‘మిస్టర్ కేకే’కు పాజిటివ్ బజ్.. విక్రమ్ ఈ సారి హిట్ కొడతాడా..?
15 ఏళ్ల కిందే తెలుగులో మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు హీరో విక్రమ్. అప్పట్లోనే ఈయన సినిమా వస్తుందంటే తెలుగులో కూడా భారీ అంచనాలుండేవి. కానీ ఆ తర్వాత వరస ఫ్లాపులతో ఆ ఇమేజ్ పడిపోయింది.

విక్రమ్ మిస్టర్ కేకే సినిమా
- News18 Telugu
- Last Updated: July 17, 2019, 2:55 PM IST
15 ఏళ్ల కిందే తెలుగులో మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు హీరో విక్రమ్. అప్పట్లోనే ఈయన సినిమా వస్తుందంటే తెలుగులో కూడా భారీ అంచనాలుండేవి. కానీ ఆ తర్వాత వరస ఫ్లాపులతో ఆ ఇమేజ్ పడిపోయింది. ఒకప్పుడు కలిసొచ్చిన ప్రయోగాలే ఆ తర్వాత బెడిసికొట్టాయి. మధ్యలో మాస్ సినిమాలు చేసినా కలిసి రాలేదు. కొన్ని రోజులుగా ఈయన సినిమాలు వచ్చినట్లు కూడా తెలియడం లేదు ప్రేక్షకులకు. ఇలాంటి సమయంలో వస్తున్న మిస్టర్ కేకే సినిమా ట్రైలర్ ఆసక్తి పుట్టించింది. విజువల్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. రాజేష్ ఎమ్ సెల్వ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ అంతా విదేశాల్లోనే జరిగింది. కమల్ హాసన్ రాజ్ కమల్ క్రియేషన్స్ సంస్థలో ఈ చిత్రం తెరకెక్కింది.

అక్షర హాసన్ కీలక పాత్రలో నటిస్తుంది. గర్భవతి అయిన అక్షరను చంపడానికి ఎవరో ప్రయత్నిస్తుంటారు.. ఆమె భర్తపై కూడా అటాక్ చేస్తారు. ఆ తర్వాత ఈ కేస్ చేధించడానికి ఏజెంట్ విక్రమ్ రంగంలోకి దిగుతాడు. ట్రైలర్లోనే కథ మొత్తం చెప్పేసాడు దర్శకుడు రాజేష్. చాలా రోజుల తర్వాత విక్రమ్ పక్కా పకడ్భందీ కథతో వస్తున్నాడేమో అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. కచ్చితంగా ఈ సినిమాతో ఫామ్‌లోకి వస్తానని ధీమాగా చెబుతున్నాడు విక్రమ్. దానికితోడు తెలుగులో కూడా ప్రమోషన్స్ బాగానే చేస్తున్నారు. విక్రమ్‌తో పాటు అక్షర హాసన్ కూడా ఈ ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది. జులై 19న విడుదల కానుంది ఈ చిత్రం. మరి ఆయన కోరిక మిస్టర్ కేకే సినిమా ఎంతవరకు తీరుస్తుందో చూడాలి.

లంగావోణిలో నడుమున వరినాట్లతో... పల్లెటూరి అమ్మాయిగా నిధి అగర్వాల్
బోల్డ్ కంటెంట్ సినిమాలో నయనతార.. హాట్ టాపిక్ గా మారిన న్యూస్..
బిగ్ బాస్‌లో నటి ఆత్మహత్యాయత్నం.. క్షణాల్లోనే కంటెస్టెంట్ ఎలిమినేషన్..
అమ్మాయి మరో అమ్మాయిని ముద్దు పెట్టుకుంటే తప్పేంటి.. అమలా పాల్ సంచలనం..
ప్రముఖ నటి రాధికకు షాక్.. అరెస్ట్‌కు కోర్టు నోటీసులు