హోమ్ /వార్తలు /movies /

Miss Universe 2020: మిస్ యూనివర్స్ 2020 కిరీటాన్ని దక్కించుకున్న మెక్సికో భామ ఆండ్రియా మెజా!

Miss Universe 2020: మిస్ యూనివర్స్ 2020 కిరీటాన్ని దక్కించుకున్న మెక్సికో భామ ఆండ్రియా మెజా!

Miss Universe 2020: మిస్‌ యూనివర్స్‌ 2020 కిరీటాన్ని మెక్సికో భామ ఆండ్రియా మెజా దక్కించుకుంది. ఈ పోటీలో 3 వ రన్నరప్‌గా భారత్‌ తరఫున ప్రాతినిథ్యం వహించిన ఆడ్లైన్‌ క్యాస్టిలినో నిలిచారు.

    Miss Universe 2020: మిస్‌ యూనివర్స్‌ 2020 కిరీటాన్ని మెక్సికో భామ ఆండ్రియా మెజా దక్కించుకుంది. ఈ పోటీలో 3 వ రన్నరప్‌గా భారత్‌ తరఫున ప్రాతినిథ్యం వహించిన ఆడ్లైన్‌ క్యాస్టిలినో నిలిచారు. గతేడాదే ఈ పోటీలు జరగాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా నిర్వాహకులు విజేతను ప్రకటించారు.

    69 వ మిస్ యూనివర్స్ పోటీలు అమెరికా, ఫ్లోరిడాలోని సెమినల్ హార్డ్ రాక్ హోటల్ లో జరిగింది. ఈ పోటీలలో మెక్సికోకు చెందిన ఆండ్రియా మెజా మిస్ యూనివర్స్ 2020 కిరీటాన్ని పొందింది. మిస్ బ్రెజిల్, జూలియా గామా రన్నరప్‌గా, మిస్ పెరూ, జానిక్ మాసెటా డెల్ కాస్టిల్లో మూడవ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ మిస్ యూనివర్స్ పోటీలలో వివిధ దేశాలకు సంబంధించిన 73 మంది మహిళలు పాల్గొనగా వీరిలో ఆండ్రియా మెజా కిరీటాన్ని తగ్గించుకున్నారు.

    గత ఏడాదే ఈ పోటీలు జరగాల్సి ఉండగా కరోనా తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ఏడాది విరామం తర్వాత జరిగాయి. ఈ క్రమంలోనే వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన మెజాకి మిస్ యూనివర్స్ కిరీటాన్ని 2019 మిస్ యూనివర్స్ గా ఉన్న జోజిబిని తుంజీ చేత బహుకరింప చేశారు. అదేవిధంగా మోడల్ అందాల పోటీ టైటిల్ హోల్డర్ అయిన అడ్లైన్ కాస్టెలినో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు మరియు నాల్గవ స్థానంలో నిలిచారు. ఈమె మిస్ దివా 2020 యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకున్న వారు. ప్రస్తుతం మిస్ యూనివర్స్ 2020 విజేతగా ఆండ్రియా మెజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

    First published:

    ఉత్తమ కథలు