నమ్మొద్దు.. అలాంటిదేమి లేదు : మహేష్ 'మహర్షి' సినిమాపై మంత్రి తలసాని

సింగిల్ స్క్రీన్ థియేటర్‌ టికెట్‌ను రూ.80 నుంచి రూ.110, మల్టీప్లెక్స్ టికెట్‌ను రూ.138 నుంచి రూ.200వరకు పెంచినట్టు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దన్నారు.

news18-telugu
Updated: May 7, 2019, 10:30 PM IST
నమ్మొద్దు.. అలాంటిదేమి లేదు : మహేష్ 'మహర్షి' సినిమాపై మంత్రి తలసాని
తలసాని శ్రీనివాస్ యాదవ్
news18-telugu
Updated: May 7, 2019, 10:30 PM IST
మహర్షి సినిమా టికెట్ల ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్లను ఎప్పుడూ పెంచలేదని.. ఈ సినిమా విషయంలోనూ అదే వర్తిస్తుందని చెప్పారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సింగిల్ స్క్రీన్ థియేటర్‌ టికెట్‌ను రూ.80 నుంచి రూ.110, మల్టీప్లెక్స్ టికెట్‌ను రూ.138 నుంచి రూ.200వరకు పెంచినట్టు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దన్నారు.

కాగా, సూపర్ స్టార్ మహేష్ బాబు-వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కిన మహర్షి సినిమా ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్‌గా నటించింది. అల్లరి నరేష్‌ కీలక పాత్ర పోషించాడు. జగపతి బాబు, ప్రకాష్ రాజ్‌, జయసుధ, రాజేంద్రప్రసాద్‌, ముఖేష్‌ రుషి ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. మహేష్ బాబు కెరీర్‌లో 25వ చిత్రం కావడంతో మహర్షిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

First published: May 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...