హోమ్ /వార్తలు /సినిమా /

Roja Vs Suma: రోజా కంటే సుమ 15 ఏళ్లు చిన్నదా? జబర్దస్త్ షోలో ఇద్దరి మధ్య ఇంట్రస్టింగ్ ఫైట్

Roja Vs Suma: రోజా కంటే సుమ 15 ఏళ్లు చిన్నదా? జబర్దస్త్ షోలో ఇద్దరి మధ్య ఇంట్రస్టింగ్ ఫైట్

యాంకర్, సుమ ఇంట్రస్టింగ్ ఫైట్

యాంకర్, సుమ ఇంట్రస్టింగ్ ఫైట్

సుమను .. సుమ గారు అంటూ రోజా మాట్లాడారు. దీంతో సుమ.. మీరేంటి నన్ను సుమ గారు అంటున్నారు.. మీ కన్న నేను 15 ఏళ్ల చిన్నాదాన్ని అంటూ.. కామెంట్ చేసింది.

జబర్దస్త్ షోలో యాంకర్ సుమ సందడి చేసింది. తాను లీడ్ రోల్ ప్లే చేస్తూ నటించిన జయమ్మ పంచాయతీ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ షోకు వచ్చింది సుమ. దీంతో జబర్దస్త్ కమెడియన్లంతా వరుసగా సుమపై స్కిట్స్ వేస్తూ అలరించారు. తాగుబోతు రమేష్ సుమ క్యారెక్టర్‌ను ఇమిటేట్ చేస్తూ వేసిన స్కిట్ అందరితో నవ్వులు పూయించింది. ఈవెంట్లతో సుమ ఎంత బిజీగా ఉంటుంది.. భర్త రాజీవ్ కనకాలతో ఇంట్లో ఎలా ఉంటుందో అన్న దానిపై తాగుబోతు రమేష్ వేసిన స్కిట్ అందర్నీ ఆకట్టుకుంది. దీంతో సుమ గెటప్‌లో తాగుబోతు రమేష్ వేసిన గెటప్ చాలా బావుందంటూ.. రోజా ప్రశంసించింది. ఈ సందర్భంగా సుమగారు గెటప్‌లో తాగుబోతురమేష్ బాగా నటించాడని అంటారు. దీంతో అడ్డు తగిలిన సుమ .. మీరేంటి నన్ను సుమ గారు అంటున్నారు.. మీకన్నా నేను 15 ఏళ్లు చిన్నాదాన్ని తెలుసా అంటూ రోజాకు రిప్లై ఇచ్చింది. అలాం అంటూనే.. అక్కడున్న మరో జడ్జీ మను కూర్చీ వెనుకాలే మొఖం దాక్కొనే ప్రయత్నం చేస్తోంది.

దీంతో రోజా కల్పించుకుంటూ.. ‘ఎప్పుడొచ్చింది.. నేను హీరోయిన్‌గా వచ్చినప్పుడు హీరోయిన్‌గా వచ్చింది’ అంటూ సెటైర్లు వేశారు. దీంతో సుమ బుంగమూతి పెట్టుకొని అక్కడే సైలంట్ అయిపోతుంది. కొంచెం గ్యాప్ ఇస్తే.. ఏకంగా 15 ఏళ్లు వెనక్కి నెట్టేసింది అంటూ సుమను రోజా ఓ ఆట ఆడేసుకుంది. ఏంలేదు.. ఇద్దరి ఇండస్ట్రీకి ఒకేసారి వచ్చాం.. ఇద్దరం.. సెమ్ టు సేమ్ అంటూ కామెంట్స్ చేశారు రోజా. ఆ తర్వాత సుమ గెటప్ వేసుకున్న తాగుబోతు రమేష్ తాగినట్లే ఉన్నాడంటూ రోజా అన్నారు.

సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయతీ’. విజయ్‌ కుమార్‌ కలివరపు దర్శకత్వంలో బలగ ప్రకాశ్‌ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌ 22న రిలీజ్‌‌కు సిద్ధమవుతోంది. ‘‘పల్లెటూరి డ్రామాగా రూపొందిన చిత్రమిది. ఎవరికీ, దేనికీ లొంగని పల్లెటూరి మహిళగా సుమ నటించారు. రామ్‌చరణ్‌ రిలీజ్‌ చేసిన మా టైటిల్, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కి, నాని రిలీజ్‌ చేసిన తొలి పాటకి, రానా దగ్గుబాటి విడుదల చేసిన టీజర్‌కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మరి జయమ్మగా సుమ పెడుతున్న పంచాయతీ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

First published:

Tags: Anchor suma, Jabardast, Suma Kanakala

ఉత్తమ కథలు