హోమ్ /వార్తలు /సినిమా /

Megastar Chiranjeevi |Talasani: మెగాస్టార్​ చిరంజీవి మరో బృహత్తర నిర్ణయం..? మేడే సందర్భంగా వెల్లడించిన మంత్రి తలసాని 

Megastar Chiranjeevi |Talasani: మెగాస్టార్​ చిరంజీవి మరో బృహత్తర నిర్ణయం..? మేడే సందర్భంగా వెల్లడించిన మంత్రి తలసాని 

తలసానితో చిరు (ఫైల్​ ఫొటో)

తలసానితో చిరు (ఫైల్​ ఫొటో)

తెలుగు చిత్రపరిశ్రమకు చిరంజీవి పెద్ద దిక్కుగా ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సినీ పరిశ్రమ పచ్చగా ఉండాలన్నదే చిరంజీవి ఆకాంక్ష అని చెప్పారు. అంతేకాకుండా చిరంజీవి ఓ బృహత్తర నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

  తెలుగు చిత్రపరిశ్రమ (Telugu film industry)కు చిరంజీవి (Chiranjeevi) పెద్ద దిక్కుగా ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. సినీ పరిశ్రమ పచ్చగా ఉండాలన్నదే చిరంజీవి ఆకాంక్ష అని చెప్పారు. సినీ పరిశ్రమ కోసం చిరంజీవి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారని ప్రశంసించారు. . కార్మికులే (Works) దేశానికి వెన్నెముక అని ఆయన  అన్నారు. కార్మికులు లేకపోతే ప్రపంచమే లేదని చెప్పారు. హైదరాబాద్‌ (Hyderabad) రవీంద్రభారతిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన మే డే (May day) వేడుకల్లో మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌ గౌడ్‌, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. కార్మిక శాఖ మంత్రిగా మల్లారెడ్డే (Mallareddy) సరైనవారని సీఎం కేసీఆర్‌ నియమించారని తెలిపారు.

  సినీ కార్మికుల కోసం..

  గత రెండెండ్లుగా కరోనా (Corona) వల్ల శ్రమశక్తి అవార్డు ప్రదానోత్సవం చేయలేకపోయామన్నారు మంత్రి శ్రీనివాస్​. కార్మికులను ఆర్థికంగా, సామాజికంగా పైకి తేవాలన్నదే సీఎం కేసీఆర్‌ (CM KCR) లక్ష్యం అని తలసాని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం (State Government) కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని ఆయన వెల్లడించారు. సినీ కార్మికులది రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి అని మంత్రి అన్నారు. కరోనా సమయంలో సినీ కార్మికులు చాలా ఇబ్బంది పడ్డారని తలసాని గుర్తుచేశారు. చలన చిత్ర పరిశ్రమకు అన్ని విధాలా సహకారమందిస్తున్నామని మంత్రి చెప్పారు.  తెలుగు చిత్రపరిశ్రమకు చిరంజీవి పెద్ద దిక్కుగా ఉన్నారని అన్నారు. సినీ పరిశ్రమ కోసం చిరంజీవి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారని ప్రశంసించారు. సినీ కార్మికుల కోసం చిరంజీవి ఆస్పత్రి (Hospital) కట్టించాలని ఆలోచనలో ఉన్నట్టు తనకు తెలిసిందని చెప్పారు.

  సినీ కార్మికులకు సంక్షేమ పథకాలు..

  చిత్రపురి (Chitrapuri)లో పాఠశాలలు, ఆస్పత్రి (Hospital)కి కావాల్సిన స్థలం ఉందని మంత్రి తలసాని వెల్లడించారు. చిత్రపూరి కాలనీలో చిరంజీవి ఆస్పత్రి (Chiranjeevi Hospital) నిర్మిస్తే వేలాది కార్మికులకు (To workers) ఉపయోగం ఉంటుందని మంత్రి తలసాని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కులం (caste), మతం లేదని చెప్పారు. సినీ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని తెలిపారు. ఇళ్లు లేని సినీ కార్మికులకు చిత్రపురిలో ఇళ్లు ఇస్తామని ప్రకటించారు. అయితే ఆస్పత్రి ప్రకటనపై చిరంజీవి ఇంకా స్పందించలేదు.

  హైదరాబాద్‌ అందరినీ ఆదరిస్తుందని..

  మరోవైపు మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ మాట్లాడుతూ..  కరోనాతో కార్మికులకు పనిలేకుండా పోయిందని అన్నారు. చాలా పరిశ్రమలు కరోనా, కరెంట్‌ కోతలతో కార్మికులను తీసేశాయని చెప్పారు. కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని వెల్లడించారు. వివిధ రాష్ట్రాలకు చెందినవారు పనికోసం హైదరాబాద్‌ వస్తారని, హైదరాబాద్‌ అందరినీ ఆదరిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Chiranjeevi, Hospitals, Megastar Chiranjeevi, Minister talasani srinivas

  ఉత్తమ కథలు