ఎమ్మెల్యే రోజాకు అభిమానుల నుంచి శుభాకాంక్షల వెల్లువ.. ఎందుకంటే..

MLA Roja | ఎమ్మెల్యే రోజాకు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ రోజు వైసీపీ ఎమ్మెల్యే ఏపీఐఐసీ ఎమ్మెల్యే ఆర్కే రోజా-సెల్వమణి దంపతుల 18వ వివాహ వార్షికోత్సవం.

news18-telugu
Updated: August 21, 2020, 4:33 PM IST
ఎమ్మెల్యే రోజాకు అభిమానుల నుంచి శుభాకాంక్షల వెల్లువ.. ఎందుకంటే..
ఎమ్మెల్యే రోజా (File/Photo)
  • Share this:
ఎమ్మెల్యే రోజాకు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రోజా విషయానకొస్తే.. హీరోయిన్ గానూ, ప్రజా ప్రతినిధిగానూ, టీవీ వ్యాఖ్యతగా ఓ వెలుగు వెలుగుతున్న ఆర్కే రోజా అంటే తెలుగు నాట పరిచయం లేని పేరు. తెలుగులో టాప్ స్టార్లు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో పాటు తమిళనాట సూపర్ స్టార్ రజినీ కాంత్, విజయ్ కాంత్ లతో రోజా ఓ వెలుగు వెలిగింది. కొంతకాలం సినిమాల నుంచి విరామం తీసుకుని రాజకీయాల్లో అడుగు పెట్టీ ఎమ్మెల్యేగా రాణించి.. ఫైర్ బ్రాండ్ లేడీగా పేరు తెచ్చుకున్నారు.ఈ రోజు వైసీపీ ఎమ్మెల్యే ఏపీఐఐసీ ఎమ్మెల్యే ఆర్కే రోజా-సెల్వమణి దంపతుల 18వ వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు, రోజా అభిమానులు ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

భర్త సెల్వమణి‌తో, రోజా (File)
భర్త సెల్వమణి‌తో, రోజా (File)


మరోవైపు టెలివిజన్ రంగంలోనూ తనదైన శైలిలో దూసుకుపోతోంది రోజా. టాలివుడ్, బాలివుడ్ లలో చాలా మంది హీరోయిన్లు తాము ప్రేమించిన దర్శకులనే పెళ్లి చేసుకున్నారు. ఆ లిస్ట్‌లో రోజా కూడా ఒకరు. వాస్తవానికి రోజాని తమిళ చిత్ర పరిశ్రమకు `చెంబరుతి` చిత్రం ద్వారా పరిచయం చేసింది డైరెక్టర్ సెల్వమణి. ఈ చిత్రంలో ప్రశాంత్ కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రం విజయవంతమై తమిళ చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్‌ సెల్వమణి, రోజా మధ్య పరిచయం ఏర్పడింది.

mla roja daughter likely to entry into films as heroine,roja,mla roja,mla roja daughter,mla roja son,jabardasth comedy show,jabardasth judge roja,jabardasth judge roja son birthday,mla roja son birthday,mla roja,mla roja son kowshik birthday celebrations,mla roja son birthday celebration,mla roja selvamani son kowshik birthday celebrations,roja son birthday celebrations,actress roja son birthday celebrations,actress roja son kowshik birthday party,roja son birthday celebration,mla roja son birthday celebrations,roja son birthday,roja son kaushik birthday celebrations,actress roja son birthday party,roja son kowshik birthday party,actress roja son kowshik birthday,telugu cinema,రోజా,రోజా కొడుకు బర్త్ డే సెలబ్రేషన్స్,రోజా కొడుకు కౌశిక్ బర్త్ డే,హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న రోజా కూతురు
భర్త, కూతురు, కొడుకుతో రోజా (File/Photo)


ఆ పరిచయం కాస్త.. ప్రేమగా మారి.. చివరకు మూడు ముళ్ల బంధంతో 2002లో ఒక్కటయ్యారు. అయితే రోజా, సెల్వమణి వివాహం జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే కానీ, వీరిద్దరి మధ్య ప్రేమాయణం ఎలా కొనసాగిందన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు. వాస్తవానికి సెల్వమణి రోజాను ప్రేమించిన విషయాన్ని ముందుగా రోజాకు కాకుండా రోజా తండ్రి దగ్గరకు వెళ్లి చెప్పారట. రోజా తండ్రిని ఒప్పించుకుని ఆ తర్వాత రోజాకు విషయం చెప్పాడట సెల్వమణి. ఇక రోజా కూడా సెల్వమణి ప్రేమ కోసం చాలా కష్టపడిందట. ఆయన కోసం తమిళం మాట్లాడటం, చదవడం కూడా నేర్చుకుందట. చివరకు ప్రేమించిన దర్శకుడినే పెళ్లాడి.. లైఫ్‌ను హ్యాపీగా రన్ చేస్తున్నారు.త్వరలో ఈమె మంత్రిగా ప్రమోషన్ పొందిన ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 21, 2020, 4:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading