Mirzapur Season 2: మిర్జాపూర్ 2 డబ్బింగ్ వర్షన్ ఎక్కడ.. పచ్చి బూతుల కోసం వెయిటింగ్ ఇక్కడ..

మిర్జాపూర్ సీజన్ 2 (mirzapur season 2)

Mirzapur Season 2: లాక్‌డౌన్ సమయంలో అంతా ఇంటికే పరిమితం అయిపోయారు. కొందరు ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఖాళీ టైమ్ కూడా చాలానే ఉండిపోయింది. పైగా ఎంటర్‌టైన్మెంట్ కోసం థియేటర్స్ కూడా..

  • Share this:
ఇప్పుడు నెటిజన్స్ అడుగుతున్న ప్రశ్న ఇదే. నిజంగానే మిర్జాపూర్ 2 తెలుగు వర్షన్ కోసం కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు ప్రేక్షకులు. లాక్‌డౌన్ సమయంలో అంతా ఇంటికే పరిమితం అయిపోయారు. కొందరు ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఖాళీ టైమ్ కూడా చాలానే ఉండిపోయింది. పైగా ఎంటర్‌టైన్మెంట్ కోసం థియేటర్స్ కూడా లేవాయే..? దాంతో అందరికీ ఓటిటి ఆప్షన్ అయిపోయింది. అందులోనూ వెబ్ సిరీస్‌లు బాగా చూస్తున్నారు మన ఆడియన్స్. హిందీ వెబ్ సిరీస్ తెలుగు డబ్బింగ్ వర్షన్స్ కూడా విడుదలై సంచలనం సృష్టిస్తున్నాయి. అలా అరాచకం చేసిన వెబ్ సిరీస్ మిర్జాపూర్. 2018లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ తెలుగులో ఎలాంటి సంచలనాలు రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేరుగా తెలుగులో విడుదలైన వెబ్ సిరీస్‌లు కూడా ఈ స్థాయిలో ఆకట్టుకోలేదు. కానీ క్రైమ్, యాక్షన్, రొమాన్స్ మితిమీరి ఉన్న మిర్జాపూర్ వెబ్ సిరీస్‌కు తెలుగు ప్రేక్షకులు అలవాటు పడిపోయారు అనేదానికంటే కూడా ఎడిక్ట్ అయిపోయారు అంటే సరిపోతుంది.
mirzapur season 2,mirzapur season 2 in telugu,mirzapur season 2 telugu dubbed,mirzapur season 2 telugu explain,mirzapur season 2 all episodes in telugu,mirzapur season 2 explained in telugu,mirzapur 2 in telugu,mirzapur 2,mirzapur 2 telugu,mirzapur season 2 all episodes,mirzapur 2 explained in telugu,mirzapur season 2 explained,mirzapur,mirzapur season 2 telugu,mirzapur telugu,#mirzapur season 2 telugu,mirzapur season 2 review in telugu,mirzapur season 2 trailer breakdown telugu,మిర్జాపూర్ 2,మిర్జాపూర్ సీజన్ 2 తెలుగులో,మిర్జాపూర్ 2 అమెజాన్ ప్రైమ్ వీడియో
మిర్జాపూర్ సీజన్ 2 (mirzapur season 2)

అందులో ఉన్న మున్నా, గుడ్డు పండిట్, అఖండ త్రిపాఠి.. ఇలా కారెక్టర్ నేమ్స్ కూడా గుర్తు పెట్టుకున్నారు. తెలుగులో పచ్చి బూతులు అలాగే ఉంచేసారు. ఎలాంటి సెన్సార్ లేకుండా బూతు మాటలు వాడేసారు. యూ ట్యూబ్‌లో కూడా మీర్జాపూర్ బూతులకు మంచి డిమాండ్ ఉంది. 2018లో వచ్చిన సీజన్ 1 సంచలనం సృష్టించడంతో అక్టోబర్ 23న సీజన్ 2 విడుదల చేసారు దర్శక నిర్మాతలు. దీన్ని గుర్మీత్ సింగ్, కరణ్ అన్షుమన్ సంయుక్తంగా తెరకెక్కించారు. రెండో సీజన్ కూడా సంచలనాలు రేపుతుంది. కానీ సీజన్ 2 తెలుగు వర్షన్ మాత్రం ఇంకా విడుదల కాలేదు.
mirzapur season 2,mirzapur season 2 in telugu,mirzapur season 2 telugu dubbed,mirzapur season 2 telugu explain,mirzapur season 2 all episodes in telugu,mirzapur season 2 explained in telugu,mirzapur 2 in telugu,mirzapur 2,mirzapur 2 telugu,mirzapur season 2 all episodes,mirzapur 2 explained in telugu,mirzapur season 2 explained,mirzapur,mirzapur season 2 telugu,mirzapur telugu,#mirzapur season 2 telugu,mirzapur season 2 review in telugu,mirzapur season 2 trailer breakdown telugu,మిర్జాపూర్ 2,మిర్జాపూర్ సీజన్ 2 తెలుగులో,మిర్జాపూర్ 2 అమెజాన్ ప్రైమ్ వీడియో
మిర్జాపూర్ సీజన్ 2 (mirzapur season 2)

అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిందీ, ఇంగ్లీష్ వర్షన్ దుమ్ము దులిపేస్తుంది. కానీ ఆడియన్స్ మాత్రం తెలుగు వర్షన్ ఎక్కడా అంటూ అడుగుతున్నారు. మీర్జాపూర్ సీజన్ 2 తెలుగులో అనువదించకపోతే అవసరం లేదంటూ రచ్చ చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరుగుతుంది. మా మీర్జాపూర్ 2ను త్వరగా తెలుగులో దించేయండ్రా అంటూ అమెజాన్‌ను ఆడుకుంటున్నారు నెటిజన్లు. ఏదేమైనా కూడా పచ్చి బూతుల కోసం మొహం వాచిపోయేలా వేచి చూస్తున్నారు మన ప్రేక్షకులు. మరి వీళ్ళ అభ్యర్థనను ఎప్పటికి పట్టించుకుంటారో దర్శక నిర్మాతలు.
Published by:Praveen Kumar Vadla
First published: