సోనాక్షి దెబ్బకు కింద పడ్డ అక్షయ్ కుమార్.. వైరల్ అవుతున్న వీడియో..

మిషన్ మంగళ్ సినిమా రిలీజ్ కు కొన్ని రోజులే మిగిలి ఉండటంతో ఈ సినిమా యూనిట్ ‘మిషన్ మంగళ్’ ప్రమోషన్ కార్యక్రమాల జోరు పెంచింది.

news18-telugu
Updated: August 10, 2019, 4:10 PM IST
సోనాక్షి దెబ్బకు కింద పడ్డ అక్షయ్ కుమార్.. వైరల్ అవుతున్న వీడియో..
‘మిషన్ మంగళ్’లో అక్షయ్ కుమార్, నిత్యామీనన్, తదితరులు (ఫైల్ ఫోటో)
  • Share this:
ప్రస్తుతం అక్షయ్ కుమార్.. జగన్ శక్తి డైరెక్షన్‌లో చేసిన కొత్త సినిమా ‘మిషన్ మంగళ్’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్,టీజర్,ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను ఆగష్టు 15న విడుదల కానుంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ రాకేష్ ధావన్ అనే సైంటిస్ట్ పాత్రలో నటించాడు. ఈ మిషన్‌లో భాగస్వామ్యం ఉన్న ఇతర ముఖ్యపాత్రల్లో విద్యాబాలన్, సోనాక్షి సిన్హా,నిత్యా మీనన్,తాప్సీ పన్ను, కీర్తి కుల్హరి  నటించారు. ఈ సినిమా రిలీజ్ కు కొన్ని రోజులే మిగిలి ఉండటంతో ఈ సినిమా యూనిట్ ‘మిషన్ మంగళ్’ ప్రమోషన్ కార్యక్రమాల జోరు పెంచింది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా అక్షయ్ కుమార్.. తన తోటి నటీమణులతో కూర్చొని ఈ సినిమా విషయాలను మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో అక్షయ్.. తన కుర్చీలో కాస్తంత వెనక్కి వాలాడు. దీంతో పక్కనే ఉన్న సోనాక్షి సిన్మా అదే అదునుగా భావించి అక్షయ్‌ను ఏదో సరదకు తట్టింది. దీంతో అక్షయ్ కుమార్ కుర్చీతో పాటు వెనక్కి పడిపోయాడు. అక్కీ పడిపోతుండగా తాప్సీ పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.
అక్షయ్ ని చూసి అందరు ఒక్కసారి ఆశ్చర్యానికి గురయ్యారు. సోనాక్షి మాత్రం పెద్దగా నవ్వుతూ ఉంది. అంతేకాదు ఆ తర్వాత సోనాక్షి మాట్లాడుతూ.. ఎవరైనా నాకు చిరాకు తెప్పిస్తే.. ఇలాగే చేస్తాను అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. అక్షయ్ మాత్రం సోనాక్షి చేసిన పనిని లైట్ తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను సోనాక్షి ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. మొత్తానికి తమ సినిమా ప్రమోషన్‌లో భాగంగా అక్షయ్, సోనాక్షిలు చేసిన పని గట్టుకొని చేసిన ఈ పని ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


First published: August 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు