జబర్దస్త్ నటిపై వేధింపులు.. అర్ధరాత్రి నడిరోడ్డుపై బైక్ ఆపేసి..

Jabardasth Comedy Show: అర్ధరాత్రి అమ్మాయిలు ఒంటరిగా వెళ్లాలంటే చాలా కష్టమే. కాలం ఎంత మారినా కూడా కోరుకున్న స్వతంత్య్రం మాత్రం రాలేదంటూ చాలా మంది అమ్మాయిలు ఇప్పటికీ చెప్తూనే ఉంటారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 25, 2020, 2:36 PM IST
జబర్దస్త్ నటిపై వేధింపులు.. అర్ధరాత్రి నడిరోడ్డుపై బైక్ ఆపేసి..
ప్రతీకాత్మక చిత్రం (Image:ETV)
  • Share this:
అర్ధరాత్రి అమ్మాయిలు ఒంటరిగా వెళ్లాలంటే చాలా కష్టమే. కాలం ఎంత మారినా కూడా కోరుకున్న స్వతంత్య్రం మాత్రం రాలేదంటూ చాలా మంది అమ్మాయిలు ఇప్పటికీ చెప్తూనే ఉంటారు. ఇప్పుడు తన విషయంలో కూడా ఇదే జరిగిందని చెబుతుంది ఓ జబర్దస్త్ నటి. ఈ కామెడీ షో కొందరి జీవితాలనే మార్చేసింది. అందులో ఎంతోమంది ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నారు. అలాంటి ఓ కమెడియన్ సాయితేజ. జబర్దస్త్ అనే స్టేజ్‌పై నుంచి వచ్చిన వాళ్లలో ఈయన కూడా ఒకడు. కానీ ఇప్పుడు అతడు కాస్తా ఆమె అయ్యాడు. స్క్రీన్ పై వాళ్లు చేసే కామెడీకి నవ్వుకుంటున్నా కూడా వాళ్ల నిజ జీవితంలో మాత్రం చాలా బాధలు పడుతున్నారు.

Jabardasth comedian Sai Teja humble request to media and fans not to write wrong news on her marriage pk జబర్దస్త్ కామెడీ షో కొందరి జీవితాలనే మార్చేసింది. అందులో ఎంతోమంది ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నారు. అలాంటి ఓ కమెడియన్ సాయితేజ. జబర్దస్త్ అనే స్టేజ్ పై నుంచి వచ్చిన వాళ్లలో ఈయన కూడా ఒకడు. jabardasth,jabardasth comedy show,jabardasth pinky marraige,jabardasth sai teja marriage,Extra jabardasth,jabardasth comedy skits,jabardasth sai teja,jabardasth sai teja hot,jabardasth priyanka singh,jabardasth priyanka singh casting couch,jabardasth vinod,jabardasth sai teja lady getup,jabardasth sai teja interview,jabardasth sai teja surgery,jabardasth sai teja vinod,jabardasth skits,jabardasth naga babu,jabardasth roja,anasuya bharadwaj hot,rashmi gautam hot,telugu cinema,జబర్దస్త్,జబర్దస్త్ ప్రియాంక సింగ్,జబర్దస్త్ ప్రియాంక సింగ్ క్యాస్టింగ్ కౌచ్,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ వినోద్,జబర్దస్త్ సాయితేజ,జబర్దస్త్ కామెడీ స్కిట్స్,తెలుగు సినిమా
జబర్దస్త్ సాయి తేజ ఫైల్ ఫోటో (Source: Twitter)

అవి నాకు తెలుసు అంటుంది ఈమె. సాయి తేజ కాస్తా ప్రియాంకగా మారిందిప్పుడు. ఈ మధ్యే ఆమెకు పెళ్లైందనే రూమర్స్ కూడా వచ్చాయి. కానీ తననెవరూ చేసుకోరని.. కానీ పోకిరిలు మాత్రం తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్పింది ఈమె. తన పెళ్లిపై వస్తున్న వార్తలకు మరోసారి ఫుల్ స్టాప్ పెట్టింది ప్రియాంక.  ఇదిలా ఉంటే మూడు రోజుల కింద తనతో కొందరు కుర్రాళ్లు అసభ్యంగా ప్రవర్తించారని.. నడి రోడ్డుపై బైక్ ఆపేసి చాలా చెత్తగా బిహేవ్ చేసారని చెబుతుంది ప్రియాంక. అర్ధరాత్రి తన స్కూటీపై వస్తుంటే వాళ్లు తనను చూసి కామెంట్ చేసారని.. అలాంటి వాళ్లను చంపేసినా పాపం లేదని చెబుతుంది ఈమె.

Jabardasth comedian Sai Teja humble request to media and fans not to write wrong news on her marriage pk జబర్దస్త్ కామెడీ షో కొందరి జీవితాలనే మార్చేసింది. అందులో ఎంతోమంది ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నారు. అలాంటి ఓ కమెడియన్ సాయితేజ. జబర్దస్త్ అనే స్టేజ్ పై నుంచి వచ్చిన వాళ్లలో ఈయన కూడా ఒకడు. jabardasth,jabardasth comedy show,jabardasth pinky marraige,jabardasth sai teja marriage,Extra jabardasth,jabardasth comedy skits,jabardasth sai teja,jabardasth sai teja hot,jabardasth priyanka singh,jabardasth priyanka singh casting couch,jabardasth vinod,jabardasth sai teja lady getup,jabardasth sai teja interview,jabardasth sai teja surgery,jabardasth sai teja vinod,jabardasth skits,jabardasth naga babu,jabardasth roja,anasuya bharadwaj hot,rashmi gautam hot,telugu cinema,జబర్దస్త్,జబర్దస్త్ ప్రియాంక సింగ్,జబర్దస్త్ ప్రియాంక సింగ్ క్యాస్టింగ్ కౌచ్,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ వినోద్,జబర్దస్త్ సాయితేజ,జబర్దస్త్ కామెడీ స్కిట్స్,తెలుగు సినిమా
జబర్దస్త్ సాయి తేజ ఫైల్ ఫోటో (Source: Twitter)

ఆర్టిస్టుగా ఒక్కో రూపాయి సంపాదించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుందని.. కానీ బయటి నుంచి చూసి కొందరు పనీపాట లేని వెధవలు మాత్రం తమపై కామెంట్స్ చేస్తుంటారని చెబుతుంది ప్రియాంక. అసలు తాను స్కిన్ షో కూడా చేయలేదని.. చుడిదార్ వేసుకుని.. పూర్తిగా మొహం కప్పుకుని కేవలం కళ్లు మాత్రమే కనిపిస్తున్నా కూడా తనను వాళ్లు కామంతో చూసారని చెబుతుంది ప్రియాంక. అసలు అలాంటి వాళ్లనేం చేయాలని.. అలా చేస్తుంటే భయం వేసిందని.. అర్ధరాత్రి ఓ అమ్మాయితో అలా బిహేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటుంది ఈ జబర్దస్త్ నటి. ఇలాంటి నీచులు ఉన్నంత వరకు కూడా అమ్మాయిలతో దారుణాలు జరుగతాయని చెప్తుంది ఈమె.

జబర్దస్త్ సాయి తేజ ఫైల్ ఫోటో (jabardasth sai teja/Twitter)

ఆ మధ్య కూడా తనను ఓ దర్శకుడు రూమ్‌కు పిలిచాడని.. అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది ప్రియాంక. ఓ దర్శకుడు ఫోన్ చేసి నువ్వు నా సినిమాలో ఐటం సాంగ్ చేస్తావా అని అడిగాడని.. వెంటనే తాను కూడా చేస్తానని చెప్పినట్లు గుర్తు చేసుకుంది ప్రియాంక. అయితే ఆ పాటలో ఎక్స్‌పోజింగ్ చేయాల్సి వస్తుందని చెప్పాడని దానికి కూడా ఓకే అన్నట్లు చెప్పింది ప్రియాంక. వరంగల్‌లో షూట్ చేయాల్సి వస్తుందని.. అక్కడే మూడ్రోజులు ఉండాలని చెప్పాడని చెప్పింది ఈమె. అన్నీ సర్దుకుని తాను కూడా వరంగల్ షూట్ కోసం బయల్దేరుతున్న సమయంలో అదే దర్శకుడు కాల్ చేసి తనతో అసభ్యంగా మాట్లాడాడని చెబుతుంది ప్రియాంక. తనతో మూడు రోజులు ఒకే రూమ్‌లో ఉండాలని.. ఆయనతో పాటు మరొకరు కూడా ఉంటారని చాలా నీచంగా మాట్లాడాడని చెప్పింది.

Jabardasth comedian Sai Teja humble request to media and fans not to write wrong news on her marriage pk జబర్దస్త్ కామెడీ షో కొందరి జీవితాలనే మార్చేసింది. అందులో ఎంతోమంది ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నారు. అలాంటి ఓ కమెడియన్ సాయితేజ. జబర్దస్త్ అనే స్టేజ్ పై నుంచి వచ్చిన వాళ్లలో ఈయన కూడా ఒకడు. jabardasth,jabardasth comedy show,jabardasth pinky marraige,jabardasth sai teja marriage,Extra jabardasth,jabardasth comedy skits,jabardasth sai teja,jabardasth sai teja hot,jabardasth priyanka singh,jabardasth priyanka singh casting couch,jabardasth vinod,jabardasth sai teja lady getup,jabardasth sai teja interview,jabardasth sai teja surgery,jabardasth sai teja vinod,jabardasth skits,jabardasth naga babu,jabardasth roja,anasuya bharadwaj hot,rashmi gautam hot,telugu cinema,జబర్దస్త్,జబర్దస్త్ ప్రియాంక సింగ్,జబర్దస్త్ ప్రియాంక సింగ్ క్యాస్టింగ్ కౌచ్,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ వినోద్,జబర్దస్త్ సాయితేజ,జబర్దస్త్ కామెడీ స్కిట్స్,తెలుగు సినిమా
జబర్దస్త్ సాయి తేజ ఫైల్ ఫోటో (Source: Twitter)

దాంతో ఆ సినిమా వదిలేసుకుంది ఈమె. అక్కడితో ఈమెపై వేధింపులు ఆగలేదు.. పెళ్లిపై కమెంట్స్.. ఆ తర్వాత ఆమె మారిన తీరుపై కమెంట్స్.. టిక్ టాక్ వీడియోలు చేస్తే కమెంట్స్.. ఇలా అన్నింట్లోనూ కొందరు తనను కావాలనే టార్గెట్ చేస్తున్నారని.. వేధిస్తున్నారని చెబుతుంది ప్రియాంక. దాంతో పాటు పెళ్లి విషయంపై కూడా కావాలనే రచ్చ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది ప్రియాంక. తనను అర్థం చేసుకుని పెళ్లి చేసుకునేవాడు దొరికితే కచ్చితంగా ఏడడుగులు నడుస్తానని.. కానీ అలాంటి వాళ్లు ఎక్కడున్నారని ప్రశ్నిస్తుంది ఈమె. ఇప్పుడు కూడా నడిరోడ్డుపై తనను అలా వేధించారని కన్నీరు పెట్టుకుంది ఈమె.
Published by: Praveen Kumar Vadla
First published: May 25, 2020, 2:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading