హోమ్ /వార్తలు /సినిమా /

Minister Roja : బ్యూటీ పార్లర్‌లో మినిష్టర్ రోజా సందడి.. వైరల్ అవుతున్న వీడియో..

Minister Roja : బ్యూటీ పార్లర్‌లో మినిష్టర్ రోజా సందడి.. వైరల్ అవుతున్న వీడియో..

తిరుపతిలో సందడి చేసిన రోజా (Twitter/Photo)

తిరుపతిలో సందడి చేసిన రోజా (Twitter/Photo)

Minister Roja | ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా తిరుపతిలో సందడి చేశారు. ఈ సందర్భంగా అక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన ఓ బ్యూటీ పార్లర్‌ను ప్రారంభించి అక్కడ కలియతిరిగారు.

  Minister Roja : రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో నటి రోజాకు మంత్రి పదవి దక్కింది. ఎలాగైనా  మంత్రి కావాలనే తన చిరకాల కోరిక రోజాకు ఎట్టకేలకు నెరవేరింది. ఇక ఏపీ ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి రోజాకు పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో మంత్రిగా తన శాఖ పరిధిలో జరిగే పనులను పర్యవేక్షించడంతో పాటు తన నియోజకవర్గంలో జరిగే పలు కార్యక్రమాలతో పాటు షాప్ ఓపెనింగ్స్‌లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో లండన్ బ్యూటోరియంకు చెందిన బ్యూటీ పార్లర్‌ బ్రాంచ్‌ను రోజా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రోజా పార్లర్‌లో తిరుగుతూ.. లేడీస్‌కు సంబంధించిన వివిధ సేవలకు సంబంధించిన విషయాలను అడిగి మరి  తెలుసుకున్నారు. చెన్నెైకు చెందిన లండన్ బ్యూటోరియం బ్రాంచ్‌ను తిరుపతి పట్టణంలో ప్రారంభించడంపై రోజా ఆనందం వ్యక్తం చేశారు.

  ఇకపై తిరుపతిలోని మహిళలు అత్యుత్తమమైన ఈ బ్యూటీ పార్లర్ సేవలు పొందవచ్చన్నారు. ఈ సందర్భంగా మెట్రో నగరాల్లోని మహిళలకు మాత్రమే పరిమితమైన ఇలాంటి బ్యూటీ పార్లర్‌లు తిరుపతి నగరంలోని మహిళలకు అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా బ్యూటీ క్లినిక్ హెడ్ జీవిత సత్యనారాయణన్, బ్రాంచ్ ఓనర్ ప్రియాంకను రోజా అభినందనలతో ముంచెత్తారు.

  రోజా పొలిటికల్ కెరీర్ విషయానికొస్తే.. ముఖ్యంగా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సినిమాలకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. ఎంతో సినీ నటులు రాజకీయాల్లో ప్రవేశించి తమ లక్‌ను పరీక్షించుకున్నారు. అదే కోవలో రోజా కూడా తెలుగు దేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసారు. అంతేకాదు చాలా మంది నటీనటులు పొలిటిక్స్‌లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత అందులో కొనసాగే వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు.ఓ సారి ఓడిపోయిన తర్వాత రాజకీయాల్లో కొనసాగడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించరు. కానీ రోజా మాత్రం రెండు సార్లు ఓడిపోయినా.. ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. అపుడు మాత్రం ప్రతిపక్షంలో ఉన్నారు. తాజాగా ఈమె మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

  RRR : రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ హిందీ డిజిటల్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..

  2014, 2019 వరుసగా రెండు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీ వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఒక నటిగా ఉంటూ ఓ పారి ఎన్నికల్లో ఓడిపోయినా.. ఆ తర్వాత పోటీ చేసిన రెండు ఎన్నికల్లో మాత్రం ఎమ్మెల్యేగా గెలిచింది.  రాజకీయాల్లో ఓడిపోయినా.. ఎక్కడ కృంగిపోకుండా.. పట్టుదలతో రెండోసారి వరుసగా ఎమ్మెల్యేగా గెలవడంతో పాటూ రాజకీయాల్లో కొనసాగడం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్‌గా రోజాది ఒక రికార్డు అనే చెప్పాలి. రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో పాటు తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న పార్టీ అధికారంలోకి రావడంతో ఆమెపై ఉన్న ఐరెన్ లెగ్ ముద్ర చెరిపేసుకున్నారు.

  Sarkaru Vaari Paata 5 Days WW Collections : మహేష్ బాబు ’సర్కారు వారి పాట’ 5 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్..

  ముందుగా మంత్రి పదవి ఆశించినా.. సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆమెకు స్ఠానం దక్కలేదు. తాజాగా రెండోసారి మంత్రివర్గ విస్తరణలో ఆమె ఎట్టకేలకు మంత్రి పదవి లభించింది. ముందుగా ఆమెకు ‘ఏపీఐఐసీ’ చైర్మన్ పదవిని కట్టబెట్టారు ఏపీ సీఎం జగన్. ఆ పదవిలో ఎమ్మెల్యే రోజా నిన్న మొన్నటి వరకు  కొనసాగారు.  ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతూనే.. జబర్ధస్త్ వంటి కామెడీ షోలకు జడ్జ్‌గా వ్యవహిరిస్తూ ఇటు రాజకీయాలు, ఇటు టీవీ సినిమాల్లో దూసుకుపోతుంది. మంత్రి పదవి లభించిన తర్వాత జబర్ధస్త్ షోకు గుడ్ బై చెప్పి ఒకింత భావోద్వేగానికి గురైయ్యారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Minister Roja, Tollywood, Ysrcp

  ఉత్తమ కథలు