ఎమ్మెల్యే రోజాకు భారీ షాక్ ఇచ్చిన జబర్దస్త్....మరీ ఇంత దారుణమా...

ఎమ్మెల్యే రోజానే...షో స్టార్టింగ్ నుంచి ప్రస్తుత లాక్ డౌన్ లో షో బ్రేక్ పడే వరకూ ఆమె కొనసాగారు. అటు రాజకీయాల్లో కంటిన్యూ అవుతూనే ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచి సత్తా చాటిన ఘనత రోజా సొంతం.

news18-telugu
Updated: May 28, 2020, 4:20 PM IST
ఎమ్మెల్యే రోజాకు భారీ షాక్ ఇచ్చిన జబర్దస్త్....మరీ ఇంత దారుణమా...
నటి రోజా (Jabardasth Comedy Show)
  • Share this:
జబర్దస్త్ షో తెలుగు నాట పరిచయం లేని పేరు. ఈ షో స్టార్ట్ అయినప్పటి నుంచి ఎవరు వెళ్లిపోయినా...ఎవరు కొత్తగా ఎంటర్ అయినా...స్థిరంగా కంటిన్యూ అవుతూ వచ్చింది మాత్రం ఎమ్మెల్యే రోజానే అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఈ షోతో పాటు ప్రారంభమైన టీ లీడర్లలో ఇప్పుడు రాకెట్ రాఘవ మాత్రమే ముందు నుంచి కంటిన్యూ అవుతున్నాడు. అలాగే యాంకర్ అనసూయ ముందు నుంచి కంటిన్యూ అవుతున్నప్పటికీ, మధ్యలో ఒక సారి జెండా ఎత్తేసి, మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ఇక నాగబాబు సుదీర్ఘంగా 7 సంవత్సరాల పాటు కొనసాగి, ఎట్టకేలకు ఆయన అదిరింది అంటూ సొంత కుంపటి పెట్టుకున్నాడు. ఇక చివరకు మిగిలింది. ఎమ్మెల్యే రోజానే...షో స్టార్టింగ్ నుంచి ప్రస్తుత లాక్ డౌన్ లో షో బ్రేక్ పడే వరకూ ఆమె కొనసాగారు. అటు రాజకీయాల్లో కంటిన్యూ అవుతూనే ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచి సత్తా చాటిన ఘనత రోజా సొంతం. అయితే తాజాగా లాక్ డౌన్ కారణంగా జబర్దస్త్ షో నిరవధికంగా నిలిచిపోయింది. దీంతో మళ్లీ షూటింగులు మొదలయ్యే దాకా ఇదే పరిస్థితి కంటిన్యూ అయ్యే చాన్స్ ఉంది. అయితే లాక్ డౌన్ కారణంగా జబర్దస్త్ నిర్వాహకులు తీవ్రంగా నష్టపోయే చాన్స్ ఉంది. దీంతో వారు ఖర్చు తగ్గించుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే తెలుగు టెలివిజన్ రంగంలో ఏ ఎంటర్ టైన్ మెంట్ షోకు కూడా ఇవ్వనంత రెమ్యూనరేషన్ జబర్దస్త్ ఆర్టిస్టులు, జడ్జీలు, ఇతర రైటర్లు, సిబ్బంది పొందుతున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారే చాన్స్ ఉంది. ఎందుకంటే కరోనా కాలంలో అడ్వర్టయిజ్ మెంట్లలో భారీగా గండి పడే చాన్స్ ఉంది. దీంతో భారీ పారితోషికాలు అందుకుంటున్న ఆర్టిస్టులను కాస్త తగ్గించుకోవాలని యాజమాన్యం ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఎమ్మెల్యే రోజా రెమ్యూనరేషన్ కూడా భారీగా కోత విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే జబర్దస్త్ ప్రజా ప్రతినిధిగా కొనసాగుతూ తన విలువైన కాలాన్ని వెచ్చిస్తున్న ఎమ్మెల్యే రోజాతో ఇలా వ్యవహరించడం ఆమె అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.
First published: May 28, 2020, 4:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading