Posani Krishnamurali: పోసాని కృష్ణమురళి ఇంటిపై దాడి.. అర్థరాత్రి అసలు ఏం జరిగింది?

పోసాని కృష్ణమురళి (posani krishna murali)

Posani krishnamurali: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తన ఫ్యామిలీని బెదిరిస్తున్నారని.. ఫోన్ కాల్స్‌తో వేధిస్తున్నారని పోసాని విరుచుకుపడ్డారు. తనకు గానీ, తన కుటుంబ సభ్యులకు గానీ ఏమైనా జరిగితే.. దానికి పవన్ కల్యాణే బాధ్యత వహించాలని రెండు రోజుల క్రితం పోసాని అన్నారు.

 • Share this:
  పోసాని వర్సెస్ పవన్ ఎపిసోడ్ మరో మలుపు తిరిగింది. పోసాని, పవన్ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న క్రమంలోనే హైదరాబాద్‌(Hyderbad)లో కలకలం రేగింది. టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళి (Posani Krishnamurali) ఇంటిపై దుండగులు దాడి చేశారు. అమీర్‌పేటలోని ఎల్లారెడ్డి గూడలో ఉన్న పోసాని ఇంటిపై ఇటుకలు, రాళ్లతో దాడి చేశారు. గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు పోసాని దంపతులను బండ బూతులు తిడుతూ.. రాళ్లు, ఇటుకలు విసిరారని వాచ్‌మెన్ చెప్పారు. వారిని చూసి భయంతో తాము బయటకు రాలేదని తెలిపారు. ఉదయం ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరీశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోసాని కృష్ణ మురళి ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

  Nani : ఆ స్టార్ హీరో కోసం విలన్‌గా మారుతున్న నాని.. నాచురల్ స్టార్ కొత్త ఇన్నింగ్స్..

  రెండు రోజులుగా కొందరు వ్యక్తులు పోసాని ఇంటి చుట్టూ తిరుగుతున్నారని వాచ్‌మెన్ పోలీసులకు చెప్పారు. మొన్న రాత్రి పోసాని దంపతులను తిట్టుకుంటూ వెళ్లారని.. నిన్న రాత్రి ఇటుకలు, రాళ్లతో దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిని చూసి తాము తీవ్ర భయాందోళనకు గురయినట్లు తెలిపారు. ఐతే పోసాని కృష్ణమురళి ప్రస్తుతం ఎల్లారెడ్డిగూడలోని ఇంట్లో ఉండడం లేదు. 8 నెలలుగా రాయదుర్గంలోని ఇంట్లో ఆయన ఫ్యామిలీ నివసిస్తోంది. ఐతే వారు ఎల్లారెడ్డిగూడలోనే ఉంటున్నారని భావించి.. దండుగులు రాళ్ల దాడి చేశారా? లేదంటే పోసాని కృష్ణమురళి ఫ్యామిలీని భయపెట్టేందుకే ఇలా చేశారా? అని తెలియాల్సి ఉంది.

  NBK: బాలకృష్ణ సంచలన నిర్ణయం.. ఆ రెండు సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయా.. ?

  రిపబ్లిక్ ప్రిరిలీజ్ ఈవెంట్‌లో వైసీపీపై పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేయడంతో.. వైఎస్ జగన్‌కు మద్దతుగా పోసాని కృష్ణమురళి రంగంలోకి దిగారు. పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసి వ్యక్తిగత దూషణకు దిగారు. పోసాని పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై కామెంట్స్ చేస్తూ పర్సనల్‌గా ఎదరుదాడి చేశారు పోసాని. పవన్ కల్యాణ్ ఓ పంజాబీ అమ్మాయిని మోసం చేశాడని సంచలన ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్‌కు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియదని.. ఏపీ సీఎం జగన్‌కు పవన్ కళ్యాణ్‌కు పోలికే లేదన్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కుల పిచ్చి ఎక్కువని పవన్ కళ్యాణ్ ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. అ అంతేకాదు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తన ఫ్యామిలీని బెదిరిస్తున్నారని.. ఫోన్ కాల్స్‌తో వేధిస్తున్నారని పోసాని విరుచుకుపడ్డారు. తనకు గానీ, తన కుటుంబ సభ్యులకు గానీ ఏమైనా జరిగితే.. దానికి పవన్ కల్యాణే బాధ్యత వహించాలని రెండు రోజుల క్రితం పోసాని అన్నారు. అంతలోనే ఆయన ఇంటిపై దుండగులు దాడి చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
  Published by:Shiva Kumar Addula
  First published: