మిథున్ చక్రబర్తి కొడుకుతో టాలీవుడ్ హీరోయిన్ మదాలస శర్మ పెళ్లి

మహాక్షయ్ చక్రవర్తి తో టాలీవుడ్ హీరోయిన్ మదాలస శర్మ పెళ్లి

news18
Updated: June 7, 2018, 11:32 AM IST
మిథున్ చక్రబర్తి కొడుకుతో టాలీవుడ్ హీరోయిన్ మదాలస శర్మ పెళ్లి
మహాక్షయ్ చక్రవర్తి తో టాలీవుడ్ హీరోయిన్ మదాలస శర్మ పెళ్లి
  • News18
  • Last Updated: June 7, 2018, 11:32 AM IST
  • Share this:
టాలీవుడ్ హీరోయిన్ మదాలస శర్మ   త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతుంది. అల్లరి నరేష్  ఫిటింగ్ మాస్టర్ సినిమాతో  తొమ్మిదేళ్ల  క్రితం టాలీవుడ్ లోకి  ఎంట్రీ  ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత కూడా కొన్ని తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో నటించింది. రెండేళ్లక్రితం వరకు పలు సినిమాల్లో  నటించిన  ఈ భామ.. కెరీర్ పరంగా ఆమెకు సరైన విజయాలు మాత్రం దక్కలేదు.

సరైన హిట్స్ లేక కెరీర్ సాగించలేకపోయిన ఈ భామ .. ఏకంగా ఓ  ప్రముఖుడు  కొడుకును పెళ్లి చేసుకోబోతుండటం విశేషం. ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి తనయడు  మహాక్షయ్ చక్రవర్తిని మదాలస శర్మ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ  లవ్ లో  ఉన్నారు.ఈ విషయం పలు మార్లు మీడియాలో కూడా వచ్చింది. ఇప్పుడీ ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అయిపోయారు.

తాజగా  మీడియాతో మాట్లాడిన మదాలస.. ​​​​​‘మూడేళ్లుగా నేను, మహాక్షయ్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. మా రెండు కుటుంబాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ కావడంతో ఈ విషయాన్ని చెప్పగానే వారేమీ ఆశ్చర్యపోలేదు. వారి అంగీకారంతోనే మార్చి నెలలో మహాక్షయ్‌ ఇంట్లో మా ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. అందుకే ఇది లవ్‌ కమ్‌ అరేంజ్డ్‌ మ్యారేజ్‌ అనుకోవచ్చు. అయితే మా వివాహం ఎక్కడ జరుతుందనేది ఇంకా నిర్ణయించలేదు కానీ కచ్చితంగా ముంబైలో మాత్రం జరగదు. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ను ప్లాన్‌ చేస్తున్నాం’ అంటూ మదాలస చెప్పుకొచ్చారు .

జూలై 7న మహాక్షయ్‌ చక్రవర్తి-మదాలస శర్మల పెళ్లి  జరగనుంది. డెస్టినేషన్ వెడ్డింగ్ గా ఈ పెళ్లి  జరగనుండగా.. ఓ అద్భుతమైన వెకేషన్ స్పాట్ లో ఈ వేడుక నిర్వహించనున్నారట. మొత్తానికి సుదీర్ఘ కాలం ప్రేమించుకున్న ఈ ప్రేమజంట.. ఎట్టకేలకు తమ ప్రేమకు పెళ్లితో శుభంకార్డు వేయబోతున్నారు.
Published by: Sunil Kumar Jammula
First published: June 7, 2018, 11:18 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading