మలేసియాలో సందడి చేసిన మిస్ ఇండియా తెలంగాణ సంజన విజ్

Sanjana Vij : ప్రస్తుతం బాలీవుడ్ వైపు చూస్తున్న సంజనా విజ్... అప్పుడప్పుడూ ఫొటోషూట్‌లతో అలరిస్తోంది.

news18-telugu
Updated: December 17, 2019, 8:42 AM IST
మలేసియాలో సందడి చేసిన మిస్ ఇండియా తెలంగాణ సంజన విజ్
సంజన విజ్ (Credit : Insta/sanjanavij)
  • Share this:
Miss India Second Runner Up 2019 Sanjana Vij : 2019 మిస్ ఇండియా సెకండ్ రన్నరప్‌గా నిలిచిన తెలంగాణ అమ్మాయి సంజనా విజ్‌ క్యూట్ అందాలతో కట్టిపడేస్తోంది. వివిధ సందర్భాల్లో... ఫ్యాషన్ హొయలు ఒలకబోస్తూ... నీలి కళ్లతో ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె... మలేసియాలో ఓ ఫొటోషూట్ చేసింది. చుట్టూ పచ్చటి ప్రకృతి, మంచు కురుస్తున్న వేళ చేసిన ఆ ఫొటోషూట్ అందరికీ తెగ నచ్చేస్తోంది. ఈ ఫొటోషూట్ కోసం ఎంతో టాలెంట్ ఉన్న టీమ్ పనిచేసిందన్న ఆమె... మలేసియాలోని అందమైన లొకేషన్లు, వాతావరణాన్ని బాగా ఎంజాయ్ చేశానని తెలిపింది. మలేసియాలోని కౌలాలంపూర్‌లో ఫుడ్ కూడా రుచికరంగా ఉందని వివరించింది. ఇలాంటి మరచిపోలేని అనుభవాన్ని తనకు కలిగించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ అంటూ పోస్ట్ పెట్టింది సంజన విజ్. 

View this post on Instagram
 

So here are some BTS from a recent shoot I did in Malaysia.. It was a beautiful experience. I got to meet and work with extremely talented people, visit the most beautiful locations, enjoy the lovely weather and delicious food of Kuala Lumpur! Thanks to everyone who was a part of making this experience memorable❤️ @timestalent #MissIndiaRunnerUp2019 #MissIndia2019 #MissIndiaTelangana2019 #SanjanaVij #bts #shoot #shootlife #malaysia


A post shared by Sanjana Vij (@sanjanavij) on

డాన్సింగ్, యాక్టింగ్ అంటే ఇష్టపడే సంజన... బాలీవుడ్‌లో ఆఫర్ల కోసం ప్రయత్నిస్తోంది. 2019కి ఆమె మిస్ ఇండియా తెలంగాణ కాబట్టి... ప్రస్తుతం ఆమెకు మంచి క్రేజ్ ఉంటుంది. వచ్చే ఏడాది ఆమె స్థానంలో మరొకరు నిలుస్తారు కాబట్టి... 2020 నుంచీ ఆమె కెరీర్ సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు. ప్రస్తుతం ఆమెకు భారీ సినిమా ఆఫర్లేవీ లేవు. ఐశ్వర్యరాయ్‌లా నీలి కళ్లు ఉండటం ఆమెకు ప్లస్ పాయింట్. అందువల్ల ఫ్యాషన్ షోలు, స్పెషల్ ఈవెంట్ ప్రోగ్రామ్స్‌తో క్రేజ్ తెచ్చుకునే అవకాశాలున్నాయి.
First published: December 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు