హైదరాబాద్ హలీమ్‌ను మిస్ అవుతున్న : పూజా హెగ్డే..

పూజా ప్రస్తుతం ప్రభాస్ సరసన ఓ సినిమా చేస్తోంది. దాంతో అఖిల్ హీరోగా వస్తోన్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ అనే సినిమాలోను నటిస్తోంది.

news18-telugu
Updated: May 22, 2020, 3:24 PM IST
హైదరాబాద్ హలీమ్‌ను మిస్ అవుతున్న : పూజా హెగ్డే..
పూజా హెగ్డే Photo : Instagram
  • Share this:
పూజా హెగ్డే..  నాగచైతన్య 'ఒక లైలా కోసం'తో పరిచయమైన వరుణ్ తేజ్ సరసన 'ముకుంద' సినిమాలో నటించి తెలుగు వారికి మరింతగా దగ్గరైంది. ఆ తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలుల అందిపుచ్చుకుంటూ  ప్రస్తుతం తెలుగులో చాలా బీజీగా ఉన్న హీరోయిన్‌లో ఒకరుగా ఉన్నారు. ఈ భామ టాప్ హీరోల అందరితోను ఆడిపాడింది.  అల్లు అర్జున్ సరసన 'డీజే' లోహాట్‌గా అదరగొట్టిన ఈ భామ.. ఎన్టీఆర్‌తో 'అరవింద సమేత'లో క్యూట్‌గా మైమరిపించింది.  తర్వాత  మహేష్‌ బాబుతో కలసి ‘మహర్షి’లో చేసి మంచి హిట్ అందుకుంది.  తాజాగా  బన్ని సరసన అలవైకంఠపురములో నటించి అదిరిపోయే హిట్ అందుకుంది. వరుస హిట్లతో ఊపు మీద ఉన్న ఈ ముద్దుగుమ్మ మరో అవకాశాన్ని అందుకుంది. తమిళ్‌లో అదిరిపోయే ఆఫర్‌ అందుకున్నట్లు తెలుస్తోంది. సూర్య, డైరెక్టర్ హరి కాంబినేషన్‌లో ఓ చిత్రం వస్తోంది. ఈ సినిమాలో సూర్య కి జంటగా పూజ హెగ్డే ని తీసుకొనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. అంతేకాదు దాదాపు పూజ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించడం ఖాయం అని తెలుస్తుంది.

ఇక పూజా ప్రస్తుతం ప్రభాస్ సరసన ఓ సినిమా చేస్తోంది. దాంతో అఖిల్ హీరోగా వస్తోన్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ అనే సినిమాలోను నటిస్తోంది. వీటికి తోడు హిందీలో సల్మాన్‌తో పాటు అక్షయ్ సినిమాలో కూడా పూజా నటించనుంది. అది అలా ఉంటే.. పూజా హెగ్డే ఈ లాక్ డౌన్ సమయంలో తనకు బాగా నచ్చిన ఓ ఫుడ్డుని మిస్ అవుతోందట. దాని గురించి చెబుతూ, 'ఈ రంజాన్ మాసంలో హైదరాబాదులో లభ్యమయ్యే హలీం వంటకాన్ని బాగా మిస్ అవుతున్నాను' అంటూ ఈ చిన్నది ట్వీట్ చేసింది.  ఇక ఈ భామ తెలుగులో మరో అవకాశాన్ని అందిపుచ్చుకుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తోన్న ఓ చిత్రంలో పూజా హెగ్డేను హీరోయిన్‌గా ఫైనల్ చేశారట.


First published: May 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading