హోమ్ /వార్తలు /సినిమా /

Roja: రోజా కూతురు చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. నిజమేనా ?

Roja: రోజా కూతురు చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. నిజమేనా ?

రోజా కూతురు అన్షు

రోజా కూతురు అన్షు

రోజా కూతురు చిన్న వయస్సు నుంచి బుక్స్ రాయడం ప్రారంభించింది. ఆ తర్వాత ఆమె పేద పిల్లల కోసం ఇంట్లోనే ట్యూషన్ చెప్పేది.

రోజా వెండితెరపై ఒకప్పుడు మెరిసిన హీరోయిన్. ఇప్పుడు కూడా అనేక సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ వచ్చింది.ఇక బుల్లితెరపై కూడా అనేక షోలు చేస్తూ సందడి చేసింది. రాజకీయాల్లోకి వచ్చాక రోజా(Roja).. ఫుల్ బిజీగా మారిపోయింది. నగరి ఎమ్మెల్యేగా రెండుసార్లు వరుసగా విజయం సాధించింది. ఇక ఇప్పుడు కేబినట్ పదవి కూడా దక్కించుకుంది. తన కెరియర్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో... ఫ్యామిలీకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తోంది రోజా. వీలు దొరికినప్పుడల్లా పిల్లలు,భర్త సెల్వమణితో టైమ్ గడుపుతుంటోంది. రోజా(Roja) ఎంత సెలబ్రిటీనో.. ఆమె భర్త ,పిల్లలు కూడా నిత్యం వార్తల్లో నిలుస్తూ సెలబ్రిటీలుగా మారారు. ఇక రోజ ముద్దుల కూతురు అన్షు మాలిక(Anshumalika) కూడా అంతే.తల్లి పేరును నిలబెడుతూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకంటుంది.

రోజా కూతురు అన్షు చిన్న వయసులోనే బుక్స్ రాసి అందర్నీ ఆశ్చర్య పరచింది. అంతే కాదు.. తల్లిలాగే తాను కూడా ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొని ఎంతో మంది పిల్లలకు అమ్మయ్యింది. అత్యంత చిన్న వయసులోనే వెబ్ డెవలపర్ గా, కంటెంట్ క్రియేటర్ గా, రైటర్ గా, సోషల్ వర్కర్ గా అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తోంది రోజా ముద్దుల కూతురు అన్షు మాలిక(Anshumalika).టాలెంట్ ఉండి కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవాళ్లకు.. అది ఎలా నేర్చుకోవాలో తెలియక దిశానిర్దేశం చేసేవారు లేక ఆగిపోయిన పిల్లల కోసం ట్రాన్స్ ఫార్మింగ్ లైఫ్ విత్ కోడింగ్ అనే పేరుతో ఒక స్కూల్ క్లబ్ కూడా స్టార్ట్ చేసింది అన్షు మాలిక.

అంతేకాదు.. అన్షు(Anshu) తన ఇంటి వద్ద పలువురు పిల్లలకు ట్యూషన్స్ కూడా చెప్పింది. అయితే డబ్బుల కోసం మాత్రం కాదు. ఇంటి దగ్గర బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో పనిచేసే పేద పిల్లలను ఇంటికి తీసుకు వచ్చి వారికి తిండి పెట్టింది. ఆ పిల్లలకు చదువు కూడా చెప్పింది. పిల్లలకు అవసరమైన బుక్స్ కూడా పంచేది. ఇవన్నీ చేసేటప్పుడు అన్షు వయసు కేవలం 12 నుంచి13 ఏళ్లు మాత్రమే. రోజూ తను కు స్కూల్ నుంచి వచ్చాక పేద పిల్లలకు ట్యూషన్ చెప్పేది.

అంతేకాకుండా ఆర్థికంగా చదువుకోవడానికి స్థోమత లేని వారి కోసం కూడా అన్షు మాలిక తన వంతు సాయం చేస్తోంది. చదవాలని కోరిక ఉండి చదువుకోలేని వారి కోసం కూడా అన్షు ఓ యాప్ క్రియేట్ చేసింది. చీస్ ఫౌండేషన్ ద్వారా ఐదుగురు అనాధ పిల్లలను దత్తత తీసుకొని ఆ పిల్లల బాధ్యతలను తానే స్వయంగా చూసుకుంటూ అమ్మగా మారింది అన్షు. అంతేకాకుండా స్మైల్ హండ్రెడ్ అనే మరో సంస్థ స్థాపించి దాని ద్వారా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న వందమంది విద్యార్థులను ఎంపిక చేసి వారు విదేశాల్లో ఉన్నత చదువులు చదవడానికి కృషి చేస్తోంది.అన్షు చేస్తున్న మంచి పనులు చూసి రోజాతో పాటు...ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రోజా రాజకీయాల్లోకి వచ్చాక ప్రజా సేవ చేస్తుంటే.. అన్షూ చిన్నప్పటి నుంచి సామజిక సేవ చేస్తుందంటూ ఆమెను ప్రశంసిస్తున్నారు.

First published:

Tags: MLA Roja, Rk roja, Roja, Roja daughter photos

ఉత్తమ కథలు