిగి చూసుకోలేదు. ఐతే.. రోజా ఎన్నో సినిమాల్లో కథానాయికగా నటించిన ఆమెకు వ్యక్తిగతంగా సంతృప్తి ఇచ్చిన చిత్రం ‘అన్నమయ్య’.

అన్నమయ్య సినిమాలో మోహన్ బాబు, రోజా (Youtube/Credit)


అవును ఈ సినిమాలో రోజా ప్రధాన కథానాయికగా నటించకపోయినా.. శ్రీ వేంకటేశ్వర స్వామిపై తెరకెక్కిన ఈ చిత్రంలో నటించడం తన భాగ్యమంటూ వ్యాఖ్యానించింది. ఆ ఏడు కొండలస్వామి దయ వల్లే ఆయన నీడన ఉన్న నగరి నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన విషయాన్ని రోజా పలు ఇంటర్య్యూలో చెప్పింది. ఆ సినిమాలో ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు. కానీ శ్రీ వేంకటేశ్వరస్వామిపై ఉన్న నమ్మకంతో పాటు కే.రాఘవేంద్రరావు దర్శకత్వం అనగానే ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నానంది. అప్పటికే తనకు రాకుమారిగా ఇమేజ్ ఉంది. అది ఈ సినిమాకు బాగానే ఉపయోగపడినట్టు చెప్పుకొచ్చింది. మొత్తంగా రోజా సినీ జీవితంలో కాదు.. ఆ  చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికీ అన్నమయ్య ప్రత్యేక చిత్రం అనే చెప్పాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 7, 2020, 10:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading